AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

VI Recharge Plans: వినియోగదారులను ఆకట్టుకునేందుకు వీఐ కొత్త స్కెచ్‌.. ఆ చాయిస్‌ మీ చేతిలోనే..!

టెలికాం కంపెనీలు పోస్ట్‌పెయిడ్‌ యూజర్లను ఆకట్టుకోవడానికి వివిధ రీచార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా వొడాఫోన్‌ ఐడియా సరికొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. వీఐ ఆపరేటర్ ఛాయిస్ ప్లాన్‌లను ప్రకటించింది. కొత్త ఛాయిస్ ప్లాన్‌లు వీఐ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు వినోదం, ఆహారం, ప్రయాణం, మొబైల్ భద్రతలో ప్రత్యేకమైన జీవనశైలి ప్రయోజనాలను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తాయి.

VI Recharge Plans: వినియోగదారులను ఆకట్టుకునేందుకు వీఐ కొత్త స్కెచ్‌.. ఆ చాయిస్‌ మీ చేతిలోనే..!
Mobile
Nikhil
|

Updated on: Sep 02, 2023 | 4:00 PM

Share

భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం పెరిగింది. ముఖ్యంగా భారతదేశంలోని టెలికాం రంగంలో జియో ఎంట్రీ తర్వాత అన్ని కంపెనీలు తక్కువ ధరకే డేటా  ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ అనే కొత్త తరహా ప్రీపెయిడ్‌ ప్లాన్స్‌ అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో పోస్ట్‌పెయిడ్‌ యూజర్లు టెలికాం కంపెనీలకు తగ్గారు. దీంతో టెలికాం కంపెనీలు పోస్ట్‌పెయిడ్‌ యూజర్లను ఆకట్టుకోవడానికి వివిధ రీచార్జ్‌ ప్లాన్స్‌ అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. తాజాగా వొడాఫోన్‌ ఐడియా సరికొత్త పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. వీఐ ఆపరేటర్ ఛాయిస్ ప్లాన్‌లను ప్రకటించింది. కొత్త ఛాయిస్ ప్లాన్‌లు వీఐ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులకు వినోదం, ఆహారం, ప్రయాణం, మొబైల్ భద్రతలో ప్రత్యేకమైన జీవనశైలి ప్రయోజనాలను ఎంచుకోవడానికి వీలు కల్పిస్తాయి. ఈ తాజా ప్లాన్స్‌ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

చాయిస్‌ ప్లాన్‌లు ప్రత్యేకంగా వీఐ పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల కోసం రూపొందించారు. ఈ ప్లాన్ వినియోగదారులకు అత్యంత సంబంధిత ప్రయోజనాలను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఈ కొత్త ప్రతిపాదన ప్రకారం వీఐ వ్యక్తిగత, ఫ్యామిలీ పోస్ట్‌పెయిడ్ వినియోగదారులు నాలుగు ప్రత్యేక వర్గాలలో తమకు నచ్చిన ప్రీమియం భాగస్వామి నుంచి  అనేక రకాల ప్రయోజనాలను ఎంచుకోవచ్చు. ఆ వివరాలు ఇవే

  • వినోదం: వినియోగదారులు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ అయిన అమెజాన్‌, ప్రైమ్‌, డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌, సోనీ లైవ్‌, సన్‌నెక్ట్స్‌ వంటివి ఎంచుకోవచ్చు. 
  • ఆహారం: ఈజీడిన్నర్‌కు 6 నెలల సభ్యత్వం, ప్రీమియం రెస్టారెంట్లు, బార్‌లలో 50 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది
  • ప్రయాణం: ఈజ్‌మైట్రిప్‌ 1 సంవత్సరం సభ్యత్వం అందిస్తుంది. అలాగే రౌండ్ ట్రిప్ బుకింగ్‌పై రూ. 750 తగ్గింపు లేదా రూ.400 ప్రతి నెలా విమాన టిక్కెట్లపై తగ్గింపును పొందవచ్చు.
  • స్మార్ట్‌ఫోన్ భద్రత: మొబైల్ పరికరం కోసం నార్టన్ యాంటీ-వైరస్ రక్షణ కోసం సంవత్సరం సభ్యత్వం పొందవచ్చు.

ఈ ఆఫర్‌లు వినియోగదారు/కస్టమర్ ఎంచుకునే ప్లాన్‌పై ఆధారపడి ఉంటాయి. దీనితో పాటు వీఐ వినియోగదారులు వీఐ గేమ్స్‌, వీఐ సంగీతం, వీఐ జాబ్స్‌, ఎడ్యుకేషన్‌, వీఐ సినిమాలు, టీవీ వంటి ఇతర ప్రత్యేక ప్రయోజనాలకు కూడా యాక్సెస్ పొందుతారు. వీఐ మ్యాక్స్‌ పోస్ట్‌పెయిడ్ ప్లాన్‌లు మీ సొంత క్రెడిట్ పరిమితిని సెట్ చేసుకోవడం, ప్రాధాన్యత కలిగిన కస్టమర్ సర్వీస్ వంటి ఇతర ప్రత్యేక ప్రయోజనాలను అందిస్తాయి.

ఇవి కూడా చదవండి

చాయిస్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ ధరలు ఇవే

వీఐ చాయిస్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్స్‌ రూ.401, రూ.501, రూ.701, రూ.1101 ధరల్లో అందుబాటులో ఉన్నాయి. ధరను బట్టి ఇందులో వచ్చే సదుపాయాలు మారుతూ ఉంటాయి. 

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.