Oppo A38: ఒప్పో నుంచి చవకైన 5జీ ఫోన్.. స్పెసిఫికేషన్లు.. ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోతారు..
ప్రస్తుతం ఒప్పో నుంచి బడ్జెట్ లెవెల్లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీనిపేరు ఒప్పో ఏ38. దీనిలో హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ చిప్ సెట్, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి ఉంది. ఈ నేపథ్యంలో ఒప్పో ఏ38 ఫుల్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలుసుకుందాం..

ఒప్పో ఫోన్లకు మన దేశంలో ప్రత్యేక స్థానం ఉంది. ఈ బ్రాండ్ ఫోన్లకు మంచి డిమాండ్ కూడా ఉంది. ఏ కొత్త ఉత్పత్తి ఈ బ్రాండ్ నుంచి వచ్చినా వినియోగదారుల్లో ఆసక్తి ఉంటుంది. ప్రస్తుతం ఒప్పో నుంచి బడ్జెట్ లెవెల్లో మరో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసింది. దీనిపేరు ఒప్పో ఏ38. దీనిలో హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే ఉంటుంది. మీడియా టెక్ చిప్ సెట్, ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో బ్యాటరీ ఉంటుంది. ప్రస్తుతం ఈ ఫోన్ ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్ ఫారం ఫ్లిప్ కార్ట్ లో అమ్మకానికి ఉంది. ఈ నేపథ్యంలో ఒప్పో ఏ38 ఫుల్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు, ధర వంటి వివరాలు తెలుసుకుందాం..
ఒప్పో ఏ38 ధర, లభ్యత..
ఒప్పో38 సింగిల్ వేరియంట్లో లభ్యమవుతుంది. 4జీబీ, 128జీబీ వేరియంట్లో మాత్రమే లభిస్తోంది. దీని ధర రూ. 12,999గా ఉంది. గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గోల్డ్ కలర్ ఆప్షన్ లో అందుబాటులో ఉంటుంది. వినియోగదారులు ఈ స్మార్ట్ ఫోన్ ని ఫ్లిప్ కార్ట్ కొనుగోలు చేయొచ్చు.
ఒప్పో ఏ38 స్పెసిఫికేషన్లు..
ఒప్పో ఏ38 అనేది ఫీచర్ స్మార్ట్ ఫోన్. దీనిలో 6.56 అంగుళాల హెచ్ డీ ప్లస్ ఎల్సీడీ స్క్రీన్ ఉంటుంది. 90హెర్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. 720నిట్స్ పీక్ బ్రైట్ నెస్ ఉంటుంది. దీనిలో మీడియా టెక్ హీలియో జీ85 ప్రాసెసర్ ఆక్టా కోర్ కాన్ఫిగరేషన్ తో ఉంటుంది. ఈ ఫోన్ 4జీబీ ర్యామ్, 128జీబీ ఇంటర్నల్ మెమరీతో వస్తుంది. 1టీబీ వరకూ మైక్రో ఎస్డీ కార్డ్ తో ఎక్స్ ప్యాండ్ చేసుకోవచ్చు.




ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్13, కలర్ ఓఎస్ 13.1 ఆధారంగా పనిచేస్తుంది. డ్యూయల్ సిమ్ కార్డులు ఉంటాయి. వెనుకవైపు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 50ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 2ఎంపీ పోర్ట్ రైట్ కెమెరా ఎల్ఈడీ ఫ్లాష్ ఉంటుంది. 5ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.
ఒప్పో ఏ38 కనెక్టివిటీ ఫీచర్లు..
ఈ కొత్త స్మార్ట్ ఫోన్ 5జీ కనెక్టవిటీతో వస్తుంది. డ్యూయల్ 4జీ వీఓఎల్టీఈ హై స్పీడ్ ఇంటర్ నెట్ యాక్సెస్ ఉంటుంది. వైఫై 802, బ్లూ టూత్ 5.3, జీపీఎస్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 3.5ఎంఎం ఆడియో జాక్ ఉంటుంది. 5000ఎంఏహెచ్ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ ఉంటుంది. 33వాట్ల సూపర్ వీఓఓసీ ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉంటుంది. తక్కువ బడ్జెట్లో 5జీ ఫోన్ కావాలనుకొనే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ గా ఉంటుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..