ఆ ఫీచర్లు చూస్తే బైక్ లవర్స్‌కి నిద్రపట్టదు.. Triumph Bonneville T40 స్పెషాలిటీస్ ఇవే
ప్రీమియం బైక్‌ల తయారీ సంస్థ Triumph భారత మార్కెట్లో కొత్త Bonneville T40ను విడుదల చేసింది. క్లాసిక్ డిజైన్‌తో పాటు ఆధునిక సాంకేతికతను కోరుకునే రైడర్ల కోసం ఈ రెట్రో రోడ్‌స్టర్‌ను తీసుకొచ్చింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.2.80 లక్షలుగా నిర్ణయించారు. బుకింగ్స్ ప్రారంభం కాగా, డెలివరీలు నవంబర్ 2026 నుంచి మొదలుకానున్నాయి. 350cc విభాగంలోకి వచ్చిన ఈ బైక్, సంప్రదాయ బొన్నెవిల్లే రూపాన్ని ఆధునిక ఫీచర్లతో కలిపి అందిస్తోంది.

Bonneville T40లో 350cc సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను ఉపయోగించారు. ఇది 7,000rpm వద్ద 29hp శక్తిని, 5,500rpm వద్ద 31.2Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే ఈ బైక్‌ను సులభమైన, టార్క్ ఆధారిత ప్రయాణ అనుభూతి కోసం ప్రత్యేకంగా ట్యూన్ చేశారు. పొడవైన గేరింగ్‌తో పాటు ప్రత్యేక ఎగ్జాస్ట్ డిజైన్ కూడా ఇందులో ఉన్నాయి.
ప్రత్యేక ఛాసిస్
ఈ బైక్‌లో ట్విన్ షాక్ అబ్జార్బర్లు, ట్యూబ్యులర్ స్టీల్ స్వింగార్మ్‌ను అందించారు. ముందు 43mm టెలిస్కోపిక్ ఫోర్క్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్లు ఉన్నాయి. రెండింటిలోనూ 130mm ట్రావెల్ లభిస్తుంది. బ్రేకింగ్ కోసం ముందు 310mm, వెనుక 255mm డిస్క్‌లు, లీన్ సెన్సిటివ్ ABS ఇచ్చారు. 18 అంగుళాల వైర్ స్పోక్ వీల్స్‌కు MRF టైర్లు అమర్చారు. బైక్ బరువు 195 కిలోలు కాగా, ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం 14.5 లీటర్లు. సీటు ఎత్తు 790mm, గ్రౌండ్ క్లియరెన్స్ 165mmగా ఉంది.
ఐదు రైడింగ్ మోడ్‌లు
Bonneville T40లో 4 అంగుళాల రౌండ్ కలర్ TFT డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణ. Road, Rain, Ecoతో పాటు రెండు కస్టమైజ్ చేసుకునే రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ABS, ట్రాక్షన్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ వంటి ఫీచర్లు అందించారు. Heritage మోడ్‌లో డిస్‌ప్లే పాతకాలపు రూపంలో కనిపిస్తుంది. Triumph Navigation యాప్‌తో ఫోన్‌ను కనెక్ట్ చేస్తే స్క్రీన్‌పై దారి వివరాలను చూడవచ్చు. రూ.2.80 లక్షల ధరలో క్లాసిక్ లుక్, ఆధునిక ఫీచర్లు కోరుకునే వారికి ఈ బైక్ మరో ఎంపికగా నిలుస్తుంది.
