Nokia Feature Phone: అతి తక్కువ ధరకే నోకియా ఫీచర్ ఫోన్లు.. యూట్యూబ్, యూపీఐ పేమెంట్ ఆప్షన్లతో..
ఇప్పటికే ఉన్న మోడళ్లకు తోడు రెండు కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. హెచ్ఎండీ నోకియా 220 4జీ, నోకియా 235 4జీ పేర్లతో కొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్‌లు క్లాసిక్ స్నేక్ గేమ్, యూట్యూబ్ షార్ట్ యాప్, సులభ లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ప్రీలోడ్ చేసిన యూపీఐ చెల్లింపులు చేసుకునేలా తీసుకొచ్చింది.
స్మార్ట్ ఫోన్లు మార్కెట్లో ఎంతలా అందుబాటులోకి వస్తున్నా.. బేసిక్ ఫీచర్ ఫోన్లను కూడా వాడేవారు అధికంగానే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రిలయన్స్ జియో 4జీ వేరియంట్ లో స్మార్ట్ ఫోన్ కి దీటుగా కీప్యాడ్ ఫోన్లను లాంచ్ చేసింది. సక్సెస్ అయ్యింది. ఇప్పుడు అదే ట్రెండ్ ను హెచ్ఎండీ గ్లోబల్ ఆధ్వర్యంలోని నోకియా కూడా మొదలు పెట్టింది. ఇప్పటికే ఉన్న మోడళ్లకు తోడు రెండు కొత్త 4జీ ఫీచర్ ఫోన్లను లాంచ్ చేసింది. హెచ్ఎండీ నోకియా 220 4జీ, నోకియా 235 4జీ పేర్లతో కొత్త ఫీచర్ ఫోన్లను తీసుకొచ్చింది. ఈ రెండు ఫోన్‌లు క్లాసిక్ స్నేక్ గేమ్, యూట్యూబ్ షార్ట్ యాప్, సులభ లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ప్రీలోడ్ చేసిన యూపీఐ చెల్లింపులు చేసుకునేలా తీసుకొచ్చింది. దీనిక సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
నోకియా 235 4జీ, 220 4జీ ధర..
నోకియా 235 4జీ మూడు రంగులలో వస్తుంది. నీలం, నలుపు, ఊదా రంగుల్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 3,749. నోకియా 220 4జీ ఫోన్ పీచ్, బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో లభిస్తుంది. దీని ధర రూ.3,249. రెండు పరికరాలు హెచ్ఎండీ.కామ్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్, నోకియా రిటైల్ అవుట్‌లెట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
నోకియా 235 (2024), నోకియా 220 4జీ ఫీచర్లు..
నోకియా 235 4జీ ఫీచర్ ఫోన్ 2.8-అంగుళాల డిస్ ప్లే, 2ఎంపీ వెనుక కెమెరాతో వస్తుంది. అలాగే ఇది యూనీసోక్ టీ107 ప్రాసెసర్, ఎస్30 ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తుంది. 64ఎంబీ ర్యామ్, 128ఎంబీ స్టోరేజ్ తో వస్తుంది. దీనిని మైక్రో ఎస్డీ కార్డ్ ద్వారా 32జీబీవరకు విస్తరించవచ్చు. పరికరం 1450ఎంఏహెచ్ తొలగించగల బ్యాటరీతో వస్తుంది. ఇది 9.8 గంటల మాట్లాడే సమయాన్ని అందిస్తుంది. కనెక్టివిటీ ఫీచర్లలో ఛార్జింగ్ కోసం యూఎస్బీ-సీ టైప్, బ్లూటూత్ వీ5.0, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇతర ఫీచర్ల విషయానికి వస్తే ఎఫ్ఎం రేడియో, క్లౌడ్ యాప్‌లకు మద్దతునిస్తుంది. వార్తలు, వాతావరణ అప్‌డేట్‌లు, ఎంపీ3 ప్లేయర్, క్లాసిక్ స్నేక్ గేమ్, యూట్యూబ్ షార్ట్‌లు, స్కాన్ చేసి యూపీఐ చెల్లింపు యాప్‌లను కూడా సపోర్ట్ చేస్తుంది.
నోకియా 220 4జీ ఫీచర్ ఫోన్ కూడా 2.8-అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. యూనిసోక్ టీ107 ప్రాసెసర్, ఎస్30ప్లస్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. సులభమైన లావాదేవీల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ద్వారా ప్రీలోడ్ చేసి, ఆమోదించబడిన యూపీఐ అప్లికేషన్‌లకు ఇది మద్దతు ఇస్తుంది. 2ఎంపీ వెనుక కెమెరా మినహా, నోకియా 235 4జీ మోడల్‌లో ఉన్న అన్ని ఫీచర్లు ఇందులో ఉంటాయి. ఇది క్లాసిక్ స్నేక్ గేమ్‌తో కూడా వస్తుంది. స్మార్ట్‌ఫోన్ లేకుండానే యూపీఐ లావాదేవీలను యాక్సెస్ చేయాలనుకునే వ్యక్తులకు ఈ పరికరాలు మంచి ఎంపిక.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..