Tech Tips: మీ మొబైల్ నంబర్ మర్చిపోయారా? ఈ ట్రిక్స్‌తో తెలుసుకోండి

మీకు USSD కోడ్ లేదా My Account యాప్ లేకపోతే మీ టెలికాం కంపెనీని సంప్రదించడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను తెలుసుకోవచ్చు. దీని కోసం కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి, మీరు మీ మొబైల్ నంబర్‌ను మర్చిపోయారని చెప్పండి. కంపెనీ మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి నిర్దిష్ట సమాచారాన్ని అడుగుతుంది. ఈ సమాచారం ఆధారంగా కంపెనీ మీ మొబైల్ నంబర్‌ను మీకు తెలియజేస్తుంది.

Tech Tips: మీ మొబైల్ నంబర్ మర్చిపోయారా? ఈ ట్రిక్స్‌తో తెలుసుకోండి
Mobile Number

Updated on: Jan 29, 2024 | 8:35 PM

ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. మాట్లాడటం, ఇంటర్నెట్ బ్రౌజ్ చేయడం లేదా మరేదైనా పని ఇలా మొబైల్ ఫోన్‌ వాడకం ఎక్కువైపోతుంది.అయితే చాలా సార్లు మనం మన మొబైల్ నంబర్‌ను మర్చిపోతున్నాం. మీరు మీ మొబైల్ నంబర్‌ను కూడా మర్చిపోయినట్లయితే టెన్షన్‌ పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు మీ మొబైల్ నంబర్‌ను సులభంగా కనుగొనడానికి కొన్ని మార్గాలను చెప్పబోతున్నాము.

USSD కోడ్‌ని ఉపయోగించండి: వేర్వేరు టెలికాం కంపెనీలు వేర్వేరు USSD కోడ్‌లను కలిగి ఉంటాయి. వాటి ద్వారా మీరు మీ మొబైల్ నంబర్‌ను సులభంగా కనుగొనవచ్చు.

Airtel: *282# Vodafone: 1112# లేదా 5550# Idea: 1214# BSNL: *99# Jio: *1# ఈ USSD కోడ్‌లను డయల్ చేసిన తర్వాత మీ ముందు మెను ఓపెన్‌ అవుతుంది. ఈ మెను నుంచి “మొబైల్ నంబర్” ఎంపికను ఎంచుకోండి. ఇప్పుడు మీ మొబైల్ నంబర్ మీ డిస్‌ప్లేలో కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

మై అకౌంట్‌యాప్‌ని ఉపయోగించండి: మీరు మీ టెలికాం కంపెనీకి చెందిన My Account అప్లికేషన్‌ని కలిగి ఉంటే మీరు మొబైల్ నంబర్‌ను సులభంగా తెలుసుకోవచ్చు. దీని కోసం మీరు మీ మొబైల్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.

టెలికాం కంపెనీని సంప్రదించండి: మీకు USSD కోడ్ లేదా My Account యాప్ లేకపోతే మీ టెలికాం కంపెనీని సంప్రదించడం ద్వారా మీ మొబైల్ నంబర్‌ను తెలుసుకోవచ్చు. దీని కోసం కంపెనీ కస్టమర్ కేర్ నంబర్‌కు కాల్ చేసి, మీరు మీ మొబైల్ నంబర్‌ను మర్చిపోయారని చెప్పండి. కంపెనీ మీ పేరు, చిరునామా, పుట్టిన తేదీ వంటి నిర్దిష్ట సమాచారాన్ని అడుగుతుంది. ఈ సమాచారం ఆధారంగా కంపెనీ మీ మొబైల్ నంబర్‌ను మీకు తెలియజేస్తుంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి