Realme 10S 5G: రియల్‌మీ నుంచి అదిరిపోయే ఫిచర్లతో రాబోతున్న మరో స్మార్ట్‌ఫోన్.. వివరాలివే..

Realme ఆకర్షణీయమైన ఫీచర్లతో ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ళ్లను విడుదల చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే Realme.. 108 మెగాపిక్సెల్స్‌తో Realme 10 Pro 5G, Realme 10 Pro + 5G ఫోన్‌లను భారత్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు మరో కొత్త స్మార్ట్..

Realme 10S 5G: రియల్‌మీ నుంచి అదిరిపోయే ఫిచర్లతో రాబోతున్న మరో స్మార్ట్‌ఫోన్.. వివరాలివే..
Realme 10s 5g
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Dec 17, 2022 | 9:24 PM

2022 సంవత్సరం మరో రెండు వారాలలో ముగిసిపోబోతుంది. అయితే సంవత్సనం ముగింపు అనగానే భారత్‌లో క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంత్రి పండుగల ఆఫర్లు మొదలయినట్లే. మరి ఇలాంటి తరుణంలోనే చైనా ప్రముఖ కంపెనీ Realme ఆకర్షణీయమైన ఫీచర్లతో ఒకదాని తర్వాత మరొకటి అన్నట్లుగా స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌ళ్లను విడుదల చేస్తోంది. కొన్ని రోజుల క్రితమే Realme.. 108 మెగాపిక్సెల్స్‌తో Realme 10 Pro 5G, Realme 10 Pro + 5G ఫోన్‌లను భారత్‌లో లాంచ్ చేసింది. ఇప్పుడు మరో కొత్త స్మార్ట్ ఫోన్ మోడల్‌ను చైనా మార్కెట్‌లోకి విడుదల చేసింది. అదే Realme 10S 5G.. ఇది బడ్జెట్ ధరలోనే మీడియా టెక్ డైమెన్షన్ 810 SoC ప్రాసెసర్, 5000mAh బ్యాటరీ కెపాసిటీతో మన ముందుకు వస్తోంది. మరి దీనిలోని ఫీచర్లు ఎలా ఉన్నాయో చూద్దాం..

  • ప్రస్తుతం చైనా మార్కెట్లో Realme 10S 5G లాంచ్ అయింది. ఈ నెలాఖరుకు లేదా వచ్చే ఏడాది ప్రారంభంలోనే భారత్‌లో కూడా విడుదల కానుంది. 
  • Realme 10S 5G (4GB + 64GB వేరియంట్) చైనాలో 1099 యూవన్లుగా ఉంది. అంటే భారత్‌లో దీని ధర సుమారుగా రూ. 13,100. ఉండవచ్చు. అలాగే 8GB + 256GB వేరియంట్ ధర 1299 యూవన్లు.  అంటే మన దేశంలో దాదాపు రూ. 15,400 ఉండవచ్చు.
  • ఈ స్మార్ట్‌ఫోన్ 1,080 x 2,400 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లేతో ఉంది.
  • ఇంకా 60Hz రిఫ్రెష్ రేట్,  180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. MediaTek డైమెన్సిటీ 810 SoC ప్రాసెసర్‌తో Realme 10S 5G లాంచ్ అయింది. 
  • ఆండ్రాయిడ్ 12 సపోర్ట్‌తో పని చేసే ఈ మోడల్ స్మార్ట్‌ఫోన్‌కు.. త్వరలో ఆండ్రాయిడ్ 13 ఓఎస్‌కి అప్‌డేట్ వస్తుందని కంపెనీ తెలిపింది.
  • కెమెరా విషయానికి వస్తే, Realme 10S 5G స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
  • ఇందులో మెయిన్ కెమెరా 50 మెగా పిక్సెల్ సెన్సార్, రెండో కెమెరా 2 మెగా పిక్సెల్ సెన్సార్‌తో ఉంది. ఇవే కాకుండా ముందు భాగంలో 8 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.
  • 5000mAh కెపాసిటీ బ్యాటరీని కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్ 33 వోల్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో వస్తోంది. 
  • కనెక్టివిటీ  చాయిస్‌లో 5G, 4G VoLTE, Wi-Fi 802.1ac, బ్లూటూత్ 5.2, GPS, USB-C పోర్ట్ ఉన్నాయి.