Realme GT 7 Pro: రియల్‌మీ నుంచి సూపర్బ్‌ ఫోన్‌.. భారత్‌లో ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే

|

Nov 04, 2024 | 6:42 PM

చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ మార్కెట్లోకి కొత్త ఫోన్ ను తీసుకొస్తోంది. రియల్ మీ జీటీ 7 ప్రో పేరుతో ఈ ఫోన్ ను తీసుకొస్తున్నారు. నవంబర్ 26వ తేదీన ఈ ఫోన్ ను భారత మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. ఇంతకీ ఫోన్ లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Realme GT 7 Pro: రియల్‌మీ నుంచి సూపర్బ్‌ ఫోన్‌.. భారత్‌లో ఆ ఫీచర్‌తో వస్తున్న తొలి ఫోన్‌ ఇదే
Realme Gt 7 Pro
Follow us on

చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ మార్కెట్లోకి కొంగొత్త ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తోంది. ఓవైపు బడ్జెట్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసుకొని ఫోన్‌లను తీసుకొస్తున్న మరోవైపు ప్రీమియం ఫోన్‌లను సైతం లాంచ్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా భారత్‌లోకి రియల్‌మీ జీటీ 7 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చేంచేందుకు సన్నాహాలు చేస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ ఫోన్‌కు సంబంధించి వార్తలు వస్తుండగా తాజాగా కంపెనీ ఈ ఫోన్‌ లాంచింగ్‌ కుసంబంధించి అధికారిక ప్రకటన చేసింది. నవంబర్‌ 26వ తేదీన ఈ ఫోన్‌ను భారత్‌లో లాంచ్‌ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండనున్నాయి.? ధర ఎంత.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

స్నాప్‌డ్రాగన్‌ 8 ఎలైట్‌ ప్రాసెసర్‌తో భారత్‌లో లాంచ్‌ అవుతోన్న తొలి స్మార్ట్‌ ఫోన్‌ ఇదే కావడ విశేషం. ఈ ఫోన్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన ఫీచర్లను అందించనున్నారు. ఏమో మోడ్‌ డీబ్లర్‌, ఏఐ టెలిఫొటో అల్ట్రా క్లారిటీ, ఏఐ గేమ్‌ సూపర్‌ రిజల్యూషన్‌ వంటి ఫీచర్లను అందించారు. ఫీచర్ల విషయానికొస్తే 6.78 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లేను అందించారు. ఎకో2 ఓఎల్‌ఈడీ స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్ ఈ స్క్రీన్‌ సొంతం. అల్ట్రా సోనిక్‌ ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను ఇవ్వనున్నారు.

ఈ ఫోన్‌ను 128, 256, 512, 1టీబీ స్టోరేజ్‌ వేరియంట్స్‌తో పాటు 8జీబీ, 16జీబీ, 24 జీబీ ర్యామ్‌ వేరియంట్స్‌లో తీసుకొస్తున్నారు. ఇక ఈ ఫోన్‌లో 120 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6500 ఎమ్‌ఏహెచ్‌ కెపాసిటీ గల బ్యాటరీని అందించనున్నారు. కెమెరా విషయానికొస్తే ఈ ఫోన్‌లో 50 ఎంపీతో కూడిన ట్రిపుల్ రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందిస్తున్నారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించనున్నారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేయనుంది. ఐపీ68/69 సర్టిఫికేషన్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చే అవకాశాలుఉన్నాయి. ధరకు సంబంధించి రియల్‌మీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..