AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Google: అనుకోకుండా గూగుల్‌లో ఇలాంటివి సెర్చ్‌ చేస్తున్నారా? మీ మెడకు ఉచ్చు బిగిసినట్లే.. జాగ్రత్త!

Google Search: ఏదైనా సమాచారం కావాలంటే ముందుగా గూగుల్‌ను ఆశ్రయిస్తుంటాము. గూగుల్‌లో ఏదీ అడిగినా క్షణాల్లోనే సమాచారం అందిస్తుంది. కానీ కొన్ని గూగుల్‌లో వెతికితే ప్రమాదంలో చిక్కుకుంటారని మీకు తెలుసా? అనుకోకుండా కూడా మీరు గూగుల్‌లో అలాంటి పదాలను సెర్చ్‌ చేసినట్లయితే మీ మెడకు ఉచ్చు బిగించినట్లే. అవి ఏంటో తెలుసుకుందాం..

Google: అనుకోకుండా గూగుల్‌లో ఇలాంటివి సెర్చ్‌ చేస్తున్నారా? మీ మెడకు ఉచ్చు బిగిసినట్లే.. జాగ్రత్త!
Google Search
Subhash Goud
|

Updated on: Jan 23, 2026 | 5:52 PM

Share

Google Search: నేటి ప్రపంచంలో ఇంటర్నెట్, సెర్చ్ ఇంజన్లు, AI నిత్యావసరాలుగా మారాయి. అయితే ప్రతి ఆన్‌లైన్ శోధన డిజిటల్ రికార్డును సృష్టిస్తుందని కొంతమందికి మాత్రమే అర్థమవుతుంది. అవసరమైతే ఏజెన్సీలు ఈ సమాచారాన్ని ట్రాక్ చేయగలవు. ప్రత్యేకించి అనుమానాస్పద లేదా చట్టవిరుద్ధమైన వాటి కోసం సెర్చ్‌ చేసినట్లయితే మీరు సమస్యల్లో ఇరుక్కున్నట్లే.

భారతదేశంలో ఐటీ చట్టం, భారత శిక్షాస్మృతి, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) వంటి చట్టాలు ఆన్‌లైన్ కార్యకలాపాలను ఖచ్చితంగా పర్యవేక్షిస్తాయి. చాలా సందర్భాలలో మీరు ఎటువంటి చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడకపోయినా, తప్పుడు సమాచారం కోసం సెర్చ్‌ చేసినా మిమ్మల్ని అనుమానంలోకి నెట్టివేస్తుంది. అందుకే గూగుల్‌లో ఏది సెర్చ్‌ చేసినా ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి.

ఉగ్రవాద సంస్థలు, వాటి ప్రచారం, నియామక ప్రక్రియలు లేదా భావజాలానికి సంబంధించిన సమాచారం కోసం వెతకడం చాలా ప్రమాదకరం. అలాంటి సందర్భాలలో మీరు సేర్చ్‌ చేసిన విషయాలు వెంటనే దర్యాప్తు సంస్థలకు వెళ్లిపోతుంది. వారు తీవ్రమైన చట్టాలను మీపై ఉపయోగించవచ్చు.

ఇవి కూడా చదవండి

పిల్లలపై లైంగిక వేధింపులు లేదా అశ్లీల చిత్రాలను చిత్రీకరించే వీడియోలు, ఫోటోలు లేదా వెబ్‌సైట్‌ల కోసం శోధించడం తీవ్రమైన నేరం. భారతదేశంలో దీనికి ఎలాంటి క్షిమించే చట్టాలు లేవు. అది ప్రమాదవశాత్తు జరిగినా కూడా శిక్ష తీవ్రంగా ఉంటుందని గుర్తించుకోండి.

ఇది కూడా చదవండి: Bank Holiday: జనవరి 24న బ్యాంకులు మూసి ఉంటాయా? ఎందుకు..?

