Oneplus Nord ce3: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. నార్డ్‌ సీఈ3పై భారీ డిస్కౌంట్‌..

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ3 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 26,999గా ఉండేది. అయితే ప్రస్తుతం తగ్గించిన ధరతో రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 28,999కాగా రూ. 27,999కి తగ్గింది. ఆక్వా సర్జ్‌, గ్రే షిమ్మర్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 782జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌...

Oneplus Nord ce3: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌.. నార్డ్‌ సీఈ3పై భారీ డిస్కౌంట్‌..
Oneplus Nord Ce3

Updated on: Nov 29, 2023 | 9:38 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ దిగ్గజ సంస్థ వన్‌ప్లస్‌ తమ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 స్మార్ట్ ఫోన్‌పై డిస్కౌంట్‌ను అందిస్తోంది. ఈ సిరీస్‌ ఫోన్‌ సిరీస్ ధరను రూ.2వేలకు కుదిస్తూ వన్‌ప్లస్‌ నిర్ణయం తీసుకుంది. వన్‌ప్లస్‌ సీఈ3 ఈ ఏడాది జూన్‌లో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ ఫోన్‌ ధరను తగ్గిస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

వన్‌ప్లస్‌ నార్డ్ సీఈ3 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 26,999గా ఉండేది. అయితే ప్రస్తుతం తగ్గించిన ధరతో రూ. 24,999కే సొంతం చేసుకోవచ్చు. ఇక 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 28,999కాగా రూ. 27,999కి తగ్గింది. ఆక్వా సర్జ్‌, గ్రే షిమ్మర్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌లను తీసుకొచ్చారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 782జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్‌ 13 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో ఈ ఫోన్‌ పని చేస్తుంది. ఆక్సిజన్‌ఓస్‌ 13.1 ఈ ఫోన్‌ సొంతం.

ఇక స్క్రీన్‌ విషయానికొస్తే.. ఈ ఫోన్‌లో 6,7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌హెచ్‌డీ+ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఆక్టాకోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 782జీ ప్రాసెసర్‌ ఈ ఫోన్‌ సొంతం. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 50 మెగా పిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించారు. ఇక సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక మైక్రో ఎస్‌డీ కార్డ్‌ ద్వారా స్టోరేజ్‌ను 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో.. జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్‌ 5.2, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, ఏ-జీపీఎస్‌, యూఎస్‌బీ టైప్‌-సీ పోర్ట్‌ వంటి ఫీచర్లను అందించారు. ఇక యాక్సెలరోమీటర్‌, యాంబియెంట్‌ లైట్‌ సెన్సర్‌, ఇ-కంపాస్‌, ఐఆర్‌ బ్లాస్టర్‌, గైరోస్కోప్‌, ప్రాక్జిమిటీ సెన్సర్‌, టెంపరేచ్ వంటి సెన్సార్లను ప్రత్యేకంగా అందించారు. బయోమెట్రిక్‌ అథెంటికేషన్‌ కోసం ఇన్‌స్క్రీన్‌ ఫింగర్‌ ప్రింట్‌ను అందించారు. ఇక బ్యాటరీ విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో.. 80 వాట్ సూపర్‌ వూక్‌ సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..