Nokia T20 Tablet: నోకియా సరికొత్త ట్యాబ్లెట్.. అదిరిపోయే ఫీచర్లు.. లీకైన స్పెసిఫికేషన్లు!

నోకియా సరికొత్త ట్యాబ్లెట్‌ను విడుదల చేయనుంది. టీ20 పేరుతో విడుదల చేయనున్నట్లు వార్తలు వెలువడున్నాయి. కాగా, నోకియా టీ20 ట్యాబ్లెట్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు నెట్టింట్లో లీకయ్యాయి. అయితే, 2014 తర్వాత నోకియా లాంచ్ చేసే తొలి ట్యాబ్లెట్ ఇదే.

Nokia T20 Tablet: నోకియా సరికొత్త ట్యాబ్లెట్.. అదిరిపోయే ఫీచర్లు.. లీకైన స్పెసిఫికేషన్లు!
Nokia T20 Tablet
Follow us
Venkata Chari

|

Updated on: Jul 30, 2021 | 12:35 PM

Nokia T20 Tablet: నోకియా సరికొత్త ట్యాబ్లెట్‌ను విడుదల చేయనుంది. టీ20 పేరుతో విడుదల చేయనున్నట్లు వార్తలు వెలువడున్నాయి. కాగా, నోకియా టీ20 ట్యాబ్లెట్ ధర, స్పెసిఫికేషన్ల వివరాలు నెట్టింట్లో లీకయ్యాయి. అయితే, 2014 తర్వాత నోకియా లాంచ్ చేసే తొలి ట్యాబ్లెట్ ఇదే. నోకియా టీ20 ట్యాబ్లెట్‌ వైఫై, 4జీ వేరియంట్లతో విడుదల కానున్నాయి. మొదటగా ఈ వివరాలు యూకే రిటైలర్ వెబ్‌సైట్లో లీకయ్యాయి. వైఫై, వైఫై+4జీ ఎల్టీఈ లుగా ఈ ట్యాబ్లెట్ విడుదల కానున్నట్లు తెలుస్తున్నాయి. వైఫై వేరియంట్ ధర 185 పౌండ్లుగానూ(సుమారు రూ.19,100), వైఫై+4జీ వేరియంట్ ధర 202 పౌండ్లుగానూ(సుమారు రూ.20,900) ఉండనుంది.

స్పెసిఫికేషన్లు 10.36 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. ఇందులో 4 జీబీ ర్యామ్+64 జీబీ స్టోరేజ్ అందించనున్నారు. అయితే ఇప్పటి వరకు నోకియా కంపెనీ అధికారికంగా ఎటువంటి వివరాలు ప్రకటించలేదు. ఈ ట్యాబ్లెట్‌తోపాటు మరో రెండ ట్యాబ్లెట్లు రష్యా సర్టిఫికేషన్ వెబ్‌సైట్లో కనిపించాయని తెలుస్తోంది. కాగా, నోకియా ఎక్స్ఆర్20, నోకియా సీ30, కొన్ని టీడబ్ల్యూఎస్ ఇయర్‌బడ్స్ ఇటీవలే లాంచ్ అయ్యాయి. నోకియా ఎక్స్ఆర్20లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేయనుంది. 6.67 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లేతో విడుదలైంది. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 480 ప్రాసెసర్‌పై పనిచేయనున్న ఈ ఫోన్‌లో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్‌ అందించారు.

నోకియా ఎక్స్ఆర్20లో బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు అందించారు. వీటిలో మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్‌ కాగా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ యాంగిల్ షూటర్ అందించారు. ముందు భాగంలో 8 మెగాపిక్సెల్‌ను సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం అందించారు. 4630 ఎంఏహెచ్‌ బ్యాటరీతో విడుదలైన ఈ ఫోన్ వైర్డ్ చార్జింగ్‌తోపాటు వైర్‌లెస్ చార్జింగ్‌కు సపోర్ట్ చేయనుంది.

Also Read: Huawei P50: హువావే పీ50, పీ50 ప్రో ఫోన్లు విడుదల.. ధర చూస్తే వామ్మో అనాల్సిందే..!

Motorola Edge 20: ఆగస్టు 5న మోటరోలా ఎడ్జ్ 20 సిరీస్ ఫోన్లు.. లీకైన ఫీచర్లు.. చూస్తే వావ్ అనాల్సిందే…!