iQOO Z9 Lite: రూ. 10 వేలలో 5జీ ఫోన్‌.. భారత మార్కెట్లోకి సూపర్‌ స్మార్ట్‌ఫోన్‌..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తోంది. ఈ క్రమంలోనే మార్కెట్లోకి 5జీ ఫోన్‌లు సైతం సందడి చేస్తున్నాయి. మొదట్లో భారీగా ధర పలికిన 5జీ ఫోన్‌లు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే 5జీ ఫోన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి...

iQOO Z9 Lite: రూ. 10 వేలలో 5జీ ఫోన్‌.. భారత మార్కెట్లోకి సూపర్‌ స్మార్ట్‌ఫోన్‌..
Iqoo Z9 Lite
Follow us

|

Updated on: Jul 15, 2024 | 4:18 PM

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5జీ సేవలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. చిన్న చిన్న పట్టణాల్లో కూడా 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి వస్తోంది. ఈ క్రమంలోనే మార్కెట్లోకి 5జీ ఫోన్‌లు సైతం సందడి చేస్తున్నాయి. మొదట్లో భారీగా ధర పలికిన 5జీ ఫోన్‌లు ప్రస్తుతం తగ్గుముఖం పట్టాయి. కంపెనీల మధ్య నెలకొన్న పోటీ నేపథ్యంలో తక్కువ ధరకే 5జీ ఫోన్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. రూ. 10 వేల మార్కెట్‌ను టార్గెట్ చేసుకొని కొంగొత్త ఫోన్స్‌ తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం ఐక్యూ మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది.

ఐక్యూ జెడ్‌ 9 లైట్‌ పేరుతో భారత మార్కెట్లోకి కొత్త 5జీ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకురావడం విశేషం. ఇంతకీ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఐక్యూ జెడ్‌9 లైట్ స్మార్ట్‌ ఫోన్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6,300 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్‌ 14 బేస్డ్‌ ఫన్‌టచ్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌ 14ని అందించారు.

ఇక ఈ ఫోన్‌ను ఆక్వా ఫ్లో, మోచా బ్రౌన్‌ కలర్స్‌లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే ఈ ఫోన్‌ డిస్‌ప్లే విషయానికొస్తే ఇందులో 6.57 ఇంచెస్‌తో కూడిన ఎల్‌సీడీ డిస్‌ప్లేను అందించారు. 90 హెచ్‌జెడ్‌ రిఫ్రెష్‌ రేట్‌, 840 నిట్స్‌ బ్రైట్‌నెస్‌ ఈ స్క్రీన్‌ సొంతం. బ్యాటరీ పరంగా చూస్తే ఈ ఫోన్‌లో 15 వాట్స్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని అందించారు. ఇక కనెక్టివిటీ కోసం ఇందులో వైఫై 5, బ్లూటూత్‌ 5.4, టైప్‌- సి యూఎస్‌బీ వంటి ఫీచర్లను అందించారు.

కెమెరా విషయంలో కూడా కాంప్రమైజ్‌ అవ్వలేదు. ఇందులో 50 మెగాపిక్సెల్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో మెగాపిక్సెల్స్‌తో కూడిన ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఇక ఇదులో సెక్యూరిటీ కోసం సైడ్‌ మౌంటెడ్‌ ఫింగర్‌ప్రింట్‌ సెన్సర్‌ ఆప్షన్‌ను ఇచ్చారు. ధర విషయానికొస్తే ఐకూ జెడ్‌9 లైట్‌ 4 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 10,499కాగా, 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 11,499గా నిర్ణయించారు. లాంచింగ్ ఆఫరలో భాగంగా కొన్ని బ్యాంకులకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 500 ఇనస్టాంట్ డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఈ ఫోన్‌ అమ్మకాలు ఈ నెల 20వ తేదీ నుంచి ప్రారంభంకానున్నాయి.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..