సరికొత్త ప్లాన్‌తో వచ్చిన వొడాఫోన్ ఐడియా.. ఒక్కసారి రిఛార్జి చేసుకుంటే ఆరు నెలలు పండగే
టెలికాం కంపెనీలు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్‌లతో ముందుకు వస్తాయి. ఇప్పుడు తాజాగా ప్రముఖ టెలికాం కంపెనీ వొడఫోన్ ఐడియా తమ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌తో వచ్చింది. కేవలం రూ.549 కే 180 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందించనుంది.
టెలికాం కంపెనీలు వినియోగదారుల్ని ఆకర్షించేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్‌లతో ముందుకు వస్తాయి. ఇప్పుడు తాజాగా ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్ ఐడియా తమ కస్టమర్ల కోసం సరికొత్త ప్లాన్‌తో వచ్చింది. కేవలం రూ.549 కే 180 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌ను అందించనుంది. ఒకసారి రిఛార్జ్ చేస్తే దాదాపు ఆరు నెలల వరకు దీన్ని వినియోగించుకోవచ్చు. డేటాతో ఎక్కువగా అవసరం లేకుండా కేవలం పరిమిత కాల్స్ మాత్రమే కావాలనుకునే వారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. ప్రస్తుతం అన్ని టెలికాం కంపెనీలు అందిస్తున్న రీఛార్జ్ ప్లానుల్లో డేటాతో పాటు కాల్స్‌ను అందిస్తున్నాయి.
అందుకు భిన్నంగా వొడాఫోన్ ఐడియా ఈ కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.549తో రీఛార్జి చేసుకుంటే రూ.549 టాక్‌టైమ్ లభిస్తుంది. లోకల్/ ఎస్టీడీ కాల్స్‌కు నిమిషానికి 2.5 పైసా చొప్పున ఛార్జ్ చేస్తారు. కేవలం 1జీబీ డేటా లభిస్తుంది. ఒకవేళ ఆ డేటా అయిపోతే డేటా వోచర్లతో రీఛార్జి చేసుకోవాలి. అపరిమిత కాల్స్, ఎస్సెమ్మెస్ సదుపాయం లేదు. సెకండరీ సిమ్‌గా వొడాఫోన్ ఐడియా వాడేవారికి ఈ ప్లాన్ ఉపయోగపడుతుంది. సెకండ్ సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచేందుకు ఇప్పుడు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి ఉంటోంది. అందుకే చాలా మంది ఇక రెండో సిమ్‌కు వాడేందుకు ఇష్టపడటం లేదు. ఈ నేపథ్యంలోనే వొడాఫోన్ ఐడియా ఈ లాంగ్‌టర్మ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..