AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno Pova 5 series: టెక్నో కొత్త ఫోన్లు చూస్తే అదిరి‘పోవా’ల అంతే.. 3డీ టెక్స్చర్‌తో గ్రాండ్ లుక్.. పూర్తి వివరాలు

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ టెక్నో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. టెక్నో పోవా 5 సిరీస్ లో భాగంగా ఈ ఫోన్లను విడుదల చేసింది. వీటి పేర్లు టెక్నో పోవా 5, టెక్నో పోవా 5 ప్రో. ఈ రెండు డివైజ్ లు కూడా 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తాయి. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రెండింటిలోనూ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇవి ఆండ్రాయిడ్ 13 పై రన్ అవుతుంది.

Tecno Pova 5 series: టెక్నో కొత్త ఫోన్లు చూస్తే అదిరి‘పోవా’ల అంతే.. 3డీ టెక్స్చర్‌తో గ్రాండ్ లుక్.. పూర్తి వివరాలు
Tecno Pova 5 Series
Madhu
|

Updated on: Aug 13, 2023 | 5:00 PM

Share

ప్రముఖ స్మార్ట్ ఫోన్ల కంపెనీ టెక్నో రెండు కొత్త స్మార్ట్ ఫోన్లను మనదేశంలో లాంచ్ చేసింది. టెక్నో పోవా 5 సిరీస్ లో భాగంగా ఈ ఫోన్లను విడుదల చేసింది. వీటి పేర్లు టెక్నో పోవా 5, టెక్నో పోవా 5 ప్రో. ఈ రెండు డివైజ్ లు కూడా 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ డిస్ ప్లేతో వస్తాయి. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. రెండింటిలోనూ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. ఇవి ఆండ్రాయిడ్ 13 పై రన్ అవుతుంది. టెక్నో పోవా 5 ప్రో ఫోన్లో టెక్ ఇండస్ట్రీలోనే మొట్టమొదటి సారిగా 3డీ టెక్స్చర్ డిజైన్, ఏఆర్సీ ఇంటర్ ఫేస్ తో వస్తోంది. మల్టీ కలర్డ్ ఎల్ఈడీ బ్యాక్ లైట్ తో వస్తుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది.

టెక్నో పోవా 5, పోవా 5 ప్రో ధర, లభ్యత..

ఈ టెక్నో పోవా 5 ఫోన్ హర్రికేన్ బ్లూ, యాంబర్ గోల్డ్, మెకా బ్లాక్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. టెక్నో పోవా 5 ప్రో మాత్రం సిల్వర్ ఫ్యాంటసీ, డార్క్ ఇల్యూషన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్ల ధర ఎంత ఉంటుంది అని అనేది కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అలాగే ర్యామ్, స్టోరేజ్ ను కంపెనీ వెల్లడించలేదు. అయితే మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం కొన్ని అంచనాలైతే ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

టెక్నో పోవా 5, పోవా 5 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు..

  • ఈ రెండు ఫోన్లలో కూడా 6.78 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే ఉంటుంది. 120హెర్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది.
  • టెక్నో పోవా 5 హీలియో జీ99 ఎస్ఓసీ ఆధారంగా పనిచేస్తుంది. అలాగే పోవా 5 ప్రో డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది.
  • ఈ రెండు డివైజ్ లు ఆండ్రాయిడ్ 13 అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటుంది.
  • రెండింటిలోనూ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50 ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ముందు వైపు పోవా 5 ఫోన్ లో 8ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. అలాగే పోవా 5 ప్రో లో మాత్రం 16ఎంపీ సెల్ఫీ కెమెరా తీసుకొచ్చాం.
  • పోవా 5లో 6,000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. యూఎస్బీ టై సీ పోర్టు ద్వారా ఇది పనిచేస్తుంది. పోవా 5 ప్రో ఫఓన్లో మాత్రం 5,000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. 68వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది.
  • కనెక్టివిటీ విషయానికి వస్తే రెండింటిలోనూ డ్యూయల్ 4జీ కనెక్షన్, వైఫై, బ్లూటూ్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది. సెక్యూరిటీ కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింగ్ సెన్సార్ ఉంటుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..