AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Air Conditioner: వేసవి ఎఫెక్ట్.. ఈ చిన్న పని చేస్తే మీ ఏసీ పాడయ్యే ప్రమాదమే ఉండదు..

వేసవి నేపథ్యంలో ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో చల్లదనం కోసం ఇళ్లల్లో ఏసీలు ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఏసీని వాడేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎక్కువ రోజులు పనిచేస్తాయి. చాలామంది మెయింటనెన్స్ గురించి పట్టించుకోరు. కానీ ఏసీని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి.

Air Conditioner: వేసవి ఎఫెక్ట్.. ఈ చిన్న పని చేస్తే మీ ఏసీ పాడయ్యే ప్రమాదమే ఉండదు..
Air Conditioner 1
Venkatrao Lella
|

Updated on: May 21, 2026 | 5:09 PM

Share

సమ్మర్ కావడంతో ఎండ వేడిని తట్టుకునేందుకు ఇళ్లల్లో ఏసీ వినియోగం అనేది బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు ఠాకెత్తిస్తున్నాయి. దీంతో ఏసీ సేల్స్ కూడా పెరుగుతున్నాయి. ఏసీని ఎలా వాడాలనేది చాలామందికి తెలియదు. దీంతో ఎయిర్ కండీషనర్ గురించి పట్టించుకోవడమే మానేస్తారు. అలా వదిలిస్తే ఏసీ త్వరగా పాడయ్యే అవకాశముంటుంది. కొన్ని జాగ్రత్తలు పాటించడం వల్ల ఏసీ ఎక్కువకాలం పనిచేస్తుంది. కొన్ని చిన్న టిప్స్ పాటిస్తే ఏసీ ఎక్కువ రోజులు పనిచేస్తుంది. అవేంటో చూద్దాం.

ఏసీ సర్వీసింగ్

ఏసీని సర్వీసింగ్ చేయించుకుంటూ ఉండాలి. ఏసీ ఫిల్టర్లలో దుమ్ము, బ్యాక్టీరియా వంటివి పేరుకుపోతూ ఉంటాయి. దీంతో ఫిల్టర్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ ఉండాలి. దీని వల్ల ఏసీ నుంచి వచ్చే గాలి శుభ్రంగా, ఆరోగ్యకరంగా ఉంటుంది. వేసవికాలంలో ఏసీ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఎండాకాలం వచ్చే ముందు ఏసీని సర్వీసింగ్ చేయించుకోవాలి. ఏడాదికి మూడు లేదా నాలుగుసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించుకోవాలి. దీని వల్ల ఏసీ మెరుగ్గా పనిచేయడమే కాకుండా దాని సామర్థ్యం కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఎలాంటి సమస్యలు లేకుండా ఏసీ పనిచేస్తుంది.

ఏడాదికి ఎన్నిసార్లు చేయించుకోవాలి..?

మీరు నివసించే ప్రాంతాన్ని బట్టి ఏసీ సర్వీసింగ్ ఏడాదికి ఎన్నిసార్లు చేయించుకోవాలనేది నిర్ణయించుకోండి. మెట్రో సిటీలు, పారిశ్రామిక ప్రాంతంలో నివసిస్తుంటే ప్రతీ మూడు నుంచి 4 నాలుగు నెలలకు సర్వీసింగ్ చేయించుకోండి. ఇక అవుట్ డోర్ యూనిట్‌లో కూడా దమ్ము, ధూళి అనేవి పేరుకుపోతూ ఉంటాయి. దీంతో అవుట్ డోర్ యూనిట్‌కు కూడా తరచుగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. దీంతో ఏసీ బాగా పనిచేస్తుంది. ఇక నెలకు ఒకసారి ఫిల్టర్లను క్లీన్ చేసుకోవాలి. అలాగే కూలింగ్ గ్యాస్ లెవల్స్ సరిగ్గా ఉన్నాయా.. లేవా అనేది చూసుకోండి. ఇక ఏసీ కాయిల్స్, ఫిన్‌లను క్లిక్ చేసుకోండి. ఇక డ్రైనేజీ పైపును చూసుకోండి. పైపు మూసుకుపోతే ఏసీ నుంచి వాటర్ లీక్ అవుతుంది. అందుకే పైప్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ చిన్న టిప్స్ పాటించడం వల్ల మీ ఏసీ మెరుగ్గా చేయడమే కాకుండా కరెంట్ బిల్లు కూడా ఆదా అవుతంది.

Follow Us
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
ఏడాదికి ఎన్నిసార్లు ఏసీ సర్వీసింగ్ చేయించాలి..?
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
కేవలం మూడు నిముషాల్లోనే బాడీని కూల్ చేసే వడలు..
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
ప్రమాదం అంచున విలవిలలాడిన శునకం.. ఫైర్ సిబ్బంది వీడియో వైరల్
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
SRH కెప్టెన్ బౌలింగ్.. ‘పెద్ది’ భామ బ్యాటింగ్.. వీడియో ఇదిగో
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఐపీఎల్ ప్లేఆఫ్స్ సస్పెన్స్ క్లైమాక్స్‎కు వచ్చేసింది
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
ఎబోలా వైరస్ కల్లోలంపై భారత్ హైఅలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
మామిడి పండ్లతో టేస్టీ డెజర్ట్.. కుండలో చల్లటి మ్యాంగో ఫిర్నీ..
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
చీకటి పడ్డాక పొరపాటున కూడా ఈ దేవుళ్ల పేర్లు తలవకూడదట!
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
మీ పాదాల అందాన్ని పాడుచేస్తున్న మడమల పగుళ్లు.. చిటికెలో మాయం
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్
ఈ గిన్నెలో చాయ్ పెడ్తే రోగాలు మాయం.. పూర్వీకులు చెప్పిన ట్రిక్