AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Lava Blaze: భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌.. రూ.18 వేలకే 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే..

లావా బ్లేజ్‌ కర్వ్‌ 5జీ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ మంగళవారం లాంచ్‌ అయ్యింది. కాగా మార్చి 14వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్‌ అమ్మకానికి రానుంది. లావా ఈ స్టోర్‌లతో పాటు లావా రిటైల్‌ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో...

Lava Blaze: భారత మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్‌.. రూ.18 వేలకే 3డీ కర్వ్‌డ్‌ డిస్‌ప్లే..
Lava Blaze Curve 5g
Narender Vaitla
|

Updated on: Mar 05, 2024 | 3:59 PM

Share

మార్కెట్లో రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్‌ హంగామా చేస్తోంది. రోజురోజుకీ అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఇక కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరలోనే అధునాతన ఫీచర్లను పరిచయం చేస్తున్నాయి కంపెనీలు. ప్రస్తుతం డిస్‌ప్లేకు ప్రాధానత్య ఇస్తూ మార్కెట్లోకి కొంగొత్త ఫోన్‌లను తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్ ఫోన్‌ తయారీ సంస్థ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను లాంచ్‌ చేసింది.

లావా బ్లేజ్‌ కర్వ్‌ 5జీ పేరుతో ఈ కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ బడ్జెట్‌లోనే మంచి ఫీచర్లతో కూడిన ఈ ఫోన్‌ మంగళవారం లాంచ్‌ అయ్యింది. కాగా మార్చి 14వ తేదీ నుంచి ఈ స్మార్ట్ ఫోన్‌ అమ్మకానికి రానుంది. లావా ఈ స్టోర్‌లతో పాటు లావా రిటైల్‌ స్టోర్స్‌లో ఈ ఫోన్‌ అమ్మకాలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్ ఫోన్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ఇంతకీ ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

లావా బ్లేజ్‌ కర్వ్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పని చేస్తుంది. ఇక స్క్రీన్‌ను అధిక ప్రాధాన్యత ఇచ్చిన ఈ ఫోన్‌లో 6.67 ఇంచెస్‌తో కూడిన అమోఎల్‌ఈడీ 3డీ కర్వ్డ్‌ డిస్‌ప్లేను అందించారు. 120Hz రిఫ్రెష్‌ రేటు ఈ స్క్రీన్‌ సొంతం. ఇక ఈ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరాను అందించార . అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం 32 మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్ కెమెరాను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. లావా బ్లేజ్‌ కర్వ్‌ 5జీ ఫోన్‌ను రెండు వేరియంట్స్‌లో లాంచ్‌ చేశారు. వీటి ధర విషయానికొస్తే 8జీబీ+ 128జీబీ వేరియంట్‌ ధర రూ.17,999 కాగా, 8జీబీ+256 జీబీ వేరియంట్‌ ధర రూ.18,999గా నిర్ణయించారు. ఐరన్ గ్లాస్, విరిడియన్ గ్లాస్ కలర్స్‌లో తీసుకొచ్చారు. మరి ఈ స్మార్ట్ ఫోన్‌ మార్కెట్లో ఎలాంటి వండర్స్‌ క్రియేట్ చేస్తుందో చూడాలి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..

బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