Smart Pants: ప్యాంట్ జిప్ ఊడిపోతే ఫోన్లో అలర్ట్.. ఏం టెక్నాలజీ గురూ.. వివరాలు ఇవి..

మీరు ఏదైనా అఫీషియల్ ఫంక్షన్ లో ఉన్నారు. ఆ సమయంలో ఎవరో వచ్చి మీరు ప్యాంట్ జిప్ పెట్టుకోలేదు అని చెవిలో చెబితే ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది? అందుకే అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు స్మార్ట్ ప్యాంట్లు అందుబాటులోకి వచ్చాయి.

Smart Pants: ప్యాంట్ జిప్ ఊడిపోతే ఫోన్లో అలర్ట్.. ఏం టెక్నాలజీ గురూ.. వివరాలు ఇవి..
Pant Zipper
Follow us
Madhu

|

Updated on: May 30, 2023 | 6:30 AM

మీరు ఏదైనా అఫీషియల్ ఫంక్షన్ లో ఉన్నారు. ఆ సమయంలో ఎవరో వచ్చి మీరు ప్యాంట్ జిప్ పెట్టుకోలేదు అని చెవిలో చెబితే ఆ పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది? సరిగ్గా మీరు ఏదైనా ప్రజెంటేషన్ చేయాలనుకొంటున్నప్పుడు ప్యాంట్ జిప్ ఊడిపోయి ఉంటే? చాలా షేమ్ ఫీల్ అవుతాం కదా? అందుకే అలాంటి పరిస్థితులను అధిగమించేందుకు స్మార్ట్ ప్యాంట్లు అందుబాటులోకి వచ్చాయి. అత్యాధునిక సాంకేతిక దీనిలో వినియోగించారు. ప్యాంట్ జిప్ ఊడిపోతే దాని గుండా ప్రవేశించే గాలి ద్వారా అది జిప్ సెన్స్ అయ్యి మీ ఫోన్ కి నోటిఫికేషన్ పంపిస్తుంది. అదెలా సాధ్యం అంటారా? ఈ స్టోరీ పూర్తిగా చదవాల్సిందే మరీ..

స్మార్ట్ దుస్తులు..

ఇటీవల కాలంలో అన్ని స్మార్ట్ అయిపోతున్నాయి. వినియోగించే వ్యక్తిగత వస్తువుల దగ్గర నుంచి వంటి గది సామగ్రి వరకూ అన్నీ స్మార్ట్ టెక్నాలజీని వినియోగించుకొని మనిషికి మంచి సౌలభ్యాన్ని అందిస్తున్నాయి. ఇదే క్రమంలో స్మార్ట్ దుస్తులు కూడా ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. ఆరోగ్యాన్ని ట్రాక్ చేసే షూస్, జాక్ గార్డ్ ఎక్విప్డ్ జాకెట్లు, స్మార్ట్ జాకెట్లు మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఇప్పుడు స్మార్ట్ ప్యాంట్ కూడా మీకు అందుబాటులోకి వచ్చింది. ఇది మీరు జిప్ పెట్టుకున్నారో లేదో సెన్స్ చేసి ఫోన్ కి మెసేజ్ చేస్తుంది.

ఇవి కూడా చదవండి

ట్విట్టర్ లో వీడియో..

గై డ్యూపంట్ అనే వ్యక్తి ఈ స్మార్ట్ ప్యాంట్ సంబంధించిన వీడియోను తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఆ వీడియోలో అతను తన ప్యాంట్‌ని విప్పిన వెంటనే, అతని ప్యాంట్‌లోని సెన్సార్లు ఫ్లై డౌన్ అయిందని గుర్తించి, అతనికి ఫ్లై డౌన్ అయిందని అతనికి తెలియజేసే నోటిఫికేషన్ ను ఫోన్ కి పంపించింది. ఇది వైఫ్లై అనే సర్వీస్ ద్వారా సాధ్యమైంది.

ఎలా పనిచేస్తుందంటే..

ఆ వ్యక్తి ఇది ఎలా పనిచేస్తుందో కూడా వివరించాడు. హాల్ ఎఫెక్ట్ సెన్సార్‌కు కొన్ని సేఫ్టీ పిన్‌లను జోడించినట్లు వెల్లడించారు. అలాగే జిప్పర్‌కు శక్తివంతమైన మాగ్నెట్‌ను అమర్చినట్లు చెప్పాడు. ఇవి జేబులోని ఈఎస్పీ-32కి కనెక్ట్ అయ్యి ఉంటాయి. హాల్ ఎఫెక్ట్ సెన్సార్ కొన్ని సెకన్ల పాటు ఆన్‌లో ఉన్నప్పుడు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

ఎక్కడ దొరకుతుంది..

మీరు ఈ ప్యాంట్‌ని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో కొనలేరు. ఈ ప్యాంట్‌లను ట్విట్టర్ యూజర్ తన స్నేహితుడి కోసం తయారు చేశాడు. ప్రస్తుతానికి ఇది ప్రాజెక్ట్ లాగా ఉంది. భవిష్యత్తులో మీరు అలాంటి స్మార్ట్ టెక్నాలజీని చూసే అవకాశం ఉంది.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..