AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tecno Phantom V Flip: వారెవ్వా ఏమన్న ఫోనా.. భారత మార్కెట్లోకి టెక్నో నుంచి మరో ఫ్లిప్‌ స్మార్ట్‌ ఫోన్‌

ఇక టెక్నో గడిచిన ఏప్రిల్‌లో 'ఫాంటమ్‌ వీ ఫోల్డ్‌' పేరుతో ఓ ఫ్లిప్‌ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫాంటమ్‌ వి ఫ్లిప్‌ పేరుతో మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. శుక్రవారం భారత్‌లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ అమ్మకాలు అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

Tecno Phantom V Flip: వారెవ్వా ఏమన్న ఫోనా.. భారత మార్కెట్లోకి టెక్నో నుంచి మరో ఫ్లిప్‌ స్మార్ట్‌ ఫోన్‌
Tecno Phantom V Flip
Narender Vaitla
|

Updated on: Sep 23, 2023 | 7:52 AM

Share

ప్రస్తుతం టెక్‌ మార్కెట్లో ఫ్లిప్‌ ఫోన్‌ల హవా నడుస్తోంది. స్మార్ట్ ఫోన్స్‌ రోజుకో కొత్త రూపు సంతరించుకుంటోన్న తరుణంలో ఇప్పుడు ఫ్లిప్‌ ఫోన్స్ ట్రెండ్ కొనసాగుతోంది. ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ కంపెనీలు మడతపెట్టే ఫోన్‌లతో మార్కెట్లో సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు వచ్చిన దాదాపు అన్ని ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్స్‌ భారీ ధరతో వచ్చినవే. అయితే చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం టెక్నో తాజాగా బడ్జెట్‌ ధరలో ఫ్లిప్‌ ఫోన్‌లను లాంచ్‌ చేస్తూ వస్తోంది. తాజాగా శుక్రవారం భారత మార్కెట్లోకి కొత్త ఫ్లిప్‌ ఫోన్‌ను తీసుకొచ్చింది.

ఇక టెక్నో గడిచిన ఏప్రిల్‌లో ‘ఫాంటమ్‌ వీ ఫోల్డ్‌’ పేరుతో ఓ ఫ్లిప్‌ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఫాంటమ్‌ వి ఫ్లిప్‌ పేరుతో మరో ఫోన్‌ను తీసుకొచ్చింది. శుక్రవారం భారత్‌లో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ అమ్మకాలు అక్టోబర్ 1వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభంకానున్నాయి. ప్రముఖ ఈ కామర్స్‌ సైట్ అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి రానుంది. ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..

టెక్నో ఫాంటమ్‌ వీ ఫ్లిప్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌లో 6.9 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ ఇన్నర్‌ డిస్‌ప్లేను అందించారు. ఇక ఫోన్‌ను మడతపెట్టిన సమయంలో పైన సర్క్యూలర్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇచ్చారు. ఈ చిన్న డిస్‌ప్లే సైజ్‌ 1.32 ఇంచెస్‌గా ఉంటుంది. ఈ స్క్రీన్‌ ద్వారా మెసేజ్‌లకు రిప్లై, కాల్స్‌ లిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్‌ మీడియాటెక్‌ 8050 ప్రాసెసర్‌తో పని చేస్తుంది. 8జీబీ ర్యామ్‌తో వచ్చిన ఈ ఫోన్‌లో వర్చువల్‌గా ర్యామ్‌ను 16 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్‌ 13.5 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో మూడేళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ పొందొచ్చు.

కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను ఇచ్చారు. ఇక సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను ఇచ్చారు. 5జీ నెట్‌వర్క్‌కి సపోర్ట్ చేసే ఈ స్మార్ట్ ఫోన్‌లో వైఫై6, బ్లూటూత్‌ 5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్స్‌ను అందించారు. ఇక బ్యాటరీకి పెద్ద పీట వేసిన ఈ స్మార్ట్ ఫోన్‌లో 45 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక ఈ ఫోన్ ధర విషయానికొస్తే.. టెక్నో ఫాంటమ్‌ వీ ఫ్లిప్‌ 5జీ ఫోన్‌ కేవలం 8జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ ధర రూ. 49,999గా ఉండనుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి…