IPhone-13: ఐఫోన్ 13పై అదిరిపోయే డిస్కౌంట్.. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్స్‌లో లభ్యం.. ధర ఎంతంటే?
యాపిల్ కంపెనీ తన ఐఫోన్ -13పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ -13పై భారీ తగ్గింపులో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఎటువంటి నిబంధనలు, షరతులు లేకుండా భారీ తగ్గింపును పొందుతున్నారు. కొత్త ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న వస్తుందని యాపిల్ ప్రకటించినందున ఐఫోన్-13పై ఈ తాజా తగ్గింపు అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

స్మార్ట్‌ఫోన్స్లో ఐఫోన్స్‌కు ఉన్న క్రేజ్ వేరు. ముఖ్యంగా ఐఫోన్ వాడడం అనేది ఓ స్టేటస్ సింబల్‌లా యువత ఫీలవుతూ ఉంటారు. ఇప్పటిదాకా చాలా మోడల్స్‌లో ఐఫోన్‌లు విడుదలవుతూనే ఉన్నాయి. మరికొన్ని రోజుల్లో ఐ ఫోన్-15 రిలీజ్ అవుతుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో యాపిల్ కంపెనీ తన ఐఫోన్ -13పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ -13పై భారీ తగ్గింపులో అందుబాటులో ఉంది. వినియోగదారులు ఎటువంటి నిబంధనలు, షరతులు లేకుండా భారీ తగ్గింపును పొందుతున్నారు. కొత్త ఐఫోన్ 15 సిరీస్ సెప్టెంబర్ 12న వస్తుందని యాపిల్ ప్రకటించినందున ఐఫోన్-13పై ఈ తాజా తగ్గింపు అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
పదిరోజుల ముందు తగ్గింపు ఎందుకు?
ఐఫోన్ 13 ప్రస్తుతం అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలో రూ. 58,999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంది. అలాగే ఈ ఫోన్‌పై బ్యాంక్ ఆఫర్‌లు, ఇతర తగ్గింపు ఆఫర్‌లు అదనంగా లభిస్తాయి. గతంలో బ్యాంకు ఆఫర్లతో కలిపితే ఈ ధరకు ఫోన్ అందుబాటులో ఉంది. ఇప్పుడు ఎలాంటి ఆఫర్లు అందుబాటులో లేకపోయినా ఈ ఫోన్ రూ.58,999కు అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉన్న వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్ ద్వారా ఐఫోన్ 13ని ధర రూ.56,999కు కొనుగోలు చేయవచ్చు. అయితే అమెజాన్‌లో మాత్రం ఎలాంటి బ్యాంక్ ఆఫర్ లేదు. కానీ ఈ రెండు ప్లాట్‌ఫారమ్‌లు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.
ఐఫోన్-13 కొనుగోలు చేయాలా?
యాపిల్ కంపెనీ ఐఫోన్-15 రిలీజ్ చేస్తున్నట్లు స్పష్టం ప్రకటించడంతో ఇప్పుడు ఈ ఫోన్ కొనుగోలు చేయాలా? అనే అనుమానం అందరికీ వస్తుంది. అయితే తక్కువ ధరలో ఐఫోన్ సొంతం చేసుకోవాలని అనుకునే వారికి ఇది మంచి డీల్ అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐఫోన్-15 ధర రూ.80 వేలు పైగానేఉంటుందని అంచనా మేరకు ఈ ఫోన్‌ను కొనుగోలు చేయడం ఉత్తమమని పేర్కొంటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం తక్కువ ధరకే ఐఫోన్‌ను సొంతం చేసుకోండి.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..