Laptops under 50000: కిర్రాక్ ఫీచర్లతో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌లను చూస్తే అస్సలు వదలరు.. మతిపోయే డిజైన్‌తో అదిరిపోయే స్పెసిఫికేష్లన్లు..

|

Apr 11, 2023 | 4:30 PM

అందుబాటులో ధరల్లో ఎక్కువ ఫీచర్లతో వచ్చే ల్యాప్‌టాప్‌ల గురించి యువత ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల వారి సంబంధించి యాప్స్ త్వరగా రన్ అయ్యేలా ఎక్కువ జీబీ ర్యామ్ ఉన్న ల్యాప్‌టాప్‌లను కోరుకుంటారు.

Laptops under 50000: కిర్రాక్ ఫీచర్లతో వచ్చే ఈ ల్యాప్‌టాప్‌లను చూస్తే అస్సలు వదలరు.. మతిపోయే డిజైన్‌తో అదిరిపోయే స్పెసిఫికేష్లన్లు..
Laptop Market Delhi
Follow us on

సాధారణంగా ఆఫీసుల్లో కంప్యూటర్ల వాడుతూ ఉంటారు. కరోనా మహమ్మారి తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ విపరీతంగా పెరిగింది. దీంతో ఆఫీస్‌ల్లో కూడా ల్యాప్‌టాప్‌లే దర్శనమిస్తున్నాయి. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఉద్యోగులను రిక్రూట్ చేసుకునే కంపెనీలు కూడా ఉద్యోగి దగ్గర ల్యాప్‌టాప్ ఉండాలనే నిబంధన పెడుతున్నాయి. మరికొన్ని కంపెనీలు ల్యాప్‌టాప్ అలవెన్స్ కూడా ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత కాలంలో ల్యాప్‌టాప్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కాబట్టి అందుబాటులో ధరల్లో ఎక్కువ ఫీచర్లతో వచ్చే ల్యాప్‌టాప్‌ల గురించి యువత ఎక్కువగా సెర్చ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఉద్యోగుల వారి సంబంధించి యాప్స్ త్వరగా రన్ అయ్యేలా ఎక్కువ జీబీ ర్యామ్ ఉన్న ల్యాప్‌టాప్‌లను కోరుకుంటారు. అలాగే యువత కూడా గేమింగ్ కోసం సూపర్ స్పీడ్ ల్యాప్‌టాప్‌లను కొనుగోలు చేయాలని కోరుకుంటూ ఉంటారు. నిపుణులు ల్యాప్‌టాప్‌లను రెండు రకాలుగా వర్గీకరిస్తున్నారు. అందులో రూ.40 వేల నుంచి రూ.50 వేల ధరల మధ్య ఉన్న అదిరిపోయే ల్యాప్‌టాప్‌లను ఓ సారి చూద్దాం.

హెచ్‌పీ ల్యాప్‌టాప్ 14 ఎస్

హెచ్‌పీ 14 ఎస్ ల్యాప్‌టాప్ 14 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. ఈ నోట్‌బుక్ బరువు కేవలం 1.4 కిలోలు మాత్రమే. రైజెన్ 5 ప్రాసెసర్‌తో ఇంటిగ్రేటెడ్ ఏఎండీ గ్రాఫిక్స్, 8జీబీ ర్యామ్+512 జీబీ ఎస్ఎస్‌డీ నిల్వ సామర్థ్యంతో అలెక్సా వాయిస్ సపోర్ట్ ఈ ల్యాప్‌టాప్ ఆకర్షణీయంగా ఉంటుంది. అలాగే ఈ ల్యాప్ ధర రూ.49,999. ఈ ల్యాప్‌టాప్‌ను హెచ్‌పీ స్టోర్ ద్వారా కొనుగోలు చేస్తే ఉచితంగా హెచ్‌పీ బ్యాగ్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు. 

లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 జెన్ 6

ఈ ల్యాప్‌టాప్ ఆఫీసు లేదా కాలేజీకి వెళ్లేవారికి మంచి ఎంపికగా ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్‌ ఏంఎండీ రైజెన్ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే 8జీబీ ర్యామ్‌తో పాటు 512 జీబీ నిల్వ సామర్థ్యంతో వస్తుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్‌ 15.6 -అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్‌ప్లే వస్తుంది. 45  వాట్స్ బ్యాటరీతో అందరినీ ఈ ల్యాప్‌టాప్ ఆకట్టుకుంటుంది. అలాగే ల్యాప్‌టాప్‌లో గోప్యతా షట్టర్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.48,990గా ఉంది.

ఇవి కూడా చదవండి

అసస్ వివోబుక్ ఫ్లిప్ 14

అసస్ వివో బుక్ ఫ్లిప్ 14 యువతను ఎక్కువగా ఆకట్టుకుంటుంది. ఈ ల్యాప్‌టాప్ కమ్ టాబ్లెట్ వర్క్ ఫ్రం హోం చేసేవారికి అనువుగా ఉంటుది. వివో బుక్ ఫ్లిప్ 14 11 జెనరేషన్ ఐ 5 ప్రాసెసర్‌తో వస్తుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్ 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌తో వస్తుంది. 14 పూర్తి హెచ్ టచ్ ఎనేబుల్డ్ డిస్‌ప్లేను ఈ ల్యాప్ టాప్ ప్రత్యేకత. దీని బరువు 1.5 కేజీలు ఉంటుంది. ఈ ల్యాప్‌టాప్ ధర రూ.44,990గా ఉంది. 

ఇన్‌ఫినిక్స్ ఇన్ బుక్

ఇన్‌ఫినిక్స్ కంపెనీ ఎక్కువగా స్మార్ట్‌ఫోన్లు తయారు చేస్తుంది. ఈ మధ్య కాలంలో ఈ కంపెనీ రిలీజ్ చేస్తున్న ల్యాప్‌టాప్‌లు యువత ఎక్కువగా ఇష్టపడతారు. ఈ ఇన్ బుక్ 8 జీబీ ర్యామ్‌తో 512 జీబీ స్టోరేజ్‌తోవ స్తుంది. 10 జెన్ ఐ5 ప్రాసెసర్‌తో వస్తుంది. 14 అంగుళాల పూర్తి హెచ్‌డీ డిస్ ప్లేతో పాటు బ్యాక్‌లిట్ కీబోర్డ్‌తో పాటు 55 వాట్స్ బ్యాటరీతో వస్తుంది. ఈ ల్యాప్ ధర రూ.45,999గా ఉంది. 

ఎంఐ నోట్ బుక్ ప్రో 

ఎంఐ నుంచి వచ్చే నోట్‌బుక్ ప్రో ల్యాప్‌టాప్ ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ. 3,000 విలువైన తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ మెటల్ బాడీ తో 2.5 కే క్యూ హెచ్‌డీ ప్లస్ 14 అంగుళాల డిస్‌ప్లేతో ఆకర్షణీయంగా ఉంటుంది. 11 జెన్ ఐ5 ప్రాసెసర్‌తో ల్యాప్‌టాప్ బరువు 1.4 కిలోలు ఉంటుంది. ఈ ల్యాప్ ధర రూ.50,999గా కంపెనీ నిర్ణయించింది. 

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..