ఫోన్ హ్యాకింగ్, బ్యాంక్ ఖాతా ఉల్లంఘనలు, OTP లేదా UPI మోసం, పాస్‌వర్డ్ క్రాకింగ్ వంటి వాటి కోసం శోధించడం కూడా ప్రమాదకరం. సైబర్ నేరాలు పెరుగుతున్నందున పోలీసులు అలాంటి కీలకపదాలపై నిఘా ఉంచుతారు. ఎవ్వరు చూడరు కదా అని గూగుల్‌లో సెర్చ్‌ చేస్తే మీరు సెర్చ్‌ చేసిన వివరాలన్ని కూడా దర్యాప్తు సంస్థలకు చేరుతుంది.

ఇంట్లో బాంబుల తయారీ గురించి, అక్రమ ఆయుధాలు, 3D-ప్రింటెడ్ తుపాకులు లేదా ఆయుధ మార్పుల గురించి సమాచారం కోసం వెతకడం నేరమే. అలాగే మాదకద్రవ్యాల తయారీ లేదా అమ్మకాల పద్ధతులు, డార్క్ వెబ్ లింక్‌లు లేదా రహస్య లావాదేవీల కోసం సాధనాలను కనుగొనేటప్పుడు మాదకద్రవ్యాలు, సైబర్ చట్టాలు ఏకకాలంలో వర్తించవచ్చు.

ఇది కూడా చదవండి: Silver: సిల్వర్‌ మాయాజాలం.. 20 రోజుల్లోనే ధనవంతులను చేసిన వెండి!

ఆధార్, పాన్, పాస్‌పోర్ట్ వంటి పత్రాలను నకిలీ చేయడం లేదా కొనుగోలు చేయడానికి సంబంధించిన శోధనలు కూడా నేరాలు. ఇది నేరుగా గుర్తింపు దొంగతనం, మోసం వర్గంలోకి వస్తుంది. AI ప్లాట్‌ఫారమ్‌లు చట్టవిరుద్ధమైన అభ్యర్థనలను బ్లాక్ చేస్తాయి. అలాగే అనుమానాస్పద కార్యకలాపాలను ఫ్లాగ్ చేయగలవు. వీటిని రహస్య లేదా సురక్షితమైనవిగా పరిగణించడం పెద్ద తప్పు.

నేర్చుకోవడానికి, ఖచ్చితమైన సమాచారం కోసం ఇంటర్నెట్‌ను ఉపయోగించండి. ఏదైనా పరిశోధన చేస్తున్నప్పుడు విశ్వసనీయ సైట్లకే పరిమితం అవ్వండి. మీరు అనుకోకుండా చట్టవిరుద్ధమైన కంటెంట్‌ను చూసినట్లయితే వెంటనే దానిని నివేదించండి.

మరిన్ని టెక్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

మఖానా ప్రస్థానాన్ని చాటిచెప్పనున్న బిహార్.. ఏం చేయనుందో తెలుసా?
మఖానా ప్రస్థానాన్ని చాటిచెప్పనున్న బిహార్.. ఏం చేయనుందో తెలుసా?
రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్‌ కిడ్‌..
రెండో సినిమాకే రిస్క్ చేస్తున్న స్టార్‌ కిడ్‌..
గూగుల్‌లో అనుకోకుండా ఇవి సెర్చ్ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
గూగుల్‌లో అనుకోకుండా ఇవి సెర్చ్ చేస్తున్నారా? ఏమవుతుందో తెలుసా?
స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా..
స్టైలింగ్ విషయంలో మాళవిక తరువాతే ఎవరైనా..
చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
చిరంజీవి మారిపోయారా.. బాబీ కోసం ఏం చేస్తున్నారో తెలుసా
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
ఆ హీరో యాక్టింగ్ చూసి.. నేను గొప్ప నటుడ్ని అనే గర్వం దిగింది'
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
టాలీవుడ్ మార్కెట్ కావాలి.. కానీ తెలుగు టైటిల్స్ పెట్టరా..
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
ఇంటర్ హాల్‌టికెట్ల 2026లో తప్పులు దొర్లాయా? ఇలా సరిచేసుకోండి
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
తెలుగు ఇండస్ట్రీలో లక్కీ ఛామ్‌.. ముద్దుగుమ్మ ఉంటే సినిమా హిట్టే
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..
వామ్మో! మరీ ఇలా ప్లాన్ చేసాక.. రౌడీ ఇంక దొరుకుతాడా..