ఇదేక్కడి చోద్యమమ్మా అని సరోగసి పద్దతిని చూసి చాలా మంది నొసలు నొక్కుకున్నారు. కొందరు ముక్కున వేలేసుకున్నారు. బిడ్డను కంటే కదా మాతృత్వ మధురిమలు తెలిసేది అని ఈసడించుకున్నారు. ఇప్పుడు సరోగసి కంటే చిత్ర విచిత్రాతి ప్రక్రియ రాబోతున్నది.. ఈ విషయాన్ని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారో లేదో తెలియదు కానీ కోళ్లను ఫారాల్లో పెంచినట్టు పిండాలను కూడా ఫారాల్లో పెంచబోయే రోజులు వచ్చేస్తున్నాయి. కలికాలం అంటే ఇదో కాబోలు. ఇప్పుడు సరోగసీ పద్ధతిని ఎంచుకోవడంతో పాటు కొత్తగా విదేశాల్లో కృత్రిమ గర్భంతో జననం కూడా అందుబాటులోకి వచ్చింది. కోళ్లను ఫారాల్లో పెంచినట్టు.. మనుషులను కూడా ఫారాల్లో పెంచితే! ఒక గదిలో గర్భాలను సాగు చేస్తే! ఆధునిక టెక్నాలజీలతో ఏదో ఒక రోజు ఇది జరుగుతుందని ఊహించారా? ఈ ఊహలను నిజం చేసే రోజు అతి దగ్గరలో ఉన్నదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్, బయోటెక్నాలజిస్టు హాషీం అల్-ఘైలీ దీనికి సంబంధించిన వీడియోను తయారు చేశారు.
గర్భాలను ఒక అండాకార పారదర్శక గాజు పెట్టెలో పెంచుతారు. అందుకోసం ఇన్‌విట్రో ఫెర్టిలైజేషన్ పద్ధతిని ఉపయోగిస్తారు. వాస్తవంలో తల్లి గర్భంలో ఉండే అన్ని సదుపాయాలను ఇందులో ఏర్పాటు చేస్తారు. న్యూట్రిషన్లు, ఆక్సిజన్‌ను అందజేస్తారు. దాదాపు 75 ల్యాబ్‌లలో 400 చొప్పున పెట్టెలు ఉంటాయి. ఈ పెట్టెలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సెన్సర్లు కూడా ఉంటాయి. ఆ సెన్సర్ల సాయంతో పెట్టెలోని గర్భం గుండెకొట్టుకొనే వేగం, ఉష్ణోగ్రత, ఆక్సిజన్ స్థాయులను తెలుసుకోవచ్చు.
ఇందులో అమర్చిన కెమెరా సాయంతో గర్భంలోని జన్యుపరమైన సమస్యలు తెలుసుకొని నియంత్రించవచ్చు. ఎప్పటికప్పుడు గర్భం పెరుగుదలను చూడొచ్చు. తల్లిదండ్రులు బిడ్డ పెరుగుదలను చూసేలా యాప్ ద్వారా అనుసంధానిస్తారు. వాళ్లు కావాలనుకొంటే పాటలు ప్లే చేయొచ్చు. ఆ బిడ్డకు ముచ్చట్లు చెప్పొచ్చు. బిడ్డను బయటకు తీయాలంటే ఆ బర్తింగ్ పాడ్‌పై ఉండే బటన్ నొక్కి చేతిలోకి తీసుకోవటమే.
ప్రపంచపు మొదటి కృత్రిమ గర్భ సౌకర్యం. ఇంకా సరళంగా చెప్పాలంటే తల్లి కడుపులో పెరగాల్సిన అవసరం లేకుండా, ప్రసవం సమయంలో రిస్కులు లేకుండా బిడ్డను ల్యాబులో పెంచుతారు. అయితే ఆర్టిఫిషియల్ వూంబ్ అనే పదం కరెక్టు కాదు. నిజమైన పిండాలే అవి కృత్రిమ తల్లి కడుపులు. అంటే ఏటా 30 వేల మందికి అలా జన్మనిస్తాడట ఎక్టోలైఫ్ ఓనర్. కానీ చట్టాలు, నైతిక విషయాలు ఈ ‘‘వ్యాపారానికి’’ అడ్డంకులు అని కూడా బాధపడిపోయాడు.
