WhatsApp: వాట్సాప్ కొత్త పాలసీని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు… ప్రతి ఇద్దరిలో ఒకరు పాలసీని వ్యతిరేకిస్తున్నారు..
WhatsApp’s New Privacy Policy: వినియోగదారుని ప్రైవసీని ప్రశ్నార్థకంగా మారుస్తూ ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ ఎంత వివాస్పదంగా....
WhatsApp’s New Privacy Policy: వినియోగదారుని ప్రైవసీని ప్రశ్నార్థకంగా మారుస్తూ ప్రముఖ చాటింగ్ యాప్ వాట్సాప్ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ పాలసీ ఎంత వివాస్పదంగా మారిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ నిర్ణయాన్ని సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో ఆసక్తికర విషయం వెల్లడైంది. భారత్‌లోని ప్రతి ఇద్దరిలో ఒకరు వాట్సాప్ ప్రైవసీ పాలసీని వ్యతిరేకిస్తున్నట్లు తేలింది. ఇదిలా ఉంటే వాట్సాప్ కొత్త పాలసీ వచ్చే నెల 8 నుంచి అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. వాట్సాప్ తీసుకురానున్న కొత్త ప్రైవసీ పాలసీని యూజర్లు అంగీకరించకపోతే సేవలు నిలిపివేస్తామని ప్రకటించింది. ఈ విషయమై ప్రముఖ న్యూస్ యాప్ ఒకటి నిర్వహించిన సర్వేలో దేశంలో 47 శాతం మంది కొత్త పాలసీని ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని తేల్చి చెప్పారు. చాలా మంది టెలిగ్రామ్, సిగ్నల్ వంటి కొత్త యాప్‌లవైపు చూస్తున్నామని తెలిపారు. ఇక కేవం 14 శాతం మంది మాత్రమే కొత్త ప్రైవేసీ పాలసీని అంగీకరించనున్నట్లు తెలిపారు. మరి ఇంత వ్యతిరేకతలు ఎదురవుతోన్న సమయంలోనైనా వాట్సాప్ వెనుకడుగు వేస్తుందో లేదో చూడాలి.