
ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ బిలియన్ డేస్ దీపావళి సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సందర్భంగా మిడ్-బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఈ దీపావళికి మీలో ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటుంటే.. ఈ ఫోన్‌పై ఓ లుక్కేయండి. అదే మోటరోలా G96. ఈ ఫోన్ ఈ సంవత్సరం జూలైలో 8GB RAM, 256GB స్టోరేజ్‌తో విడుదల అయింది. ఇది పవర్‌ఫుల్ 5,500mAh బ్యాటరీ, 32MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. గత సంవత్సరం విడుదలైన మోటరోలా G85 5Gకి బదులుగా మోటరోలా ఈ ఫోన్‌ను G సిరీస్‌లో ప్రవేశపెట్టింది. హార్డ్‌వేర్, కెమెరా రెండింటినీ అప్‌గ్రేడ్ చేసింది.
ఈ మోటరోలా ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది: 8GB RAM + 128GB, 8GB RAM + 256GB. దీని ప్రారంభ ధర రూ.20,999 కాగా, దీని టాప్ వేరియంట్ ధర రూ.22,999. ఇది ఆష్లీ బ్లూ, డ్రెస్డెన్ బ్లూ, ఆర్చిడ్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ సేల్ సమయంలో ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.15,999 ప్రారంభ ధరకు లిస్ట్ అయింది. దీని ధర రూ.5,000. అదనంగా SBI బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో కొనుగోలు చేసినప్పుడు ఫ్లిప్‌కార్ట్ రూ.1,000 తగ్గింపును అందిస్తోంది.
ఇంకా మీరు మీ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే ఈ స్మార్ట్‌ఫోన్ ధరను మరింత తగ్గుతుంది. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.3,000 ధర లభిస్తే, మీరు రూ.12,000లకే కొత్త మోటరోలా G96ని సొంతం చేసుకోవచ్చు. అయితే మీ పాత ఫోన్‌కు ఎక్స్‌ఛేంజ్‌లో ఎంత వస్తుందనేది ఆ ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.
మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి