AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Solar Magic: ఆకాశంలో అద్భుతం.. వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ దృశ్యం ఎప్పుడు కనిపించనుందంటే..

Solar Magic: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది.

Solar Magic: ఆకాశంలో అద్భుతం.. వెయ్యేళ్లకు ఒకసారి మాత్రమే వచ్చే ఈ దృశ్యం ఎప్పుడు కనిపించనుందంటే..
Solar
Shiva Prajapati
|

Updated on: Apr 27, 2022 | 6:20 PM

Share

Solar Magic: ఆకాశంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. వెయ్యేళ్లకు ఒకసారి వచ్చే అరుదైన దృశ్యం కనువిందు చేయనుంది. ఏప్రిల్ చివరి వారంలో శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని గ్రాహాలు సరళలో రేఖలో సమలేఖనం అయ్యే అరుదైన, ప్రత్యేకమైన ఖగోళ అద్భుతం జరుగనుంది. సూర్యోదయానికి ఒక గంట ముందు ఆకాశంలో తూర్పున ఈ అద్భుత దృశ్యం కనిపించనుందని భువనేశ్వర్‌లోని పఠానీ సమతా ప్లానిటోరియం డిప్యూటీ డైరెక్టర్ శుభేందు పట్నాయక్ తెలిపారు.

‘‘ఏప్రిల్ 2022 చివరి వారంలో అరుదైన, ప్రత్యేకమైన గ్రహాల అమరిక జరుగనుంది. దీనిని ప్లానెట్ పెరేడ్ అని పిలుస్తారు. ఈ పేరుకు శాస్త్రీయ నిర్వచనం లేనప్పటికీ.. ఇది సౌర వ్యవస్థలోని గ్రహాలు ఆకాశంలో ఒకే ప్రాంతంలో వరుసలో ఉన్నప్పుడు జరిగే సంఘటను సూచించడానికి ఖగోళ శాస్త్రంలో విస్తతంగా ఉపయోగించడం జరుగుతుంది.’’ అని పట్నాయక్ తెలిపారు.

కాగా, ‘ప్లానెట్ పెరేడ్’ ను మూడు రకాలుగా వివరించారు పట్నాయక్. ఒకటి సూర్యునికి ఒకవైపున మూడు గ్రహాలు ఒకే రేఖలోకి రావడం సాధారణం అని, ఇలాంటి దృశ్యాలు సంవత్సరంలో అనేకసార్లు చూడొచ్చని పట్నాయక్ తెలిపారు. ‘‘నాలుగు గ్రహాల అమరిక సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, ఐదు గ్రహాలు ప్రతి 19 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. ఎనిమిది గ్రహాల అమరిక దాదాపు 170 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.’’ అని వివరించారు. ఇక రెండవది.. ‘‘కొన్ని గ్రహాలు వాటి దృశ్యమాన పరిస్థితులతో సంబంధం లేకుండా ఆకాశంలోని చిన్న సెక్టార్‌లో ఒకే సమయంలో కనిపించినప్పుడు భూమి కోణం నుండి దీనిని ప్లానెట్ పెరేడ్‌గా పిలవడం జరుగుతంది. ఈ రకమైన ప్లానెట్ పెరేడ్ చివరిసారిగా ఏప్రిల్ 18 న జరిగింది. 2002, జూలై 2020లో సూర్యకుటుంబంలోని అన్ని గ్రహాలు కంటితో కనిపించే మాదిరిగా సాయంత్రం సమయంలో ఆకాశంలో వరుసగా వరుసలో ఉంటాయి.’’ అని పట్నాయక్ చెప్పారు.

ఇక అన్ని లేదా కొన్ని గ్రహాల పరిశీలనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్న అరుదైన సందర్భాల్లో మూడో రకం ప్లానెట్ పపెరేడ్ జరుగుతుందని ఆయన చెప్పారు. ‘‘మూడు గ్రహాలను ఏకకాలంలో ఆకాశంలోని ఒకే భాగంలో కనిపించడం సంవత్సరంలో అనేకసార్లు చూడొచ్చు. అయితే, ఏప్రిల్ 2022 చివరి వారంలో.. శుక్రుడు, అంగారకుడు, బృహస్పతి, శని సూర్యోదయానికి ఒక గంట ముందు తూర్పు ఆకాశంలో కనిపించనున్నారు. ఇది చాలా అరుదైన ప్లానెట్ పెరేడ్. ఈ రకమైన ప్లానెట్ పెరేడ్ చివరగా 1,000 సంవత్సరాల క్రితం అంటే క్రీశ 947లో జరిగింది’’ అని పట్నాయక్ పేర్కొన్నారు.

‘‘ఏప్రిల్ 26, 27 తేదీలలో సూర్యోదయానికి ఒక గంట ముందు.. నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు తూర్పువైపు నుంచి 30 డిగ్రీల లోపల ఖచ్చితమైన సరళ రేఖలో కనిపిస్తాడు. వాతావరణ పరిస్థితులు సరిగ్గా ఉంటే.. బృహస్పతి, శుక్రుడు, అంగారక గ్రహాలను చూడవచ్చు. బైనాక్యులర్లు లేదా టెలిస్కోప్‌లు అవసరం లేకుండా శని గ్రహాన్ని చూడవచ్చు. ఇక ఏప్రిల్ 30న ప్రకాశవంతమైన గ్రహాలు – శుక్రుడు, బృహస్పతి లను చాలా దగ్గరగా చూడొచ్చు. శుక్రుడు బృహస్పతికి 0.2 డిగ్రీల దక్షిణాన ఉంటుంది.’’ అని వివరించారు పట్నాయక్.

Also read:

Andhra vs Odisha: ఆంధ్రా- ఒడిశా బోర్డర్‌లో టెన్షన్‌.. కోడిగుడ్ల లారీల అడ్డగింత.. రైతుల ఆందోళన..!

UPSC IES ISS 2022 పోస్టులకు దరఖాస్తు చేసుకున్నారా? కొన్ని గంటల్లో ముగియనున్న దరఖాస్తు ప్రక్రియ..

Letter to PM Modi: విద్వేషపూరిత రాజకీయాలు ఆపండి.. మీ మౌనం మంచిది కాదు.. ప్రధాని మోదీకి మాజీ ఉన్నతాధికారుల లేఖ