Google Search 2025: ఈ ఏడాది ఎక్కువమంది గూగుల్‌లో ఏం వెతికారో తెలుసా..? టాప్ ట్రెండ్ లో ఉన్నవి ఇవే..

గూగుల్ తన 'ఇయర్ ఇన్ సెర్చ్' నివేదికను విడుదల చేసింది, 2025లో భారతదేశంలో టాప్ ట్రెండింగ్‌లను వెల్లడించింది. క్రికెట్ (ఐపీఎల్, ఆసియా కప్), గూగుల్ జెమిని వంటి సాంకేతికత, సెలబ్రిటీల గురించి ప్రజలు విస్తృతంగా శోధించారు. ఇది 2025 లో భారతదేశంలో అత్యధికంగా వేదికిన అంశాలను అంచనా వేస్తుంది. ఇది అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలను మాత్రమే కాకుండా, అత్యధిక పదాలు, వాటికి అర్థాలను కూడా వెల్లడిస్తుంది.

Google Search 2025: ఈ ఏడాది ఎక్కువమంది గూగుల్‌లో ఏం వెతికారో తెలుసా..? టాప్ ట్రెండ్ లో ఉన్నవి ఇవే..
Google Search 2025

Updated on: Dec 14, 2025 | 7:09 PM

రివైండ్ 2025: ప్రతి సెకనులో ఎవరో ఒకరు గూగుల్‌లో ఏదో ఒకటి వెతుకుతారు. అది సెలబ్రిటీ, సినిమా, క్రికెట్ లేదా ఇతర క్రీడల గురించి సమాచారం అయినా కావొచ్చు. లేదా AI (జెమిని, గ్రోక్, చాట్‌జిపిటి) వంటి ఇతర సాంకేతిక సాధనాల గురించి సమాచారం అయినా కావొచ్చు. మరెన్నో ఇతర విషయాల కోసం కూడా ప్రజలు గూగుల్‌లో సెర్చ్‌ చేస్తుంటారు..ఈ క్రమంలోనే గూగుల్ ఇటీవల తన ఇయర్ ఇన్ సెర్చ్ నివేదికను విడుదల చేసింది. ఇది 2025 లో భారతదేశంలో అత్యధికంగా వేదికిన అంశాలను అంచనా వేస్తుంది. ఇది అత్యధికంగా సెర్చ్ చేసిన అంశాలను మాత్రమే కాకుండా, అత్యధిక పదాలు, వాటికి అర్థాలను కూడా వెల్లడిస్తుంది.

2025 సంవత్సరంలో భారతదేశంలో గూగుల్‌లో అత్యధికంగా వెతికిన విషయం..

2025 సంవత్సరం ముగియకముందే, గూగుల్ తన ఎయిర్ ఇన్ సెర్చ్ నివేదికను విడుదల చేసింది. ఈ సంవత్సరం క్రికెట్‌కు సంబంధించి భారతీయులు అత్యధిక ప్రశ్నలు అడిగారని పేర్కొంది. ఇందులో ఇండియన్ క్రికెట్ లీగ్ (ఐపీఎల్) మొదటి స్థానంలో నిలిచింది. దీనితో పాటు, భారతీయ వినియోగదారులు గూగుల్ జెమిని, ఆసియా కప్, ప్రో కబడ్డీ లీగ్ వంటి అనేక క్రికెట్ సంబంధిత నవీకరణల కోసం కూడా వెతుకుతున్నారు. దివంగత నటుడు ధర్మేంద్ర, మహాకుంభమేళా, సైయారా చిత్రం వంటి అనేక మంది సినీ తారలు కూడా టాప్ ట్రెండ్‌లలో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఈ పదాల అర్థాలను ఎక్కువగా వెతికారు..

అనేక పదాల అర్థాలను తెలుసుకోవడానికి కూడా Googleలో వెతికారు. ఈ సంవత్సరం భారతీయ వినియోగదారులు ఎక్కువగా శోధించిన పదాల జాబితా ఇక్కడ ఉంది:

1. కాల్పుల విరమణ అర్థం

2. మాక్ డ్రిల్ అర్థం

3. పూకీ అర్థం

4. మేడే అర్థం

5.5201314 అర్థం

దీనితో పాటు, అనేక ఇతర పదాల అర్థాలను కూడా సెర్చ్‌ చేశారు. వీటిలో లాటెంట్, నాన్స్, స్టాంపేడ్ , ఈ సాలా కప్ నమ్దే వంటి పదాలు ముందు వరుసలో ఉన్నాయి. వీటన్నింటితో పాటు భారతీయ వినియోగదారులు ఒక నెంబర్‌ని అత్యధికంగా వెతుకుతున్నారు. ఈ సంఖ్య 5201314 గురించి వెతుకుతూనే ఉన్నారు. ఇది సాధారణ సంఖ్యలా కనిపిస్తుంది. కానీ, దీనికి చైనీస్ భాషలో ప్రత్యేక అర్థం ఉంది. అంటే ‘నా జీవితాంతం నేను నిన్ను ప్రేమిస్తాను’. ఈ సంఖ్యను భారతదేశంలో పెద్ద సంఖ్యలో శోధించడమే కాకుండా, భారతీయులు కూడా దీనిని ఉపయోగించారు. వీటన్నింటితో పాటు 2025 సంవత్సరంలో చిత్ర పరిశ్రమ, ప్రస్తుత సంఘటనలకు సంబంధించిన అనేక శోధనలు కూడా జరిగాయి.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..