AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నథింగ్​ హెడ్‌ఫోన్స్‌ వస్తే సౌండ్ లవర్స్‌కు పండగే! లాంచ్​ డేట్, ఫీచర్ల పూర్తి వివరాలు

Nothing Headphone 1 Pro.. విభిన్నమైన డిజైన్లతో టెక్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Nothing ఇప్పుడు ప్రీమియం హెడ్‌ఫోన్ రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. Nothing Headphone 1 Pro పేరుతో రానున్న ఈ మోడల్‌లో అత్యుత్తమ ధ్వని, అధునాతన శబ్ద నియంత్రణ, భారీ బ్యాటరీ వంటి సౌకర్యాలు ఉండనున్నాయి. లీకైన వివరాలు సంగీత ప్రియుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.

నథింగ్​ హెడ్‌ఫోన్స్‌ వస్తే సౌండ్ లవర్స్‌కు పండగే! లాంచ్​ డేట్, ఫీచర్ల పూర్తి వివరాలు
Nothing Headphone 1 Pro
Nikhil
|

Updated on: Sep 15, 2026 | 6:50 AM

Share

ప్రీమియం హెడ్‌ఫోన్ కొనాలనుకునే వారికి Nothing నుంచి రాబోతున్న కొత్త మోడల్ ఆసక్తికరంగా మారింది. Triple-Driver సాంకేతికత, 10 మైక్రోఫోన్ల Adaptive ANC, 60 గంటల బ్యాటరీ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 29న విడుదలయ్యే అవకాశం ఉందని లీకులు చెబుతున్నాయి. ధర కూడా ప్రీమియం స్థాయిలోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

Triple-Driver సౌండ్..

Nothing Headphone 1 Proలో Triple-Driver ఆర్కిటెక్చర్‌ను ఉపయోగించినట్లు తెలుస్తోంది. బేస్, స్పష్టత కోసం ప్రత్యేక డ్రైవర్లతో పాటు అధిక పౌనఃపున్యాల కోసం XMems సాంకేతికతను అందించినట్లు సమాచారం. లండన్‌కు చెందిన Metropolis Studios సహకారంతో ధ్వని ట్యూనింగ్ చేసినట్లు తెలుస్తోంది. Hi-Res Audio సర్టిఫికేషన్, LDAC సపోర్ట్, Head Trackingతో Spatial Audio వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉండనున్నాయి. దీంతో పాటలు వినేటప్పుడు మరింత లోతైన ధ్వని అనుభూతి లభించే అవకాశం ఉంది.

10 మైక్రోఫోన్లు.. 60 గంటల బ్యాటరీ!

పరిసర శబ్దాలను తగ్గించేందుకు 10 మైక్రోఫోన్లతో Adaptive ANC సౌకర్యాన్ని అందిస్తున్నట్లు సమాచారం. చుట్టూ ఉన్న శబ్దాన్ని బట్టి శబ్ద నియంత్రణ స్థాయిని స్వయంగా మార్చుకునేలా ఇది పనిచేస్తుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 60 గంటల వరకు బ్యాటరీ బ్యాకప్ లభించనుందని తెలుస్తోంది. కనెక్టివిటీ కోసం Bluetooth 6.1, USB Type-C పోర్ట్, 3.5mm జాక్ ఉన్నాయి.

నిర్మాణం విషయంలో Aluminium Body, Scratch-Resistant Glassను ఉపయోగించినట్లు సమాచారం. దుమ్ము, నీటి చుక్కల నుంచి రక్షణ కోసం IP52 రేటింగ్ ఉండనుంది. లీకుల ప్రకారం యూరప్‌లో ధర సుమారు రూ.38,700, అమెరికాలో రూ.38,000గా ఉండొచ్చని తెలుస్తోంది. Black, White రంగుల్లో సెప్టెంబర్ 29న విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే ధర, విడుదల తేదీపై Nothing నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Follow Us