Realme P4 5G: రియల్‌మీ P4 Vs రియల్‌మీ P4 ప్రో.. ఏది బెస్ట్? ధర ఎంత..?
రియల్ మీ రెండు కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. వీటిలో P4, P4 ప్రో ఉన్నాయి. ఈ ఫోన్‌లు 7000 ఎంఏహెచ్ బ్యాటరీ, అధునాతన ఏఐ కెమెరా ఫీచర్లతో వస్తాయి. ఈ ఫోన్‌ల ధర.. రెండింటిలో ఏది బెస్ట్ అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

కొత్త ఫోన్ కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్. రియల్‌మీ తన కొత్త సిరీస్‌లో భాగంగా రెండు అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. అవి రియల్ మీ P4 5G, రియల్ మీ P4 5G Pro. బడ్జెట్ రేంజ్‌లో శక్తివంతమైన ఫీచర్లతో ఈ ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఈ రెండు ఫోన్‌ల ధరలు, ఫీచర్లు, ఏది మీకు బెస్ట్ అనే వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..
రియల్ మీ P4 5G Pro: ధర, వేరియంట్లు
రియల్ మీ P4 5G Pro మూడు వేరియంట్లలో విడుదలైంది. దీని ప్రారంభ ధర రూ. 24,999గా ఉంది.
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: రూ. 24,999
8జీబీ ర్యామ్+ 256జీబీ స్టోరేజ్: రూ. 26,999
12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్: రూ. 28,999 అంతేకాకుండా ఈ ఫోన్ మూడు ఆకర్షణీయమైన రంగుల్లో అందుబాటులో ఉంది.
రియల్ మీ P4 5G: ధర, వేరియంట్లు
రియల్ మీ P4 5G కూడా మూడు వేరియంట్లలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 18,499.
6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: రూ. 18,499
8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్: రూ. 19,499
8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్: రూ. 21,499
రియల్ మీ P4 Pro అల్టిమేట్ పర్ఫార్మెన్స్‌తో వస్తే.. రియల్ మీ P4 ప్రో శక్తివంతమైన ఫీచర్లతో వచ్చింది.
రియల్ మీ P4 ప్రో ఫీచర్లు
డిస్‌ప్లే: 6.8 ఇంచెస్ FHD అమోల్డ్ డిస్‌ప్లే, 144Hz రిఫ్రెష్ రేట్, 65,000 నిట్స్ బ్రైట్‌నెస్‌తో అద్భుతమైన వ్యూయింగ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది.
ప్రాసెసర్: స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 SoC ప్రాసెసర్, ఆపరేటింగ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది.
బ్యాటరీ – ఛార్జింగ్: 7000mAh బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్.
కెమెరా: వెనుకవైపు 50MP + 8MP డ్యూయల్ కెమెరా, ముందువైపు 50MP సెల్ఫీ కెమెరా.
ఇతర ఫీచర్లు: IP65, IP66 దుమ్ము, వాటర్ రెసిస్టెన్స్‌తో పాటు ఏఐ స్నాప్ మోడ్, ఏఐ పార్టీ మోడ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.
రియల్ మీ P4 ఫీచర్లు:
రియల్ మీ P4 బడ్జెట్ రేంజ్‌లో అద్భుతమైన ఫీచర్లతో లాంచ్ అయింది.
డిస్‌ప్లే: 6.77 ఇంచెస్ అమోల్డ్ స్క్రీన్, 144Hz రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ బ్రైట్‌నెస్‌తో ఆకర్షణీయంగా ఉంది.
ప్రాసెసర్: మీడియాటెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్‌తో వేగవంతమైన పనితీరును అందిస్తుంది.
కెమెరా: వెనుకవైపు 50MP + 8MP కెమెరా, ముందువైపు 16MP కెమెరా ఉన్నాయి.
ఏది బెస్ట్?
మీరు బడ్జెట్‌లో ఎక్కువ ఫీచర్లు కోరుకుంటే రియల్ మీ P4 5G Pro ఉత్తమ ఎంపిక. దీని శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, పెద్ద బ్యాటరీ, 80W ఫాస్ట్ ఛార్జింగ్, అద్భుతమైన కెమెరా సిస్టమ్ గేమింగ్, ఫోటోగ్రఫీ, రోజువారీ వాడకానికి సరిపోతుంది.
ఒకవేళ మీ బడ్జెట్ తక్కువగా ఉండి మంచి పనితీరు, డిస్‌ప్లే, కెమెరా కోరుకుంటే రియల్ మీ P4 5G సరైన ఎంపిక. ఈ ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో మంచి వేగాన్ని, 144Hz రిఫ్రెష్ రేట్‌తో సాఫీగా పనిచేసే అనుభవాన్ని ఇస్తుంది. మీరు ఏ ఫోన్‌ని కొనాలనుకుంటున్నారో నిర్ణయించుకునే ముందు.. మీ అవసరాలను, బడ్జెట్‌ను పరిగణనలోకి తీసుకోండి.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




