AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tesla: కార్ల విక్రయాల్లో టెస్లా దూకుడు.. చిప్ కొరతను అధిగమిస్తూ టాప్ సేల్స్..

గత సంవత్సరం, జనరల్ మోటార్స్(GM), ఫోర్డ్ మోటార్‌తో సహా అందరు ఆటో తయారీదారులు కంప్యూటర్ చిప్ కొరత కారణంగా అనేక సమస్యలతో పోరాడారు. జనరల్ మోటార్స్, ఫోర్డ్(Ford) అనేక ప్లాంట్లను ఒకదాని తర్వాత ఒకటి మూసివేయవలసి వచ్చింది.

Tesla: కార్ల విక్రయాల్లో టెస్లా దూకుడు.. చిప్ కొరతను అధిగమిస్తూ టాప్ సేల్స్..
Tesla
KVD Varma
|

Updated on: Jan 16, 2022 | 9:47 AM

Share

Tesla: గత సంవత్సరం, జనరల్ మోటార్స్(GM), ఫోర్డ్ మోటార్‌తో సహా అందరు ఆటో తయారీదారులు కంప్యూటర్ చిప్ కొరత కారణంగా అనేక సమస్యలతో పోరాడారు. జనరల్ మోటార్స్, ఫోర్డ్(Ford) అనేక ప్లాంట్లను ఒకదాని తర్వాత ఒకటి మూసివేయవలసి వచ్చింది. అయినప్పటికీ, ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా 2021లో రికార్డు స్థాయిలో 9.36 లక్షల కార్లను విక్రయించింది. ఇది 2020తో పోలిస్తే 87% పెరుగుదల కావడం గమనార్హం.

ఫోర్డ్, జనరల్ మోటార్స్ క్రిస్లర్, ఫియట్, పుగోల విలీనంతో ఏర్పడిన స్టెలాంటిస్ కంపెనీ విక్రయాలు 2021లో మునుపటి సంవత్సరం కంటే తక్కువగా ఉన్నాయి. కార్ల ఉత్పత్తి కోసం క్లిష్టమైన వస్తువులను సమీకరించడంలో టెస్లా సామర్థ్యం వోక్స్‌వ్యాగన్, జనరల్ మోటార్స్ వంటి దిగ్గజాలకు ముప్పును కలిగిస్తుందని ఈ అమ్మకాలు సూచిస్తున్నాయి. టెస్లాకు కావలసిన చిప్‌లు లభించనప్పుడు, అది మార్కెట్లో అందుబాటులో ఉన్న ఏదైనా చిప్‌ను కొనుగోలు చేసి, దానికి అవసరమైన సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసిందని ఇప్పుడు స్పష్టమైంది. పెద్ద పెద్ద ఆటోమొబైల్ కంపెనీలు దీన్ని చేయలేకపోయాయి. వారు తమ సాఫ్ట్‌వేర్ .. కంప్యూటింగ్ కోసం బాహ్య వనరులపై ఆధారపడ్డారు.

కొన్ని సంవత్సరాల క్రితం, ఎలోన్ మస్క్ చాలా ముఖ్యమైన పనిని టెస్లా స్వయంగా చేయాలని నిర్ణయించారు. సిలికాన్ వ్యాలీలో జన్మించిన టెస్లా ఎప్పుడూ సాఫ్ట్‌వేర్‌ను దిగుమతి చేసుకోలేదని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్‌లో ప్రొఫెసర్ మోరిస్ కోన్ చెప్పారు. సులభంగా లభించే చిప్‌ల కోసం కంపెనీ తన స్వంత సాఫ్ట్‌వేర్‌ను తయారు చేసింది. కార్లు మరింత డిజిటల్‌గా మారుతున్నాయి. ఇంజిన్-ఇంధన ఉద్గారాలతో పాటు సాఫ్ట్‌వేర్ వారి ప్రత్యేకత. కొన్ని పాత కార్ల కంపెనీలు ఈ వాస్తవాన్ని ఇప్పుడు అర్థం చేసుకుంటున్నాయి. టెస్లా చేస్తున్న పనిని తాము చేయవలసి ఉంటుందని ఇతర కార్ కంపెనీలు అర్థం చేసుకున్నాయి. వారు తమ కంప్యూటర్ సిస్టమ్‌లను నియంత్రించే ప్రక్రియను ప్రస్తుతం ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి: Worlds Powerful Passports: ప్రపంచ వ్యాప్తంగా పవర్‌ఫుల్‌ పాస్‌పోర్ట్‌ ర్యాంకులో భారత్‌.. ఎన్నో ర్యాంకు అంటే..!

Pakistan: భూకంపంతో వణికిపోయిన పాకిస్తాన్.. రిక్టర్‌ స్కేల్‌పై 5.6 తీవ్రత..