HMD Skylie: మార్కెట్లోకి మరో సూపర్ స్మార్ట్‌ఫోన్… ఫీచర్స్ అరాచకం…
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నోకియా మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ హెచ్‌ఎండీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హెచ్‌ఎండీ స్కైలైన్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. నోకియా లూమియా 920 రీడిజైనింగ్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. హెచ్‌ఎండీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే....
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ నోకియా మ్యానిఫ్యాక్చరింగ్ కంపెనీ హెచ్‌ఎండీ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హెచ్‌ఎండీ స్కైలైన్ పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. నోకియా లూమియా 920 రీడిజైనింగ్‌గా ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నట్లు సమాచారం. హెచ్‌ఎండీ ఇప్పటి వరకు ఈ ఫోన్‌కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే నెట్టింట ఈ ఫోన్‌కు సంబంధించి కొన్ని ఫీచర్లు వైరల్ అవుతున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
బెల్జియన్ రిటైలర్ వెబ్‌సైట్‌లో లీక్ అయిన ఫోటోల ప్రకారం ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన మోడల్‌తో డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఫోన్‌లో రౌండ్‌గా మాడ్యూల్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే ఇందులో ట్రిపుల్ కెమెరా రెయిర్ సెటప్‌ను అందించనున్నారు. వెనకాల ఎల్‌ఈడీ ఫ్లాష్‌ను ఇవ్వనున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాన్ 7ఎస్ జెన్ 2 ప్రాసెసర్‌ను అందించనున్నారు. ఇక స్క్రీన్ విషయానికొస్తే ఇందులో హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వున్నారు.
120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్ ఈ స్క్రీన్ సొంతం. ఇక కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 108 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించనున్నారు. ఈ ఫోన్‌లో అదనంగా అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ కెమెరాను ఇచ్చారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందిచనున్నారు.
బ్యాటరీ విషయానికొస్తే ఇందులో 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4900 ఎమ్ఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు. దీంతో పాటు IP67 రేటింగ్‌తో కూడిన వాటర్ రెసిస్టెంట్‌ను అందించారు. అయితే ఈ ఫోన్ ధరకు సంబంధించి కంపెనీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. త్వరలోనే ఈ ఫోన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..