ప్రస్తుతం సెలబ్రెటీలు సరోగసి పద్దతికి ఆసక్తి చూపిస్తున్నారు. తల్లిగా మారడానికి అద్దె గర్భాలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటివరకు సర్రోగసీ ద్వారా తల్లి-తండ్రిగా మారిన సెలబ్రిటీల జాబితా చాలా పెద్దదే. సరోగసీ అంటే.. అండాన్ని దాచుకోవచ్చు. కోరుకున్నప్పుడే తల్లి కావచ్చు. తమ అందాన్ని కాపాడుకోవడానికి, కెరియర్ ఎదుగుదలకు అడ్డు కాకూడదని కోరుకునే సెలబ్రిటీలు, ప్రెగ్నెన్సీ రిస్క్‌ను కలిగివున్నవారు, దీర్ఘకాలికమైన వ్యాధికి గురై కోలుకునే వారు, ప్రీ-మెచ్యుర్ మెనోపాజ్ సమస్య ఎదురైనవారు, కుటుంబ, వ్యక్తిగత కారణాలతో లేటుగా పిల్లలను కనాలని భావించేవారు, ఈ సర్రోగసీ ప్రక్రియను ఎంచుకుంటున్నారు. ఇటువంటివారికి వరంగా మారింది ఎగ్ ఫ్రీజింగ్ టెక్నాలజీ. సింగిల్ గా ఉన్న పురుషులు కూడా అండాన్ని దాతనుంచి స్వీకరించి ఐవీఎఫ్ ద్వారా తమ శుక్ర కణాలతో సంయోగపర్చి పిండాన్ని సరోగసీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టి తండ్రిగా మారుతున్నారు.
తల్లి కావాలనుకున్న మహిళ అండాన్ని మైనస్ 196 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద భద్రపరచడాన్ని ఫ్రీజింగ్ చేస్తారు. ఫ్రీజ్ అయిన అండాలను మళ్లీ సాధారణ స్థితికి తీసుకురావడాన్ని థాయింగ్ అంటారు. ఇలా సాధారణ ఉష్ణోగ్రత స్థాయికి తీసుకువచ్చిన అండంలోకి భర్త వీర్యకణాన్ని చొప్పించి ప్రయోగశాలలో ఫలధీకరణ చేస్తారు. అలా ‘పిండం’ తయారవుతుంది. ఇలా తయారైన పిండాన్ని తాము ఎంపికచేసుకున్న మహిళ గర్భాశయంలోకి ప్రవేశపెడతారు. ఆ దంపతుల పిండాన్ని గర్భంలో మోసి అభివృద్ధి అయిన అనంతరం సరోగసీ మదర్ సాధారణ డెలివరీ లేదా సిజేరియన్ ద్వారా ప్రసవిస్తుంది.
డెలివరీ అనంతరం ఆ బిడ్డను తల్లిదండ్రులకు అప్పగిస్తారు. వీరి పిండాన్ని తొమ్మిది నెలలపాటు మోసిన మహిళకు ముందే మాట్లాడుకున్న ప్రకారం కొంత డబ్బు అందిస్తారు. ఈ ప్రక్రియ అంతా వైద్యుల పర్యవేక్షణలో సాగుతుంది. ఈ ప్రక్రియ విజయవంతం అయ్యే అవకాశాలు 40 నుంచి 60 శాతం వరకూ ఉంటాయి. ఐవీఎఫ్, టెస్ట్‌ట్యూబ్ బేబీ వంటి వాటిల్లో కూడా సక్సెస్ రేటు 60లోపే ఉంటుంది. భారత్‌లో సరోగసీ గర్బాలు అయ్యే ఖర్చు తక్కువగా ఉండటంతో దేశంలోకి విదేశీ మహిళలు ఆసక్తి చూపిస్తున్నారు.
The world’s first artificial womb facility, EctoLife, could incubate up to 30,000 babies a year. Learn More: https://t.co/NWnWbf5dKz#EctoLife #Science #Concepts #Biology pic.twitter.com/OsdeMZVJye
— Hashem Al-Ghaili (@HashemGhaili) December 9, 2022
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..