
మొబైల్ కు ఛార్జింగ్ పెట్టే విషయంలో చాలామంది చాలా తప్పులు చేస్తుంటారు. దీనివల్ల బ్యాటరీ పై నెగెటివ్ ఎఫెక్ట్ పడుతుంది. చాలా ఏళ్లు రావాల్సిన బ్యాటరీ రెండేళ్లలోనే పాడవుతుంది. అంతేకాదు కొన్నిసార్లు ఫోన్ కూడా పాడయ్యా అవకాశం ఉంది. అయితే ఫోన్ ఛార్జింగ్ పెట్టే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మెరుగైన బ్యాటరీ లైఫ్ పొందొచ్చు. అదెలాగంటే..
చాలామందికి స్మార్ట్‌ఫోన్‌లను పూర్తిగా ఛార్జ్ చేసే అలవాటు ఉంటుంది . బ్యాటరీ 100 శాతం ఛార్జ్ అయ్యే వరకు ఛార్జర్ తీసివేయరు. కొంతమంది రాత్రిపూట ఫోన్ ఛార్జింగ్ పెట్టి నిద్రపోతుంటారు. అయితే ఈ అలవాటు వల్ల మీ మొబైల్ లోని బ్యాటరీ జీవితకాలం వేగంగా తగ్గిపోతుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే బ్యాటరీని ఫుల్ ఛార్జ్ చేసిన ప్రతీసారీ అది అధిక వోల్టేజ్ కు వెళ్లిపోతుంది. అప్పుడు బ్యాటరీలో కొన్ని రసాయన మార్పులు జరుగుతాయి. దీనివల్ల ఎక్కువసేపు బ్యాటరీ వస్తుంది. కానీ, క్రమంగా బ్యాటరీ ఛార్జింగ్ సైకిల్స్ తగ్గిపోయే అవకాశం ఉంది. అంటే బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. నాలుగేళ్లు రావాల్సిన బ్యాటరీ రెండేళ్లలోనే డెడ్ అయిపోతుంది. అలాగే ఫోన్ ఛార్జింగ్ పెట్టి వదిలేయడం వల్ల కూడా బ్యాటరీ త్వరగా పాడయ్యే అవకాశం ఉంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి