AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amazon: ఫోన్‌ మార్చే ఆలోచనలో ఉన్నారా.? అమెజాన్‌ ప్రైమ్‌ డేలో లాంచ్‌ అవుతోన్న కొత్త ఫోన్స్‌

పలు స్మార్ట్‌ ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా లాంచింగ్‌కు సిద్ధమవుతోన్న ఈ ఫోన్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

Amazon: ఫోన్‌ మార్చే ఆలోచనలో ఉన్నారా.? అమెజాన్‌ ప్రైమ్‌ డేలో లాంచ్‌ అవుతోన్న కొత్త ఫోన్స్‌
Amazon Prime Day
Narender Vaitla
|

Updated on: Jul 08, 2024 | 9:42 AM

Share

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రైమ్‌ యూజర్ల కోసం ప్రత్యేకంగా అమెజాన్‌ ప్రైమ్‌ డే పేరుతో సేల్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. జులై 20, 21వ తేదీల్లో కేవలం రెండు రోజులు మాత్రమే నిర్వహించిన ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు.

పలు స్మార్ట్‌ ఫోన్స్‌తో పాటు ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌పై ఏకంగా 40 శాతం డిస్కౌంట్ అందించనున్నారు. అలాగే పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేస్తే 10 శాతం డిస్కౌంట్‌ పొందొచ్చు. ఈ సేల్‌లో భాగంగా పలు స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీలు కొత్త ఫోన్‌లను లాంచ్‌ చేస్తున్నాయి. ఇంతకీ ఈ సేల్‌లో భాగంగా లాంచింగ్‌కు సిద్ధమవుతోన్న ఈ ఫోన్‌లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం…

Samsung Galaxy M35:

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌35 స్మార్ట్‌ఫోన్‌ జులై 17వ తేదీన లాంచ్‌ కానుంది. ఈ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో కూడిన అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను ఇవ్వనున్నారు. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను, సెల్ఫీలు.. వీడియో కాల్స్‌ కోసం 13 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించనున్నారు. 25 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 6000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించనున్నారు.

Motorola Razr 50 Ultra:

మోటోరోలా రేజర్‌ 50 అల్ట్రా స్మార్ట్‌ ఫోన్‌ జులై 10వ తేదీన లాంచ్‌ కానుంది. అమెజాన్‌ సేల్లో భాగంగా ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 10 వేల డిస్కౌంట్‌ లభిస్తోంది. ఈ పోన్ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.9 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను ఇవ్వనున్నారు. 50 మెగాపిక్సెల్స్‌ రెయిర్‌ కెమెరా ఈ ఫోన్ సొంతం.

OnePlus Nord CE 4 Lite 5G (Ultra Orange):

వన్‌ప్లస్ బడ్జెట్‌ ఫోన్‌ నార్డ్‌ సీఈ4 లైట్‌ 5జీ ఫోన్‌ ఇప్పటికే లాంచ్‌ కాగా తాజాగా అమెజాన్ ప్రైమ్‌ డే సేల్‌లో అల్ట్రా ఆరంజ్‌ కలర్‌లో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ ధర రూ. 19,999గా నిర్ణయించారు. సేల్‌లో భాగంగా డిస్కౌంట్‌ లభించనుంది.

Redmi 13 5G:

ప్రైమ్‌ డే సేల్‌లో అందుబాటులోకి వస్తున్న మరో కొత్త ఫోన్‌ రెడ్‌మీ 13 5జీ. జులై 9వ తేదీన ఈ ఫోన్‌ను లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌లో 120 హెచ్‌జెడ్‌తో కూడిన సూపర్‌ ఇమ్మెర్సివ్‌ అమోఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ ఆటమ్స్‌ సౌండ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఈ ఫోన్‌ సొంతం.

HONOR 200 series:

హానర్‌ 200 సిరీస్‌ ఫోన్‌ కూడా అమెజాన్‌ ప్రేమ్‌ డే సేల్‌లో భాగంగ అందుబాటులోకి రానుంది. ఈ ఫోన్‌లో జుల్‌ 18వ తేదీన లాంచ్‌ చేయనున్నారు. ఈ ఫోన్‌లో హానర్ 200 స్మార్ట్‌ఫోన్‌లో 6.7 ఇంచెస్‌తో కూడిన హెచ్‌డీ+ కర్వ్డ్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. 2664 x 1200 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌, 120 హెచ్‌జెడ్‌ రిఫ్రెట్ రేట్‌ను అందింనున్నారు. 400 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్ సొంతం. ఈ ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..