AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పప్పు నానబెట్టకుండా అప్పటికప్పుడు చేసుకునే పెసరపప్పు వడలు..

నానబెట్టకుండా అప్పటికప్పుడు రుచికరమైన, క్రిస్పీ పెసరపప్పు వడలు ఇలా తయారు చేసుకోండి. వేడి నీళ్లలో కొద్దిసేపు నానబెట్టి, సులభమైన పద్ధతిలో రుబ్బుకుని, వేడివేడిగా బ్రేక్‌ఫాస్ట్ లేదా సాయంత్రం స్నాక్‌గా తినొచ్చు. తక్కువ సమయంలో ఇంట్లో వడలు తయారయ్యే ఆరోగ్యకరమైన వంటకం.. ఎలా చేయాలంటే

Prasanna Yadla
|

Updated on: Oct 11, 2026 | 6:30 AM

Share
ముందుగా, స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెలో రెండు కప్పుల నీళ్లను వేడి చేయండి. మరో పక్కన, ఒక కప్పు పెసరపప్పును శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి. నీళ్లు బాగా వేడి అయిన తర్వాత, ఆ వేడి నీళ్లను కడిగిన పెసరపప్పులోకి వేసి బాగా కలిపి ఐదు నుండి పది నిమిషాలు నానబెట్టండి. ఇలా వేడి నీళ్లలో నానబెట్టడం వల్ల పప్పు చాలా త్వరగా నానిపోతుంది, ముందుగా నానబెట్టాల్సిన అవసరం ఉండదు.

1 / 5
పప్పు నానబెట్టే లోపు, ఐదారు పచ్చిమిర్చి, పొట్టు తీసిన 10-12 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఇంచ్ అల్లం ముక్క, కొద్దిగా కరివేపాకు మిక్సీ జార్‌లో వేసి బాగా గ్రైండ్ చేయండి. పది నిమిషాల తర్వాత, పప్పు దాదాపు 80% నాని ఉంటుంది. ఈ పప్పును నీళ్లు లేకుండా స్ట్రైనర్‌తో లేదా వంపేసి తీసుకోండి. ఇప్పుడు ఈ నానబెట్టిన పప్పులో ఒక పిడికెడు పప్పు పక్కన పెట్టి, మిగిలిన పప్పును మిక్సీ జార్‌లోని పచ్చిమిర్చి పేస్ట్‌లో వేయండి. అవసరమైతే ఒకటి రెండు టీస్పూన్ల నీళ్లు వేసి మరీ మెత్తగా కాకుండా, కొద్దిగా రవ్వ రవ్వగా ఉండేలా గ్రైండ్ చేయండి. ఇలా గ్రైండ్ చేస్తే వడలు క్రిస్పీగా వస్తాయి.

2 / 5

గ్రైండ్ చేసిన పప్పు మిశ్రమాన్ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోండి. పక్కన పెట్టిన ఒక పిడికెడు నానబెట్టిన పప్పును కూడా ఇందులోకి కలపండి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ జీలకర్ర, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, రెండు మూడు టేబుల్‌స్పూన్ల సన్నగా తరిగిన కొత్తిమీర ఆకు వేయండి. వడలకు మంచి బైండింగ్ కోసం ఒక టీస్పూన్ బియ్యప్పిండిని కూడా కలపండి. వడలు గట్టిగా రాకుండా, పైన క్రిస్పీగా రావడానికి పావు టీస్పూన్ వంట సోడా వేసి బాగా కలపండి. పిండి మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్‌గా ఉండాలి. అవసరమైతే ఒకటి రెండు టీస్పూన్ల నీళ్లు వేసి కలపవచ్చు.

3 / 5
డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనెను వేడి చేయండి. పిండిని చిన్న బాల్స్‌లా తీసుకుని, అరచేతిలో పెట్టి వడ ఆకారంలో వత్తుకోండి. వేడెక్కిన నూనెలో ఒక్కొక్క వడను జాగ్రత్తగా వేయండి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి, వడలు బంగారు రంగులోకి మారి క్రిస్పీగా అయ్యేవరకు తిప్పుతూ ఫ్రై చేయండి. హై ఫ్లేమ్‌లో వేయిస్తే బయట రంగు వచ్చి లోపల ఉడకవు.

4 / 5
చక్కగా వేగిన వడలను నూనె నుండి తీసి స్ట్రైనర్‌లో లేదా ప్లేట్‌లోకి తీసుకోండి. వేడి వేడి పెసరపప్పు వడలను పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ లేదా గ్రీన్ చట్నీతో ఆస్వాదించవచ్చు. పిల్లలు టమాటా కెచప్‌తో తినడానికి ఇష్టపడతారు. ఈ ఇన్స్టంట్ వడలు తక్కువ సమయంలోనే తయారై, మీ ఇంటిల్లిపాదికీ నచ్చుతాయి.

5 / 5
Follow Us