AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిరుద్యోగులకు అలర్ట్.. RRB JE పరీక్షల తేదీలు మారాయ్‌..! కొత్త తేదీలు ఇవే..

ఆర్‌ఆర్‌బీ జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) సహా 4,029 పోస్టుల భర్తీ పరీక్షల తేదీలను సవరించింది. మొత్తం పోస్టుల్లో సికింద్రాబాద్‌ జోన్‌లో 111 ఖాళీలు ఉన్నాయి. పరీక్షల షెడ్యూల్‌, విద్యార్హతలు, ఎంపిక ప్రక్రియ వివరాలు ఈ కింద తెలుసుకోండి..

నిరుద్యోగులకు అలర్ట్.. RRB JE పరీక్షల తేదీలు మారాయ్‌..! కొత్త తేదీలు ఇవే..
RRB JE and DMS Revised Exam Schedule
Srilakshmi C
|

Updated on: Oct 11, 2026 | 7:51 AM

Share

హైదరాబాద్‌, అక్టోబర్ 11: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) జూనియర్ ఇంజినీర్ (JE), డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ (DMS) సహా ఇతర పోస్టుల నియామక పరీక్షల తేదీలను సవరించింది. మొత్తం 4,029 పోస్టుల భర్తీకి నిర్వహించే ఈ పరీక్షలను తొలుత అక్టోబర్ 27, 28, 30 తేదీల్లో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినప్పటికీ.. తాజాగా షెడ్యూల్‌లో మార్పులు చేసింది. కొత్త షెడ్యూల్‌ ప్రకారం. అక్టోబర్ 27, 28 తేదీల్లో నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

ఈ నియామకాల ద్వారా ఎలక్ట్రికల్‌, ఇంజినీరింగ్‌, మెకానికల్‌, సిగ్నల్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ (S&T), స్టోర్స్‌ వంటి విభాగాల్లో పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో 3,994 జూనియర్ ఇంజినీర్‌, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ పోస్టులతో పాటు 35 కెమికల్‌ అండ్‌ మెటలార్జికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఉన్నాయి. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 111 ఖాళీలు ఉన్నట్లు సమాచారం. సంబంధిత ఇంజినీరింగ్‌ విభాగాల్లో డిప్లొమా లేదా ఇంజినీరింగ్‌ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులు. కెమికల్‌ అండ్‌ మెటలార్జికల్‌ అసిస్టెంట్‌ పోస్టులకు నోటిఫికేషన్‌లో పేర్కొన్న అర్హతల ప్రకారం బీఎస్సీ ఉత్తీర్ణత అవసరం. పోస్టుల వారీగా విద్యార్హతలు, ఇతర నిబంధనలను అధికారిక నోటిఫికేషన్‌లో పరిశీలించాలి.

ఎంపిక ప్రక్రియ ఇలా..

అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు. ఇందులో భాగంగా.. స్టేజ్‌-1 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT-1), స్టేజ్‌-2 కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT-2), ధ్రువపత్రాల పరిశీలన, రైల్వే వైద్య పరీక్ష నిర్వహిస్తారు. ఈ దశలను విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులు నియామకానికి అర్హత సాధిస్తారు. పరీక్ష తేదీల్లో మార్పులు చోటుచేసుకున్న నేపథ్యంలో అభ్యర్థులు తాజా షెడ్యూల్‌ను పరిశీలించాలి. పరీక్ష కేంద్రం, పరీక్ష సమయం, అడ్మిట్‌ కార్డు విడుదల వంటి వివరాల కోసం సంబంధిత రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కొత్త షెడ్యూల్‌కు అనుగుణంగా తమ ప్రిపరేషన్‌ను కొనసాగించాలి.

Follow Us