ఫేక్ వెబ్ సైట్స్ నమ్మి అమాయక ప్రజలు సైబర్ నేరగాళ్ల చేతుల్లో పడి లక్షల్లో మోసపోతున్నారు. రోజురోజుకు ఫేక్ వెబ్ సైట్స్ పెరుగుతుంటే సైబర్ నేరాల నియంత్రణకు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో తీసుకొచ్చిన విధానం మంచి ఫలితాలను ఇస్తోంది. అనుమానాస్పద వెబ్‌లింకులతో వచ్చే సందేశాలపై ఫిర్యాదు చేస్తే వాటిని నిర్వీర్యం చేస్తూ సైబర్ నేరాలు జరగకుండా ముందే అడ్డుకుంటోంది. నిత్యం ఆన్ లైన్లో ఎన్నో నకిలీ వెబ్సైట్లు దర్శనం ఇస్తున్నాయి. ఎంతోమంది నకిలీ వెబ్సైట్ – ఒరిజినల్ వెబ్సైట్ మధ్య తేడాను గుర్తించలేక సైబర్ వలలో చిక్కుకుంటున్నారు. ఏదైనా వెబ్‌సైట్‌ను చూస్తే అది ఒరిజినలా లేదంటే నకిలీదా అని తెలుసుకుంటే మంచిదని సైబర్ నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కొన్ని సూచనల ద్వారా ఒరిజినల్ వెబ్ సైట్‌ను ఎలా గుర్తించాలో టెక్ నిపుణులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఎలాంటి సమాచారం కావాలన్నా వెబ్సైట్ ద్వారా సర్చ్ చేసి తెలుసుకుంటున్నారు. ఏదైనా వెబ్ సైట్ ఓపెన్ చేయాలంటే.. ముందుగా ఆ వెబ్ సైట్‌కు సంబంధించిన అడ్రస్ డొమైన్ నేమ్ ఇవ్వాల్సి ఉంటుంది. వెబ్ సైట్ పేరు చివర్లో .com,.org,.gov, edu లాంటివే ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే నకిలీ డొమైన్ పేర్లు కాస్త తప్పుగా ఉంటాయి. ఏదైనా వెబ్ సైట్ నేమ్‌లో URL ఉంటే కచ్చితంగా దీనికి ముందు HTTP అని ఉండాలి. అలా ఉంటేనే అది ఒరిజినల్ వెబ్ సైట్ కిందకి వస్తుంది. లేదంటే నకిలీ వెబ్ సైట్ అని గమనించాలి. వెబ్ సైట్ ఓపెన్ చేసిన వెంటనే మరో వెబ్‌సైట్‌కి రీడ్ అవుతూ ఉందంటే కచ్చితంగా అది నకిలీ వెబ్సైట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటి వెబ్సైట్ల పట్ల చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండలంటున్నరు సైబర్ నిపుణులు. ఒరిజినల్ వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే About US, contact పేజీలు కనిపిస్తాయి. నకిలీ వెబ్సైట్లో ఇలాంటి వివరాలు ఉండవు, కాబట్టి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తేనే About US, contact లాంటి వాటిపై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. WEB OF TRUST అనే వెబ్ సైట్‌ను ఉపయోగించి కూడా నకిలీ వెబ్సైట్లను గుర్తించవచ్చు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌కు ఈ వెబ్సైట్ యాడ్ చేసుకుంటే.. ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే దానిపై గ్రీన్ కనిపిస్తే ఒరిజినల్ అని, రెడ్ మార్క్ కనిపిస్తే నకిలీ వెబ్సైట్ అని సులభంగా గుర్తించవచ్చు.
సైబర్ సెక్యూరిటీ బ్యూరో గతేడాది 2023 సెప్టెంబరు నుంచి ఇప్పటివరకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా 299 నకిలీ వెబ్‌సైట్లను పని చేయకుండా చేసింది. ఇవన్నీ ప్రజలు వారి ఫోన్లు, ఈ-మెయిల్, సామాజిక మాధ్యమ ఖాతాలకు వచ్చే అనుమానాస్పద సందేశాల్లోని వెబ్‌లింకులపై చేసిన ఫిర్యాదుల ఆధారంగా చేసినవి. ఇప్పటివరకు వాట్సాప్ నంబరుకు ఫిర్యాదులు 1377 అందగా, యూఆర్‌ఎల్ నిర్వీర్యానికి విజ్ఞప్తులు 661 అందాయి. ఇలా ఫిర్యాదులు అందగానే చెక్ చేసి ఇల్లిగల్‌గా నిర్వహిస్తున్న వెబ్ సైట్‌ని తొలిగిస్తున్నారు. సైబర్ నేరం జరగడానికి ముందే నకిలీ వెబ్‌సైట్లను పనిచేయకుండా ఉండేందుకు టీఎస్‌సీఎస్‌బీ ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చింది. అనుమానాస్పద వెబ్ లింకులు, ఫోన్ నంబర్లతో వచ్చే సందేశాలపై ఫిర్యాదు చేసేందుకు 8712672222 వాట్సాప్ నంబరు ప్రారంభించింది. సైబర్ నేరాల్లో బాధితులు కాకపోయినా పౌరులు లింకులతో కూడిన సందేశాలను ఈ నంబరుకు పంపిస్తే చాలు. వాటిని పరిశీలించి నకిలీవైతే శాశ్వతంగా పనిచేయకుండా చేస్తుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..