Noise Colorfit Icon3: రూ.2వేలలోపు ధర.. 150కు పైగా స్పోర్ట్స్ మోడ్స్.. స్మార్ట్ వాచ్ అంటే ఇలా ఉండాలి..

ఈ వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ ఉంది. దీనిని ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్న సమయంలో ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. 10 వరకు కాంటాక్టులను వాచ్ లోనే సేవ్ చేసుకోవచ్చు. 150కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లు ఈ స్మార్ట్ వాచ్ లో అందుబాటులో ఉన్నాయి.

Noise Colorfit Icon3: రూ.2వేలలోపు ధర.. 150కు పైగా స్పోర్ట్స్ మోడ్స్.. స్మార్ట్ వాచ్ అంటే ఇలా ఉండాలి..
Noise Colorfit Icon 3
Follow us
Madhu

|

Updated on: Apr 04, 2023 | 6:31 PM

ప్రస్తుతం యూత్ నుంచి వ‌ృద్ధులు వరకూ ట్రెండీ ఐటెం స్మార్ట్ వాచ్.. కేవలం టైం చూసుకోడానికి మాత్రమే కాదు స్మార్ట్ వాచ్.. స్టైలిష్ గా ఉండాలి. అత్యాధునిక సాంకేతికతతో కూడిన బెస్ట్ ఫీచర్లుండాలి. అది కూడా అనువైన్ బడ్జెట్ లోనే కావాలి. ఇలా ప్రతి ఒక్కరూ తమ అవసరాలకు అనుగుణంగా స్మార్ట్ వాచ్ లను కొనుగోలు చేస్తున్నారు. ఈ అభిరుచికి అనుగుణంగానే మార్కెట్లో పెద్ద సంఖ్యలో స్మార్ట్ వాచ్ లు లాంచ్ అవుతున్నాయి. దిగ్గజ కంపెనీలు కూడా తమ ఉత్పత్తులను లాంచ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నాయిస్ కంపెనీ మరో స్మార్ట్ వాచ్ ని లాంచ్ చేసింది. కలర్ ఫిట్ ఐకాన్ సిరీస్ లో కొత్త స్మార్ట్ వాచ్ ను తీసుకొచ్చింది. నాయిస్ కలర్ ఫిట్ ఐకాన్ 3(Noise Colorfit Icon 3) పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. దీనిలో బ్లూటూత్ కాలింగ్ తో పాటు దాదాపు 150కిపైగా స్పోర్ట్స్ మోడ్ లు ఉన్నాయి. దీని ధర, స్పెసిఫికేషన్లు, ఇతర ఫీచర్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

డిజైన్, లుక్.. ఈ స్మార్ట్ వాచ్ విభిన్నమైన రూపాలలో అందుబాటులో ఉంటుంది . సిలికాన్ స్ట్రాప్‍లను, మెటల్ బాడీని ఈ వాచ్ కలిగి ఉంది. స్క్రీన్ పాస్ కోడ్ ఫీచర్‌తో ఈ వాచ్ వస్తోంది. జెట్ బ్లాక్, మిడ్ నైట్ గోల్డ్, స్పేస్ బ్లూ, మ్యాట్ గోల్డ్, కామ్ బ్లూ, రోజ్ మయూవే కలర్ ఆప్షన్‍లలో ఈ వాచ్ లభిస్తోంది.

డిస్ ప్లే.. నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 3 స్మార్ట్ వాచ్ 1.91 ఇంచుల టీఎఫ్టీ స్క్వేర్ డిస్‍ప్లేతో వస్తోంది. సన్నని బెజిల్స్‌తో డిస్‍ప్లే ను ఆకర్షణీయంగా నాయిస్ తీర్చిదిద్దింది. 240×296 పిక్సల్స్ రిజల్యూషన్ తో పాటు 500 నిట్స్ బ్రైట్ నెస్ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

హెల్త్ ఫీచర్లు.. నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 3 వాచ్ లో చాలా రకాల హెల్త్ ఫీచర్లు ఉన్నాయి. హార్ట్ రేట్ మానిటరింగ్, స్లీప్ ట్రాకర్, బ్లడ్ ఆక్సిజన్ సాచురేషన్ లెవెల్స్ ట్రాకింగ్ కోసం ఎస్‍పీఓ2 సెన్సార్, బ్రీత్ ప్రాక్టీస్ వంటివి ఉన్నాయి.

కనెక్టివిటీ.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్‌ను ఈ వాచ్ కలిగి ఉంది. ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్న సమయంలో ఈ వాచ్ ద్వారానే కాల్స్ మాట్లాడవచ్చు. 10 వరకు కాంటాక్టులను సేవ్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్ వాచ్ లో 150కు పైగా స్పోర్ట్స్ మోడ్‍లు ఉన్నాయి.

సామర్థ్యం.. నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 3 వాచ్‍ను ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 7 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఇస్తుంది. ఫోన్‍కు కనెక్ట్ చేసుకున్నప్పుడు ఈ వాచ్‍లో నోటిఫికేషన్లను పొందవచ్చు. స్మార్ట్ ఫోన్‍లో నాయిస్‍ఫిట్ యాప్ డౌన్‍లోడ్ చేసుకొని.. ఈ వాచ్‍ను సింక్ చేసుకోవచ్చు. ఫిట్‍నెస్, వర్కౌట్ల వివరాలను చూడడం, సెట్టింగ్‍లను మార్చుకోవడం లాంటివి ఈ యాప్‍లో చేసుకోవచ్చు.

ధర ఎంతంటే.. నాయిస్ కలర్‌ఫిట్ ఐకాన్ 3 ధర రూ.1,999గా ఉంది. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్, నాయిస్ అధికారిక వెబ్‍సైట్‍లో ఈ వాచ్ సేల్‍కు వచ్చింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!