AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమ్మకాలలో సరికొత్త మైలురాయిని సాధించిన టాటా.. EV కార్లకి పెరుగుతున్న ప్రజాధారణ..

Tata Sales: టాటా మోటార్స్ మరోసారి విక్రయాల్లో వృద్ధిని సాధించింది. జనవరిలో రికార్డ్‌ అమ్మకాలు జరిపింది. వినియోగదారుల వాహనాల విక్రయాలు

అమ్మకాలలో సరికొత్త మైలురాయిని సాధించిన టాటా.. EV కార్లకి పెరుగుతున్న ప్రజాధారణ..
Tata Tiago
uppula Raju
|

Updated on: Feb 01, 2022 | 10:11 PM

Share

Tata Sales: టాటా మోటార్స్ మరోసారి విక్రయాల్లో వృద్ధిని సాధించింది. జనవరిలో రికార్డ్‌ అమ్మకాలు జరిపింది. వినియోగదారుల వాహనాల విక్రయాలు 35 వేల యూనిట్లకు చేరుకోగా ఇది అంతకు ముందు అత్యధికం 32 వేల యూనిట్లుగా ఉండేది. అయితే ప్రస్తుతం కంపెనీ ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో 13 యూనిట్ల వృద్ధిని సాధించింది. ఇటీవల టాటా మోటార్స్ CNG వేరియంట్‌లో రెండు సరసమైన సెగ్మెంట్ కార్లను పరిచయం చేసింది.

అంతర్జాతీయ అమ్మకాల గురించి మాట్లాడినట్లయితే టాటా మోటార్స్ మొత్తం అమ్మకాలు జనవరి 2022లో 27 శాతం పెరిగి 76,210 యూనిట్లకు చేరుకున్నాయి. 2021 జనవరిలో కంపెనీ 59,866 వాహనాలను విక్రయించినట్లు టాటా మోటార్స్ మంగళవారం తెలిపింది. దేశీయ మార్కెట్ విక్రయాలు జనవరి 2022లో సంవత్సరానికి 26 శాతం పెరిగి 72,485 యూనిట్లకు చేరుకున్నాయని తెలిపింది. నెల క్రితం ఇది 57,649 యూనిట్లుగా ఉంది. జనవరిలో టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు ఐదు రెట్లు పెరిగి 2,892 యూనిట్లకు చేరుకుంది. జనవరి 2021లో ఇది 514 ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉంది.

కంపెనీ సరసమైన CNG కార్లను విడుదల చేసింది

కంపెనీ గత నెలలో తన రెండు కార్లలో CNG వేరియంట్‌లను ప్రవేశపెట్టింది. వాటి పేర్లు టాటా టియాగో, టాటా టిగోర్. ఈ రెండూ కంపెనీ అమర్చిన CNG కిట్‌తో ప్రారంభించారు. దీంతో పాటు ఇందులో అనేక మార్పులు కూడా చేశారు.

టాటా టిగోర్, టియాగో సిఎన్‌జి కార్ల ఫీచర్లు

CNG కార్లు తక్కువ పవర్ పెట్రోల్ ఇంజన్‌లపై ఆధారపడి ఉంటాయి. కంపెనీ i CAG టెక్నాలజీ 1.2 లీటర్ Revotron 3 సిలిండర్ ఇంజన్‌ని ఉపయోగించింది. ఇది 73.4 PS పవర్, 95 Nm టార్క్ ఉత్పత్తి చేయగలదు. రెండు కార్లు హర్మాన్ ద్వారా 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, USB ఛార్జింగ్, స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో, బ్లూటూత్ కనెక్టివిటీ, ఆండ్రాయిడ్ ఆధారిత వాయిస్, కమాండ్ రికగ్నిషన్ వంటి ఫీచర్లతో వస్తున్నాయి.

తరచుగా తుమ్ములు వస్తున్నాయా.. అస్సలు తేలికగా తీసుకోవద్దు.. ఎందుకంటే..?

Socialmedia: సోషల్ మీడియాలో ఎక్కువగా గడుపుతున్నారా.. క్యాన్సర్‌, గుండె జబ్బులు ఖాయం..?

Alcohol: డైలీ ఆల్కహాల్ తీసుకుంటారా.. అధ్యయనంలో సంచలన నిజాలు..?