Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సమస్యతో ఇబ్బంది పడతున్నారా..? ఇలా చేయండి..!

Smartphone Settings: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు వాడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఫోన్‌లలో ఎంత స్టోరేజీ ఉన్న సరిపోవడం లేదు. ఫోటోలు, వీడియోలను ఎక్కువగా స్టోరేజీ చేసుకోవడం..

Smartphone Tips: మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ సమస్యతో ఇబ్బంది పడతున్నారా..? ఇలా చేయండి..!
Follow us

|

Updated on: Feb 14, 2022 | 6:18 PM

Smartphone Settings: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లు వాడేవారి సంఖ్య పెరిగిపోతోంది. ఫోన్‌లలో ఎంత స్టోరేజీ ఉన్న సరిపోవడం లేదు. ఫోటోలు, వీడియోలను ఎక్కువగా స్టోరేజీ చేసుకోవడం, అవసరం లేని యాప్ప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవడం వల్ల ఫోన్‌ నెమ్మదిస్తుంటుంది. ఫోన్ యూజర్లలో చాలామంది తమ ఫోన్ స్లోగా ఉందని, హ్యాంగ్ అవుతోందని చెబుతుంటారు. ఫోన్‌లలో అడ్డగోలుగా ఫోటోలు, వీడియోలు లోడ్‌ చేస్తుండటం వల్ల కూడా వేగం తగ్గిపోతుంది. అవసరం ఉన్న యాప్స్‌ మాత్రమే వేసుకుంటే మంచిది. ఎక్కువగా యాప్స్‌ వేసుకోవడం వల్ల ఫోన్‌ స్లో కావడమే కాకుండా పలు సమస్యలు తలెత్తుతుంటాయి. అయితే ఫోన్‌లో కొన్ని సెట్టింగ్స్‌ను మారిస్తే ఫోన్‌ వేగం పెరుగుతుంది. చాలామందికి ఆ సెట్టింగ్స్ గురించి తెలియక తమ ఫోన్ సరిగ్గా పనిచేయట్లేదని ఇబ్బందులు పడుతుంటారు. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లో మూడు టిప్స్ పాటిస్తే చాలంటున్నారు టెక్‌ నిపుణులు.

ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. అందులో About ఓపెన్ చేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ అయిందో లేదో చూడండి. లేకపోతే మీ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయండి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేయడానికి 15 నిమిషాలు పట్టవచ్చు. ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. మీ ప్రొఫైల్ పైన క్లిక్ చేసి manage apps and device పైన క్లిక్ చేయండి. అందులో యాప్స్ ఏవైనా అప్‌డేట్ చేయాల్సి ఉందేమో చూడండి. అన్ని యాప్స్ అప్‌డేట్ చేయండి. మీ స్మార్ట్‌ఫోన్‌లో యానిమేషన్స్ ఉంటే స్లోగా ఆపరేట్ అవుతుంది. పాత స్మార్ట్‌ఫోన్స్‌లో యానిమేషన్స్ సరిగ్గా పనిచేయవు. అందుకే సెట్టింగ్స్ ఓపెన్ చేసి About పైన క్లిక్ చేయండి. Build number పైన ఏడు సార్లు ట్యాప్ చేయండి. డెవలపర్ మోడ్ ఎనేబుల్ అవుతుంది. ఆ తర్వాత సెట్టింగ్స్‌లో, సిస్టమ్స్‌లో డెవలపర్ ఆప్షన్స్ సెలెక్ట్ చేయండి. కిందకు స్క్రోల్ చేస్తే యానిమేషన్స్ కనిపిస్తాయి. యానిమేషన్స్ మొత్తం ఆఫ్ చేయండి.

ఇక మీ స్మార్ట్‌ఫోన్ సెట్టింగ్స్‌లో స్టోరేజ్ పైన క్లిక్ చేయండి. Manage Storage పైన క్లిక్ చేయండి. అవసరం లేని ఫైల్స్, యాప్స్ డిలిట్ చేయండి. ముఖ్యమైన ఫైల్స్ ఎక్కువగా ఉంటే మీ ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లోకి బ్యాకప్ చేసుకోండి. లేదా మెమొరీ కార్డులో ట్రాన్స్‌ఫర్ చేయండి. పైన చెప్పిన మూడు టిప్స్ పాటిస్తే మీ స్మార్ట్‌ఫోన్ పెర్ఫామెన్స్ వేగంగా మారుతుంది. చిన్నపాటి టిప్స్‌తో స్మార్ట్‌ఫోన్‌ను వేగవంతం అయ్యేలా చేసుకోవచ్చు. ఈ టిప్స్‌తో కూడా మీ స్మార్ట్‌ఫోన్ ఎలాంటి మార్పులు రాకపోతే ఫైల్స్ అన్నీ బ్యాకప్ చేసి స్మార్ట్‌ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. ఫ్యాక్టరీ రీసెట్ చేసిన తర్వాత అవసరమైన యాప్స్ మాత్రమే ఇన్‌స్టాల్ చేయాలి. ఇలా కొన్ని టిప్స్‌ పాటించడం వల్ల ఫోన్‌ వేగవంతం కావడమే కాకుండా స్మూత్‌గా మారుతుంది.

ఇవి కూడా చదవండి:

Change-5 Rocket: చంద్రుడిపై కూలనున్న చైనా ఛేంజ్ 5- మిషన్ రాకెట్.. బట్టబయలు చేసిన శాస్త్రవేత్త..!

iPhone 13: గుడ్‌న్యూస్‌.. ఐఫోన్‌పై ఫ్లిప్‌కార్టులో అదిరిపోయే ఆఫర్‌.. భారీ డిస్కౌంట్‌..!

అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి
బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు పనుల్లో అపశ్రుతి.. పిల్లర్లు కూలి