Diwali Gifts: దీపావళికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఈ గ్యాడ్జెట్లు ట్రై చేయండి.. తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్స్..

| Edited By: Ravi Kiran

Nov 11, 2023 | 9:52 PM

మీరు కూడా మీ స్నేహితులు ఈ దీపావళి రోజు మంచి బహుమతి ఇవ్వాలని భావిస్తున్నారా? అది కూడా అనువైన బడ్జెట్లో ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. అతి తక్కువ ధరకే లభించే టెక్ గ్యాడ్జెట్లు మీ ప్రియమైన వారికి బాగా ఉపయోగపడతాయి. ఇవి వారికి గిఫ్ట్ గా ఇస్తే వారి బాగా ఆనంద పడతారు. ఆ గ్యాడ్జెట్లు ఏంటి? తెలుసుకుందాం రండి..

Diwali Gifts: దీపావళికి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారా? ఈ గ్యాడ్జెట్లు ట్రై చేయండి.. తక్కువ ధరలో బెస్ట్ ఆప్షన్స్..
Diwali Gifts
Follow us on

దీపావళి అంటేనే ఆనందం, ఉల్లాసం. ఇంటిల్లిపాది ఒక్కచోట చేరి సంతోషంగా గడిపేందుకు అనువైన సమయం. చాలా మంది ఈ పండుగను అట్టహాసంగా నిర్వహిస్తారు. ఇళ్లను సుందరంగా అలంకరిస్తారు. దీపాలు, పూలు, రంగోలీలతో తీర్చిదిద్దుతారు. అలాగే స్నేహితులు, బంధువులను ఇంటికి పిలుచుకొని విందు చేయిస్తారు. కొందరైతే బహుమానాలు కూడా ఇస్తారు. అందుకే చాలా మంది దీపావళి కోసం ఏడాదంతా వేచి ఉంటారు. మీరు కూడా మీ స్నేహితులు ఈ దీపావళి రోజు మంచి బహుమతి ఇవ్వాలని భావిస్తున్నారా? అది కూడా అనువైన బడ్జెట్లో ఉండాలని కోరుకుంటున్నారా? అయితే ఈ కథనం మీ కోసమే. అతి తక్కువ ధరకే లభించే టెక్ గ్యాడ్జెట్లు మీ ప్రియమైన వారికి బాగా ఉపయోగపడతాయి. ఇవి వారికి గిఫ్ట్ గా ఇస్తే వారి బాగా ఆనంద పడతారు. ఆ గ్యాడ్జెట్లు ఏంటి? తెలుసుకుందాం రండి..

ప్రీమియం వేగన్ లెదర్ డెస్క్ మ్యాట్.. ఇంటి నుంచి పని చేసే వారు లేదా వారు ఇష్టపడే డెస్క్ సెటప్ ఉన్న వారు ఎవరైనా మీకు తెలిస్తే, వారు డెస్క్ మ్యాట్‌ని ఇష్టపడతారు. డైలీ ఆబ్జెక్ట్స్ నుంచి వచ్చిన ఈ డెస్క్ మ్యాట్ నిజమైన లెదర్‌ను పోలి ఉండే వేగన్ లెదర్ తో వస్తుంది. ఇది డెస్క్‌పై స్టైలిష్‌గా కనిపిస్తుంది. ఇది ప్రస్తుతం చాలా ప్లాట్‌ఫారమ్‌లలో రూ. 899కి అందుబాటులో ఉంది.

ఆంబ్రేన్ స్టైలో 10కే 10000ఎంఏహెచ్ స్లిమ్ పవర్ బ్యాంక్.. ప్రతి ఒక్కరికీ పవర్ బ్యాంక్‌లు అవసరం. ప్రయాణిస్తున్నప్పుడు లేదా సుదీర్ఘంగా ఆఫీసు పనిచేస్తున్న సమయంలో మీకు ఇవి బాగా ఉపయోగపడతాయి. ఈ ఆంబ్రేన్ స్టైలో 10కే అత్యంత జనాదరణ పొందిన, నమ్మదగిన ఎంపిక. ఇది 10,000 ఎంఏహెచ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో రూ.999కి విక్రయిస్తోంది.

ఇవి కూడా చదవండి

పోర్ట్రోనిక్స్ క్లీన్ ఎన్ 19-ఇన్-1 స్మార్ట్ గ్యాడ్జెట్ క్లీనింగ్ కిట్.. మనము ఖరీదైన గాడ్జెట్‌లను కొనుగోలు చేస్తాం. అయితే వాటి నిర్వహణను మాత్రం సరిగ్గా పట్టించుకోం. మన ఇంట్లో ఉండే ఏదైనా వస్త్రంతోనో, టీ షర్టుతోనే దానిని శుభ్రం చేస్తుంటాం. దీంతో అవి దెబ్బతింటాయి. ఖరీదైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. పోర్ట్రోనిక్స్ క్లీన్ ఎన్ 19-ఇన్-1 స్మార్ట్ గ్యాడ్జెట్ క్లీనింగ్ కిట్ మీకు దీనిని సమర్థంగా నిర్వహిస్తుంది. ఇది కీక్యాప్ పుల్లర్, స్విచ్ షాఫ్ట్ పుల్లర్, పరికరంలోని ప్రతి మూలను చేరుకోవడానికి వివిధ బ్రష్‌లు ఉంటాయి. మీ ఇయర్‌బడ్‌లను శుభ్రం చేయడానికి కార్బన్ లెన్స్ పెన్, టూల్స్ వంటి బహుళ సాధనాలతో వస్తుంది.

హెచ్‌పీ కేఎం 200 వైర్‌లెస్ మౌస్, కీబోర్డ్ కాంబో.. మీ స్నేహితులు వైర్డ్ కీబోర్డు, మౌస్ తో విసిగి పోయారా? అయితే వారికి ఈ దివాళి రోజున దీనిని గిఫ్ట్ గా ఇవ్వండి. అతి తక్కువ ధరలోనే వైర్ లెస్ కీబోర్డు, మౌస్ అందుబాటులో ఉంటుంది. అది టాప్ టెక్ బ్రాండ్ హెచ్ పీ నుంచి వస్తుంది. హెచ్ పీ కేఎం 200 పేరుతో వైర్ లెస్ కీబోర్డు, మౌస్ ను అమెజాన్ లో కేవలం రూ. 999కే కొనుగోలు చేయొచ్చు.

రుకాన్ 3డీ మూన్ ల్యాంప్ నైట్ ల్యాంప్.. ఈ ల్యాంప్ అందంగా కనిపించడమే కాకుండా, ఇది క్రియాత్మకంగా ఉంటుంది. స్విచ్ ఆన్ చేసిన తర్వాత ఇది ఆహ్లాదకరమైన రాత్రి వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనిని మీరు డెస్క్ పై ల్యాంప్ లేదా లేదా కేవలం బెడ్ లైట్ గా కూడా వినియోగించుకోవచ్చు. దీని ధర కేవలం రూ. 649 మాత్రమే.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..