AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ ఫోన్లలో 5జీ పని చేయదు.. ఎందుకో తెలుసా?

4జీ యుగం అయిపొయింది. ఇప్పుడు వచ్చేదంతా 5జీ యుగమేనని అంతా అనుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మరికొద్ది రోజుల్లో 5జీ మొబైల్స్ మార్కెట్‌‌‌‌‌‌‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలైన గూగుల్, వన్ ప్లస్‌లు మాత్రం తమ కొత్త మొబైల్స్‌కు 5జీ ఫీచర్ లేకుండా తీసుకొచ్చాయి. ఇటీవల విడుదలైన పిక్సెల్‌ 4, వన్‌ప్లస్‌ 7టి ప్రో మోడళ్లను 5జీ ఫీచర్‌ లేకుండా లాంచ్‌ అయ్యాయి. దీని మీదే ఇప్పుడు టెకీలందరూ చర్చించుకుంటుండగా.. ఇటీవలే ఆ సంస్థలు […]

ఆ ఫోన్లలో 5జీ పని చేయదు.. ఎందుకో తెలుసా?
Ravi Kiran
|

Updated on: Oct 18, 2019 | 6:53 PM

Share

4జీ యుగం అయిపొయింది. ఇప్పుడు వచ్చేదంతా 5జీ యుగమేనని అంతా అనుకుంటున్నారు. దీనికి అనుగుణంగానే మరికొద్ది రోజుల్లో 5జీ మొబైల్స్ మార్కెట్‌‌‌‌‌‌‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రముఖ మొబైల్ తయారీ సంస్థలైన గూగుల్, వన్ ప్లస్‌లు మాత్రం తమ కొత్త మొబైల్స్‌కు 5జీ ఫీచర్ లేకుండా తీసుకొచ్చాయి. ఇటీవల విడుదలైన పిక్సెల్‌ 4, వన్‌ప్లస్‌ 7టి ప్రో మోడళ్లను 5జీ ఫీచర్‌ లేకుండా లాంచ్‌ అయ్యాయి. దీని మీదే ఇప్పుడు టెకీలందరూ చర్చించుకుంటుండగా.. ఇటీవలే ఆ సంస్థలు పూర్తి క్లారిటీ ఇచ్చాయి.

టెక్ ప్రపంచం అంతా పిక్సెల్ 4 మోడల్‌ను గూగుల్ 5జీ ఫీచర్‌తో విడుదల చేస్తుందని ఊహించారు. కానీ పిక్సెల్ 4 సిరీస్ మొబైల్స్ 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్ చేయవని ఆ సంస్థ ప్రకటించింది. దీనిపై ప్రొడక్ట్‌ డిజైన్‌ వైస్‌ప్రెసిడెంట్‌ బ్రియాన్‌ రకౌస్కీ మాట్లాడుతూ.. ‘‘మేం తప్పకుండా 5జీ నెట్‌వర్క్‌ను సపోర్ట్‌ చేసే ఫోన్లను అందుబాటులోకి తెస్తాము. కానీ దానికి  ఇది సరైన సమయం కాదని గూగుల్‌ భావిస్తోంది. విస్తరణ, నెట్‌వర్క్‌ పరంగా ఇప్పటికీ 5జీ నెట్‌వర్క్‌ అన్నిచోట్లా అందుబాటులో లేదు. దీంతో అతి తక్కువ మందికే 5జీ చేరువవుతోంది. దీనికి డిమాండ్‌ ఉన్నప్పటికీ ఇంకా పూర్తిగా వృద్ధిలోకి రాలేదు. అంతా సిద్ధమయ్యాక మేం 5జీ ఫోన్‌ తీసుకొస్తాం’’ అని పేర్కొన్నారు.

అటు వన్ ప్లస్ సంస్థ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. ఈ సంస్థ సీఈఓ మాట్లాడుతూ ‘ప్రతి మోడల్‌లో 5జీ ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం లేదు. తాము 5జీ మోడల్ ఫోన్లు తయారు చేయడానికి ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నామని.. అంతేకాక వాటి తయారీకి ప్రస్తుత పరిస్థితులు ఎంతవరకు సబబు అనే దానిపై దృష్టి సారించామని అన్నారు.

Follow Us
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విస్తుపోయే నిజాలు..హైదరాబాద్‌లో ఒకరు..
విజయవాడ ఉగ్ర లింకుల కేసులో విస్తుపోయే నిజాలు..హైదరాబాద్‌లో ఒకరు..
'ధురంధర్ 2' పై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. వీడియో
'ధురంధర్ 2' పై సిక్కుల ఆగ్రహం.. క్షమాపణలు చెప్పిన మాధవన్.. వీడియో
RCB: చిన్నస్వామిలో ఆ 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే..!
RCB: చిన్నస్వామిలో ఆ 11 సీట్లు ఎప్పటికీ ఖాళీగానే..!
బంగారం మార్కెట్‌లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు..
బంగారం మార్కెట్‌లో మహాప్రళయం.. 50 ఏళ్ల రికార్డులు బద్ధలు..
టెన్త్, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
టెన్త్, ఇంటర్ అర్హతతో కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్‌ ఉద్యోగాలు
భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే
భద్రాచలం టెంపుల్ స్టైల్ ప్రసాదం.. రవ్వ కేసరి ఇంట్లో ఎలా చేయాలంటే
గ్యాసే కాదు.. బ్యాంక్‌ లాకర్లు కూడా దొరకడం లేదు!
గ్యాసే కాదు.. బ్యాంక్‌ లాకర్లు కూడా దొరకడం లేదు!
పనీర్ లేకుండా పాలక్ పనీర్..ఎలా చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
పనీర్ లేకుండా పాలక్ పనీర్..ఎలా చేయాలో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్
ఏడాది తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన హారర్ క్రైమ్ థ్రిల్లర్
హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ
హైదరాబాద్‌లో పెట్రోల్‌ బంకుల మూసివేత.. కిలో మీటర్ మేర క్యూ