Samsung Galaxy S24 5G AI: రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి.. అమెజాన్లో అద్భుతమైన ఆఫర్..

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024లో భాగంగా ఈ ఆఫర్లు అందిస్తున్నారు. దీనిలో ఓ హాట్ డీల్ అందుబాటులో ఉంది. అది శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జీ ఏఐపై ఉంది. ఈ ఫోన్ యాంబర్ ఎల్లో కలర్ ఆప్షన్లో 8జీబీ, 256జీబీ వేరియంట్ వాస్తవ ధర రూ. 79,998. అయితే ఇప్పుడు దీనిని అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో రూ. 15,711కే దక్కించుకోవచ్చు. ఎక్స్ చేంజ్ బోనస్, పలు కార్డు ఆఫర్లతో ఈ ధర లభిస్తుంది.

Samsung Galaxy S24 5G AI: రూ. 79,998విలువైన ఫోన్.. కేవలం రూ. 15వేలకే సొంతం చేసుకోండి.. అమెజాన్లో అద్భుతమైన ఆఫర్..
Samsung Galaxy S24 5g Ai
Follow us

|

Updated on: May 06, 2024 | 4:17 PM

ప్రముఖ టెక్ దిగ్గజం శామ్సంగ్ నుంచి అందుబాటులో ఉన్న స్మార్ట్ ఫోన్లపై ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం అమెజాన్లో మంచి డిస్కౌంట్లు ఉన్నాయి. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024లో భాగంగా ఈ ఆఫర్లు అందిస్తున్నారు. దీనిలో ఓ హాట్ డీల్ అందుబాటులో ఉంది. అది శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జీ ఏఐపై ఉంది. ఈ ఫోన్ యాంబర్ ఎల్లో కలర్ ఆప్షన్లో 8జీబీ, 256జీబీ వేరియంట్ వాస్తవ ధర రూ. 79,998. అయితే ఇప్పుడు దీనిని అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో రూ. 15,711కే దక్కించుకోవచ్చు. ఎక్స్ చేంజ్ బోనస్, పలు కార్డు ఆఫర్లతో ఈ ధర లభిస్తుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం..

శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జీ ఏఐ..

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్లో శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జీ ఏఐ స్మార్ట్ ఫోన్ పై అదిరే ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్ చేంజ్ డిస్కౌంట్, బ్యాంక్ ఆఫర్ ను వినియోగించుకుంటే భారీగా దీని ధర తగ్గుతుంది. ఉదాహరణకు మీరు శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జీ ఏఐ యాంబర్ ఎల్లో కలర్లోని 8జీబీ, 256జీబీ వేరియంట్ ఫోన్ ను అమెజాన్లో కొనుగోలును అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ద్వారా చేస్తే మీకు రూ. 8,037 డిస్కౌంట్ లభిస్తోంది. దీంతో ఈ ఫోన్ ధర రూ. 71,961కి తగ్గుతుంది. అదనంగా మీరు మంచి కండీషన్లో ఉన్న మీ పాత ఫోన్ ను ఎక్స్ చేంజ్ చేస్తే ఆ ఫోన్ మోడల్, దాని పరిస్థితిని బట్టి రూ. 56,250 వరకూ తగ్గుతుంది. ఈ ఎక్స్ చేంజ్ ఆఫర్ ను చెక్ చేసుకునేందుకు మీరు అమెజాన్ వెబ్ సైట్ కి వెళ్లి మీ ఏరియా పిన్ కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. వీటన్నంటితో కలిపి ఈ శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జీ ఏఐ స్మార్ట్ ఫోన్ ను మీరు కేవలం రూ. 15,711కే కొనుగోలు చేయొచ్చు.

శామ్సంగ్ గెలాక్సీ ఎస్24 5జీ ఏఐ స్పెసిఫికేషన్లు..

ఈ ఫోన్లో 6.20 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ టచ్ స్క్రీన్ డిస్ ప్లే 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఇస్తారు. ఇది ఆక్టాకోర్ ప్రాసెసర్ ద్వారా శక్తిని పొందుతుంది. 8జీబీ ర్యామ్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే 4000ఎంఏహెచ్ నాన్ రిమూవబుల్ బ్యాటరీ, వైర్ లెస్ చార్జింగ్, ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 12ఎంపీ, 10ఎంపీ కెమెరాలు ఉంటాయి. ముందు వైపు 12ఎంపీ సెన్సార్ ఉంటుంది. ఈ ఫోన్ 128జీబీ, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
జంతువుల నుంచి ఏం నేర్చుకుంటాం అనుకుంటున్నారా.? ఇది తెలుసుకోవాలి
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
తాడిపత్రిలో సిట్ బృందం పర్యటన.. హింసాకాండపై దర్యాప్తు ముమ్మరం..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
వ్యాపారంలో విజయానికి ఐదు సూత్రాలు.. ఇవి పాటిస్తే చాలు..
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇదేంది మచ్చా.. 17 ఏళ్ల ఐపీఎల్ హిస్టరీలోనే ఇలాంటి రికార్డ్ చూడలే
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
ఇంత తక్కువ బడ్జెట్‌లో ఇలాంటి ఫోన్‌ నెవ్వర్‌ బిఫోర్‌..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
తక్కువ ధరలో బెస్ట్ 5జీ ఫోన్.. పైగా పూర్తిగా వాటర్ ప్రూఫ్..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌.. యూటీఎస్‌ యాప్‌లో కీలక మార్పు..
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ 2024 పరీక్షల హాల్‌టికెట్లు విడుద‌ల‌
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
ధరణిపై దూకుడు పెంచిన సర్కార్.. సీఎం రేవంత్ కీలక సూచనలు..
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో
కోహ్లీ నో లుక్ సిక్స్.. స్టేడియం పైకప్పును తాకిన బంతి.. వీడియో