AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఫోన్‌ కొనాలనుకుంటున్నారా..? నంబర్‌ 5న ఓ సూపర్‌ ఫోన్‌ ఇండియన్‌ మార్కెట్‌లోకి వచ్చేస్తోంది! ఫీచర్లు ఇవే.. ఓ లుక్కేయండి!

మోటరోలా తన కొత్త మోటో G67 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 5న ఇండియాలో లాంచ్ చేయనుంది. ఇందులో శక్తివంతమైన స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్, 7000mAh భారీ బ్యాటరీ, 50MP సోనీ కెమెరా ఉన్నాయి. అద్భుతమైన ఫీచర్లతో వస్తున్న ఈ ఫోన్ కోసం వేచి ఉండటం మంచిది.

ఫోన్‌ కొనాలనుకుంటున్నారా..? నంబర్‌ 5న ఓ సూపర్‌ ఫోన్‌ ఇండియన్‌ మార్కెట్‌లోకి వచ్చేస్తోంది! ఫీచర్లు ఇవే.. ఓ లుక్కేయండి!
Moto G67 Power
SN Pasha
|

Updated on: Oct 29, 2025 | 11:52 PM

Share

మోటరోలా తన కొత్త మోటో G67 పవర్ స్మార్ట్‌ఫోన్‌ను నవంబర్ 5న ఇండియన్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేయనుంది. లాంచ్‌కు ముందు స్మార్ట్‌ఫోన్ తయారీదారు మోటో G67 పవర్ కొన్ని స్పెసిఫికేషన్‌లను ధృవీకరించింది. మోటరోలా నుండి రాబోయే స్మార్ట్‌ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 2 ప్రాసెసర్ ఉంటుంది. ఈ పరికరం సిలికాన్ కార్బన్ టెక్నాలజీని ఉపయోగించే 7,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్‌తో 50MP సోనీ LYT-600 ప్రైమరీ కెమెరా కూడా ఉంటుంది.

ఈ మధ్యలో ఫోన్‌ కొనాలానుకుంటున్న వారు.. ఈ ఫోన్‌ వచ్చేవరకు ఆగి, దానిపై ఒక లుక్కేసి అప్పుడు ఫోన్‌ కొంటే మంచిది. ఎందుకుంటే మంచి ధరలో ఇంత ఫీచర్లు ఉన్న ఫోన్‌, అది కూడా మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన మోడల్‌ను మిస్‌ అయ్యాం అనే బాధ లేకుండా ఉండాలంటే.. ఒక వారం పాటు ఆగి.. ఈ ఫోన్‌ చెక్‌ లిస్ట్‌లో దీన్ని కూడా చేర్చండి. నచ్చితే కొనండి. కాగా OPPO Find X9 Pro, OPPO Find X9 లతో పాటు OPPO ENCO X3s ఇయర్‌బడ్‌లు లాంచ్‌ అయ్యాయి. వాటిపై కూడా ఓ లుక్కేయండి.

మరిన్ని టెక్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి