AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SpaceX: చంద్రుడిపైకి మరో రాకెట్‌ను పంపిన స్పేస్‌ ఎక్స్‌! ఈ ప్రయోగం ప్రత్యేకతలు ఇవే

స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా నాసాతో కలిసి చంద్రునిపై మూడవ మిషన్ ను ప్రారంభించింది. ఈ మిషన్ లో చంద్రుని దక్షిణ ధ్రువంలో నీరు, ఇతర వనరుల కోసం అన్వేషణ జరుగుతుంది. ఇంట్యూటివ్ మెషీన్స్ రోవర్లు, పరిశోధన సాధనాలు చంద్రునిపై పరిశోధనలు చేయనున్నాయి. ఈ ప్రయోగం చంద్రునిపై మానవ నివాసాలకు మార్గం సుగమం చేస్తుందని ఆశిస్తున్నారు.

SpaceX: చంద్రుడిపైకి మరో రాకెట్‌ను పంపిన స్పేస్‌ ఎక్స్‌! ఈ ప్రయోగం ప్రత్యేకతలు ఇవే
Space X Rocket
SN Pasha
|

Updated on: Feb 27, 2025 | 8:01 AM

Share

ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ ఈ ఏడాది మూడో రాకెట్‌ను నింగిలోకి పంపింది. గురువారం ఉదయం 5.46 గంటలకు ఈ రాకెట్‌ను లాంచ్‌ చేశారు. చంద్రుడిపై ప్రయోగాలు చేసేందుకు నాసాతో కలిసి ఈ ప్రయోగం చేసింది స్పేస్‌ ఎక్స్‌. ఎథీనా నోవా సి క్లాస్ లూనార్ ల్యాండర్‌ను M1-2 రాకెట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లింది. ఈ రాకెట్‌కు ఫాల్కన్ 9 అని పేరు పెట్టారు. ఇంట్యూటివ్ మెషీన్స్ నేతృత్వంలో కేప్ కెనావెరల్ నుంచి ఈ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లింది. గురువారం నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన ఈ ఫాల్కన్‌ 9 రాకెట్‌ మార్క్‌ 6న చంద్రుడి సౌత్‌ పోల్‌(దక్షిణ ధ్రువం)పై ల్యాండ్‌ అవుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు.

ఈ మిషన్ నాసా కమర్షియల్ లూనార్ పేలోడ్ సర్వీసెస్ (CLPS) చొరవతో చంద్రుడిపై మనుషుల మనుగడ కోసం సాధ్యాసాధ్యాలను పరిశీలంచేందుకు ప్రయోగం చేపట్టారు. ముఖ్యంగా చంద్రుడిపై మోన్స్ మౌటన్ ప్రాంతంలో కీలకమైన డేటాను సేకరించే టెక్నాలజీ ఇందులో ప్రవేశపెట్టారు. చంద్రుడిపైకి మానవులను పంపించేందుకు కీలకమైన డేటాను ఈ ప్రయోగం ద్వారా స్వేకరించనున్నారు. ఈ మిషన్‌లో చంద్రుడిపై తిరిగి పరిశోధించే రెండు రోవర్‌లు ఉన్నాయి. ఇంట్యూటివ్ మెషీన్స్ మైక్రో-నోవా హాప్పర్, మొబైల్ అటానమస్ ప్రాస్పెక్టింగ్ ప్లాట్‌ఫామ్ రోవర్ అనే రెండు రోవర్లను ఇందులో పంపించారు.

పోలార్ రిసోర్సెస్ ఐస్ మైనింగ్ ఎక్స్‌పెరిమెంట్-1 సూట్, లేజర్ రెట్రోరెఫ్లెక్టర్ అర్రే (LRA) వంటి కీలక సాధనాలను ఉపయోగించి చంద్రమండలంపై మట్టిని, నీటిని పరిశోధించనున్నారు. దీనితోపాటు చంద్రుడిపై గ్రేటర్లను పరిశీలించడానికి హోపింగ్ రోబోట్, గ్రేస్‌ను వదిలిపెట్టనున్నారు. ఈ ప్రయోగం కోసం నాసా ఏకంగా 62 మిలియన్‌ డాలర్లను చెల్లించింది. ఈ ప్రయోగం విజయవంతమైతే.. సుదీర్ఘ కాలం పాటు మనుషులు చంద్రుడిపై ఉండి.. అక్కడ నివాస యోగ్యమైన పరిస్థితిని పరిశీలించే అవకాశం ఉంది. భవిష్యత్తులో చంద్రుడిపై నివసించాలనే ఏళ్ల నాటి మానవులు లక్ష్యం కూడా నేరవేరేందుకు ముందుడుగు పడే అవకాశం ఉంది. అందుకోసమే ఈ ప్రయోగాన్ని నాసా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.