Redmi Smart Fire TV: బడ్జెట్ టీవీ లవర్స్‌కు పండగే.. ఎంఐ నయా స్మార్ట్ టీవీ లాంచ్.!

|

Jun 08, 2024 | 8:00 PM

భారతదేశంలో ప్రతి ఇంట్లో టీవీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. బడ్జెట్‌కు అనుగుణంగా ధనికుల ఇళ్ల దగ్గర నుంచి పేదల ఇళ్ల వరకూ ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరగతి వర్గం తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసుకుందామని అనుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు వారిని ఆకట్టుకోవడానికి బడ్జెట్ ధరలోనే స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32 2024 ఎడిషన్‌ను ఆవిష్కరించింది.

Redmi Smart Fire TV: బడ్జెట్ టీవీ లవర్స్‌కు పండగే.. ఎంఐ నయా స్మార్ట్ టీవీ లాంచ్.!
Redmi Fire Tv
Follow us on

భారతదేశంలో ప్రతి ఇంట్లో టీవీ అనేది తప్పనిసరిగా ఉంటుంది. బడ్జెట్‌కు అనుగుణంగా ధనికుల ఇళ్ల దగ్గర నుంచి పేదల ఇళ్ల వరకూ ప్రతి ఒక్కరి ఇంట్లో టీవీ ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో మధ్య తరగతి వర్గం తక్కువ ధరలోనే స్మార్ట్ టీవీలను కొనుగోలు చేసుకుందామని అనుకుంటూ ఉంటుంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు వారిని ఆకట్టుకోవడానికి బడ్జెట్ ధరలోనే స్మార్ట్ టీవీలను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32 2024 ఎడిషన్‌ను ఆవిష్కరించింది. ఇది గత సంవత్సరం మోడల్‌ను అనుసరించి వారి ప్రసిద్ధ స్మార్ట్ టీవీ లైనప్‌కు అప్‌డేట్ వెర్షన్‌గా నిలవనుంది. ఈ నేపత్యంలో ఎంఐ టీవీ 2024 వెర్షన్‌కు సంబంధించిన కీలక విషయాలను తెలుసుకుందాం. 

రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32 2024 ఎడిషన్‌ కొత్త మోడల్ ఫైర్ ఓఎస్‌లో రన్ అవుతూనే ఉంది. వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీతో పాటు మెరుగైన ఆడియో సామర్థ్యాలతో ఆధారితరంగా పని చేసే 32 అంగుళాల హెచ్‌డీ రెడీ డిస్‌ప్లేతో ఈ టీవీ వినియోగదారులను ఆకర్షిస్తుందని రెడ్‌మీ ప్రతినిధులు చెబుతున్నారు. 2024 ఎడిషన్ రెడ్‌మీ టీవీ అలెక్సా వాయిస్-ఎనేబుల్డ్ రిమోట్‌ ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ రిమోట్‌ను ఉపయోగించి మీరు ఒకే బటన్ క్లిక్ చేయడంతో వివిధ పనులను చేయవచ్చు. టీవీ మెటల్ బెజెల్ లెస్ ఫ్రేమ్‌తో వస్తుంది. 

రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32 2024 ఎడిషన్‌ ధర రూ. 11,999గా ఉంది. అయితే వినియోగదారులు ఐసీఐసీఐ బ్యాంక్ కార్డ్‌లను ఉపయోగించి ఈ టీవీను కొనుగోలు చేస్తే 1,000 తగ్గింపును పొందవచ్చు. అంటే దాదాపు రూ. 10,999కే ఈ టీవీను కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32 2024 ఎడిషన్‌  జూన్ 12 నుంచి ఎంఐ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సైట్‌ల నుంచి కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీ హెచ్‌డీ రెడీ డిస్‌ప్లే (1366—768 పిక్సెల్‌లు)తో వస్తుంది. ముఖ్యంగా ఈ టీవీ 178 డిగ్రీల వీక్షణ కోణాన్ని కలిగి ఉంటుంది. వివిడ్ పిక్చర్ ఇంజిన్ టెక్నాలజీ ద్వారా డిస్‌ప్లే మెరుగుపరిచారు. అదనంగా ఇది స్వయంచాలక తక్కువ లేటెన్సీ మోడ్, 6.5 ఎంఎస్ ప్రతిస్పందన సమయాన్ని కలిగి ఉంది. ఇది గేమింగ్‌తో పాటు వేగవంతమైన కంటెంట్‌కు అనుకూలంగా ఉంటుందని పేర్కొంటున్నారు. ఈ టీవీ 96.9 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితోవస్తుంది. 

ఇవి కూడా చదవండి

రెడ్‌మి స్మార్ట్ ఫైర్ టీవీ 32 2024 ఎడిషన్‌ టీవీ 1.5 జీహెచ్‌జెడ్ క్వాడ్-కోర్ కార్టెక్స్ ఏ 35 ప్రాసెసర్‌ ఆదారం పని చేస్తుంది. 1 జీబీ + 8 జీబీతో వచ్చే ఈ టీవీ స్మార్ట్ టీవీ ఫైర్ ఓఎస్ 7తో పనిచేస్తుంది. ముఖ్యంగా ఈ టీవీ ప్రైమ్ వీడియో, నెట్‌ఫ్లిక్స, డిస్నీ+ హాట్‌స్టార్ వంటి ప్రముఖ స్ట్రీమింగ్ సేవలతో సహా 12,000 యాప్‌లకు పైగా యాక్సెస్‌ను అందిస్తుంది. అలెక్సా ఇంటిగ్రేషన్‌తో కూడిన రెడ్‌మీ వాయిస్ రిమోట్‌ ద్వారా టీవీ గైడ్, ప్లేబ్యాక్ నియంత్రణలు, ఛానెల్ నావిగేషన్, మ్యూట్ వంటి బటన్స్ ద్వారా త్వరిత యాక్సెస్ కోసం ప్రత్యేక బటన్‌లతో వస్తుంది. ఈ యూజర్ ఫ్రెండ్లీ రిమోట్ వాయిస్ కమాండ్‌లతో పాటు షార్ట్‌కట్‌లతో టీవీని నావిగేట్ చేయవచ్చు. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..