Solis Hybrid Tractor: మార్కెట్లోకి కొత్తగా సోలిస్‌ హైబ్రిడ్‌ 5015 ట్రాక్టర్‌ విడుదల.. ధర రూ.7.21 లక్షలు

Solis Hybrid Tractor: డీజిల్‌తో పాటు విద్యుత్‌తో పని చేసే సోలిస్‌ హైబ్రిడ్‌ 5015 ట్రాక్టర్‌ను విడుదల చేసినట్లు ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ తెలిపింది. జపాన్‌కు చెందిన యన్మార్‌...

Solis Hybrid Tractor: మార్కెట్లోకి కొత్తగా సోలిస్‌ హైబ్రిడ్‌ 5015 ట్రాక్టర్‌ విడుదల.. ధర రూ.7.21 లక్షలు
Solis 5015 Hybrid Tractor

Edited By:

Updated on: Apr 16, 2021 | 7:54 AM

Solis Hybrid Tractor: డీజిల్‌తో పాటు విద్యుత్‌తో పని చేసే సోలిస్‌ హైబ్రిడ్‌ 5015 ట్రాక్టర్‌ను విడుదల చేసినట్లు ఇంటర్నేషనల్‌ ట్రాక్టర్స్‌ లిమిటెడ్‌ తెలిపింది. జపాన్‌కు చెందిన యన్మార్‌ అగ్రిబిజినెస్‌తో కలిసి ఈ ట్రాక్టర్‌ను తయారు చేసినట్లు ఐటీఎల్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రామన్‌ మిత్తల్‌ తెలిపారు. ఈ 50 హెచ్‌పీ ట్రాక్టర్‌ పనితీరులో 60 హెచ్‌పీ సామర్థ్యాన్ని ఇంధన వినియోగంలో 45 హెచ్‌పీలాగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

ఈ-పవర్‌బూస్ట్‌ అనే అత్యాధునిక సాంకేతికతను వినియోగించినందుకు, రైతులకు అవసరమైనప్పుడు మరింత శక్తిమంతంగా పని చేయడంతో పాటు వేగంగా ప్రయాణిస్తుందని అన్నారు. సాధారణ అవసరాలకు వినియోగిస్తు్న్నప్పుడు ఇంధనాన్ని ఆదా చేస్తుందని పేర్కొన్నారు. ఇందులో ఉండే లిథియం అయాన్‌ బ్యాటరీని ఇంట్లో సులభంగా ఛార్జీంగ్‌ చేసుకోవచ్చని, మూడు గంటల్లో ఇది పూర్తి ఛార్జ్‌ అవుతుందని అన్నారు. అంతేకాదు ట్రాక్టర్‌ నడుపుతున్న సమయంలో కూడా బ్యాటరీ ఛార్జ్‌ అవుతుందని అన్నారు. దీని ధర (ఎక్స్‌షోరూం) రూ.7.21 లక్షలు. అయితే ఈ ట్రాక్టర్‌ వల్ల రైతులకు మూడు రకాల ప్రయోజనాలు ఉంటాయని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ట్రాక్టర్‌లో అత్యాధునిక ఫీచర్స్‌ ఉన్నాయని అన్నారు. రైతులకు తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేసేలా దీనిని రూపొందించినట్లు ఆయన చెప్పారు.

ఇవీ చదవండి:

మీరు బైక్ కొనాలనుకుంటున్నారా.? తక్కువ ధరకే అదిరిపోయే ‌బైక్‌లు మీ సొంతం.. వివరాలు ఇవిగో.!

ఈ ఐఐటీ విద్యార్థి 15 నెలల్లో 5 వేల కోట్లు సంపాదించాడు..! నమ్మశక్యంగా లేకున్నా ఇది నిజం.. ఎలాగో తెలుసుకోండి..?