Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google Search: ఈ ఏడాది వీటి గురించి Googleలో అస్సలు సెర్చ్ చేయకండి.. వెతకగానే ఏమవుతుందో తెలుసా..

ఇది టెక్నాలజీ యుగం. ఏది కొనాలన్నా.. తినాలన్నా నెట్టింట్లో వెతకాల్సిందే. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో చక చకా వెతికితే సరిపోతుంది. అయితే ఇదే కొద్ది జాగ్రత్తతో చేయాలి.

Google Search: ఈ ఏడాది వీటి గురించి Googleలో అస్సలు సెర్చ్ చేయకండి.. వెతకగానే ఏమవుతుందో తెలుసా..
Google Search
Follow us
Sanjay Kasula

|

Updated on: Jan 02, 2023 | 12:29 PM

ఇంట్లో పప్పు కావాలన్నా.. ఉప్పు కావాలన్నా.. ఇళ్లు కావాలన్నా గూగుల్ తల్లిని అడగాల్సిందే. ఇప్పుడు అంతా ఇదే చేస్తున్నారు. నెట్టింట్లో వెతికితే కాని ఏది దొరకడం లేదు. తమ అవసరాల కోసం ఉదయం లేచింది మొదలు.. నిద్రపోయేవరకు గూగుల్ సెర్చ్ ఇంజన్‌లో సెర్చ్‌లో వెతుకుతూనే ఉంటారు. అయితే..ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ది చెందింది. ఇంట్లో కూర్చునే ఆన్‌లైన్‌లో ఎన్నో పనులు చేసుకునే సదుపాయం వచ్చేసింది. ఏదైనా అలాగే ఏదైనా కస్టమర్‌ కేర్‌ నంబర్‌ కావాలంటే గూగుల్‌లో సెర్చ్‌ చేస్టే ఇట్టే దొరికిపోతుంది. టెక్నాలజీ పరంగా ఏ చిన్న విషయాన్ని తెలుసుకోవాలన్నా మనకు గూగులే దిక్కు. ఈ 5జీ యుగంలో అరచేతిలో ప్రపంచాన్ని చూసేస్తున్నారు.. ఫోన్లోనే ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు. అయితే గూగుల్ సెర్చ్‌లో ‌ఏది వెతికినా దొరికేస్తుందని మనందరికి తెలిసిందే.

సెర్చ్ ఇంజిన్‌లో సమగ్ర సమాచారం బ్రాండ్ కాకుండా ఇతర అన్ని మూలాల నుండి వస్తుంది. మీరు Googleలో ఏదైనా వెతకవచ్చు, కొన్నింటి గురించి సెర్చ్ చేయడం అసలుకే ఎసరు తెస్తుందని హెచ్చరిస్తున్నారు టెక్కీలు. కాబట్టి, మీరు మరిచిపోయి కూడా Google సెర్చ్‌లో వీటి గురించి వెతకకండి. అస్సలు వెతకకూడని పదాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..

ప్రెజర్ కుక్కర్ బాంబ్.. బాంబ్ తయారీ..

పోలీసులు మీ తలుపు తట్టకూడదనుకుంటే.. బాంబును ఎలా తయారు చేస్తారు? మీరు ప్రెజర్ కుక్కర్ బాంబ్‌ను ఎలా తయారు చేస్తారు?.. వంటి ప్రశ్నలను Googleని అడగకండి. ఇలాంటి ప్రశ్న అడిగిన వెంటనే.. మీ సమాచారం సెక్యూరిటీ రాడార్‌కు తెలిసి పోతుంది.

ఇవి కూడా చదవండి

అశ్లీలత..

కొందరు తెలిసి..తెలియకు కొన్ని పదాలను గూగుల్‌లో సెర్చ్ చేస్తుంటారు. ఇందులో ముఖ్యంగా యువకులు కొన్ని తప్పులు చేస్తుంటారు. అంతే కాదు తప్పుడు పదాలను గూగుల్‌లో వెతుకుతుంటారు. అయితే, ఇలాంటి పదాలపై పూర్తి స్థాయిలో నిషేదం ఉంది. పిల్లల అశ్లీలత లేదా పిల్లలపై లైంగిక దాడికి సంబంధించిన కంటెంట్‌తో ఏ విధమైన వీడియో అయినా భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నేరం. అలాంటి అశ్లీల చిత్రాలను మీరు మీ గ్యాడ్జెట్‌లలో వీక్షించి డౌన్‌లోడ్ చేసుకుంటే.. పోలీసులు మీ ఇంటి కాలింగ్ బెల్ కొడుతారు.

క్రిమినల్ యాక్టివిటీ సంబంధిత ప్రశ్నలు

బాంబును ఎలా తయారు చేయాలో పైన పేర్కొన్న శోధనతో పాటు, యూజర్ల నేర ప్రవృత్తిని బహిర్గతం చేసే ఏవైనా సంబంధిత Google శోధనలు అడ్డుకుంటుంది. మళ్ళీ, కిడ్నాప్, మాదకద్రవ్యాల కోసం పదేపదే సెర్చ్ చేయకూడదు.

అబార్షన్-సంబంధిత సమాచారం కోసం

భారతదేశంలో వైద్యపరమైన అబార్షన్‌కు నిర్దిష్ట ప్రమాణాలు ఉన్నాయి. దీనికి కారణం, మీరు ఏవైనా లొసుగులను వెలికితీసేందుకు ప్రయత్నిస్తే.. మీ సమాచారం పోలీసులకు చేరుతుంది.

కొన్ని కీలక పదాలతో ఏ రకమైన సమాచారాన్ని అయినా వెతకడానికి ప్రయత్నించిన Google ఒప్పుకోదు.. మీరు ఏదైనా సమాచారం కోసం వెతకాలంటే దానికి కొన్ని హద్దులున్నాయి.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం