Bajaj platina: కొత్త వేరియేషన్‌లో వచ్చిన మైలేజ్ కింగ్ బజాజ్ ప్లాటినా-100.. అనువైన ధరలలో అందుబాటులోకి..
Bajaj platina:ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో విపణిలోకి సరికొత్త ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ మోటారు బైక్‌ను ఆవిష్కరించింది. భారతదేశంలోని అన్ని డీలర్షిప్లలో
Bajaj platina:ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో విపణిలోకి సరికొత్త ప్లాటినా 100 ఎలక్ట్రిక్ స్టార్ట్ మోటారు బైక్‌ను ఆవిష్కరించింది. భారతదేశంలోని అన్ని డీలర్షిప్లలో ఈ బైక్ విక్రయాలు జరపనున్నట్లు బజాజ్ ప్రకటించింది. నూతన బీఎస్ 6 ప్రమాణాలకు అనుగుణంగా ఈ బైక్ను రూపొందించారు. ‘కంఫర్టెక్ టెక్నాలజీ’ తో రూపొందిన ఈ నూతనన బైక్ ‘స్ప్రింగ్- ఆన్- స్ప్రింగ్’ నైట్రోక్స్ సస్పెన్షన్‌తో వస్తుంది. ఇది లాంగ్ రైడ్స్ చేసే వారికి సౌకర్యవంతంగా ఉంటుంది. ట్యూబ్ లెస్ టైర్లతో కూడిన బజాజ్ ప్లాటినా సురక్షితమైన, ఇబ్బంది లేని ప్రయాణానికి భరోసా ఇస్తుంది. కాగా, ఈ ఏడాది జులైలో విడుదలైన ప్లాటినా ఈఎస్ ఎలక్ట్రిక్ స్టార్ట్) బైక్తో పోలిస్తే ప్లాటినా కేఎస్ రూ.7,700 తక్కువ ధరకే లభించనున్నట్లు సంస్థ తెలిపింది. అంతేకాక, బజాజ్ ఈఎస్ డ్రమ్ వేరియంట్ కంటే ఇది రూ.8,000 కంటే తక్కువ ధరకే లభిస్తుంది.
రెండు కలర్ వేరియంట్లలో లభ్యం.. కాగా, ప్లాటినా 100KS బైక్ను 102సీసీ సింగిల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్లతో రూపొందించింది. ఇది 7,500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 7.77 బీహెచ్పీ వద్ద టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్కు మొత్తం నాలుగు గేర్ బాక్స్లను అమర్చారు. ఇది గరిష్టంగా గంటకు 90 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ మోడల్ కాక్టెయిల్ వైన్ రెడ్, ఎబోనీ బ్లాక్ విత్ సిల్వర్ డెకాల్స్ అనే రెండు రంగులలో లభ్యమవుతుంది. ఇది భారతదేశంలోని అన్ని బజాజ్ ఆటో డీలర్‌షిప్‌లలో లభిస్తుందని బజాజ్ ప్రకటించింది.
ఈ నూతన బైక్ స్ప్రింగ్ ఆన్ స్ప్రింగ్ నైట్రాక్స్ సస్పెన్షన్, ట్యూబ్ లెస్ టైర్లు, హ్యాండ్ గార్డ్స్, 20 శాతం పొడవైన ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్, క్విల్టెడ్ సీట్, LED DRL హెడ్ లాంప్, ప్రొటెక్టివ్ ట్యాంక్ ప్యాడ్, కొత్తగా రూపొందించిన ఇండికేటర్స్, మిర్రర్స్, వైడ్ రబ్బర్ ఫుట్‌ప్యాడ్ వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ బైక్ లాంచ్ గురించి బజాజ్ ఆటో లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ నారాయణ్ సుందరరామన్మా ట్లాడుతూ ‘‘సౌకర్యం విషయంలో బజాజ్ ప్లాటినా ఉత్తమ బైక్గా నిలిచింది. గత 15 సంవత్సరాల్లో 72 లక్షల బజాజ్ ప్లాటినా మోడళ్లను విక్రయించాం. మైలేజీ విషయంలో కూడా ఇది ఉత్తమ బైక్‌గా రాణిస్తుంది.’’ అన్నారు.
సెకండ్ హ్యాండ్ బైక్ కొనాలనుకుంటున్నారా?… అయితే మీకు కావాల్సిన బైక్ను నచ్చిన ధరలో తీసుకోండి ఇలా..