HP Laptops: ఏఐ ఫీచర్‌తో రెండు నయా ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసిన హెచ్‌పీ.. ఫీచర్స్‌లో వీటికి సాటి లేవంతే..!

| Edited By: Ram Naramaneni

Jul 28, 2024 | 8:42 AM

తాజాగా ప్రముఖ కంపెనీ హెచ్‌పీ రెండు నయా ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ముఖ్యంగా సూపర్ ఫీచర్స్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్స్ యువతను అమితంగా ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా, హెచ్‌పీ ఓమ్నీ బుక్ ఎక్స్ పేరుతో ఏఐ ల్యాప్‌టాప్స్‌ను ప్రస్తుతం భారతదేశంలో లాంచ్ చేశారు. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ఎలైట్ ప్రాసెసర్ ద్వారా పని చేస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.

HP Laptops: ఏఐ ఫీచర్‌తో రెండు నయా ల్యాప్‌టాప్స్‌ను లాంచ్ చేసిన హెచ్‌పీ.. ఫీచర్స్‌లో వీటికి సాటి లేవంతే..!
Hp Ai Laptops
Follow us on

భారతదేశంలో ఇటీవల కాలంలో ల్యాప్‌టాప్స్ వినియోగం బాగా పెరిగింది. ముఖ్యంగా కరోనా విలయం తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగింది. ఒకవేళ ఆఫీస్‌కు వెళ్లినా అత్యవసర సమయాల్లో పని చేయడానికి ప్రతి ఇంట్లో ల్యాప్‌టాప్ అనేది తప్పనిసరి వస్తువుగా మారింది. ముఖ్యంగా విద్యార్థులకు కూడా ల్యాప్‌టాప్స్ కావాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు సరికొత్త ఫీచర్స్‌తో ల్యాప్‌టాప్స్‌ను రిలీజ్ చేస్తున్నారు. తాజాగా ప్రముఖ కంపెనీ హెచ్‌పీ రెండు నయా ల్యాప్‌టాప్స్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ముఖ్యంగా సూపర్ ఫీచర్స్‌తో వచ్చే ఈ ల్యాప్‌టాప్స్ యువతను అమితంగా ఆకట్టుకుంటాయని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా, హెచ్‌పీ ఓమ్నీ బుక్ ఎక్స్ పేరుతో ఏఐ ల్యాప్‌టాప్స్‌ను ప్రస్తుతం భారతదేశంలో లాంచ్ చేశారు. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ఎలైట్ ప్రాసెసర్ ద్వారా పని చేస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో హెచ్‌పీ రిలీజ్ చేసిన నయా ల్యాప్‌టాప్స్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా హెచ్‌పీ వరల్డ్ స్టోర్స్, హెచ్‌పీ ఆన్‌లైన్ స్టోర్‌లలో రూ. 1,69,934 ప్రారంభ ధరలో అట్మాస్ఫియరిక్ బ్లూ కలర్‌లో లభిస్తుంది. అలాగే హెచ్‌పీ ఓమ్నీ బుక్ ఎక్స్ కూడా రూ. 1,39,999 ప్రారంభ ధరలో మెటోర్ సిల్వర్ కలర్‌లో లభిస్తుంది. హెచ్‌పీ ఎలైట్ బుక్ అల్ట్రా స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ఎలైట్ ఎక్స్ ప్రాసెసర్‌‌తో పాటు హెక్సాగాన్ ఎన్‌పీయూ ఆధారంగా పని చేస్తుంది. అలాగే ఈ ల్యాప్‌టాప్ 14 అంగుళాల డయాగ్నల్ డిస్‌ప్లే వస్తుంది. ఈ ల్యాప్ టాప్ గరిష్టంగా 300నిట్స్ బ్రైట్‌నెస్‌తో పని చేస్తుంది. అలాగే ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 26 గంటల బ్యాటరీ లైఫ్ ఉంటుంది. ముఖ్యంగా ఫాస్ట్ ఛార్జింగ్‌‌కు సపోర్ట్ చేసే ఈ ల్యాప్‌టాప్ డ్యూయల్ స్పీకర్‌లతో వస్తుంది. అలాగే ఓమ్నీ బుక్ ఎక్స్ విషయానికి వస్తే ఈ ల్యాప్‌టాప్ కంటెంట్ క్రియేటర్లు, ఫ్రీలాన్సర్‌ల రిటైల్ కస్టమర్‌లను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. ఈ ల్యాప్‌టాప్ ఇది స్నాప్‌డ్రాగన్ ఎక్స్ ఎలైట్‌తో ఆధారంతో పని చేస్తూ నెక్స్ట్ జెన్ విండోస్, కోపిలట్ ప్లస్, మైక్రోసాఫ్ట్ హోమ్, స్టూడెంట్ ఎడిషన్ 2021లో రన్ అవుతుంది. ఈ ల్యాప్ టాప్ కూడా 14 అంగుళాల డిస్‌ప్లేతో వస్తుంది. 

ఈ కొత్త ల్యాప్‌టాప్‌లు అంతర్నిర్మిత హెచ్‌పీ కంపానియన్, పర్సనల్ ఏఐ అసిస్టెంట్‌తో వస్తాయి. అందువల్ల వినియోగదారులు పర్సనల్ ఫైల్‌లను విశ్లేషించడానికి, అంచనా వేయడం సులభం అవుతుంది. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు కోపైలెట్ ప్లస్ ఆధారంగా పనిచేస్తాయి. అలాగే ఈ ల్యాప్‌టాప్స్‌లో కొత్త పాలీ కెమెరా ప్రో స్పాట్‌లైట్, బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ & రీప్లేస్, ఆటో ఫ్రేమింగ్ వంటి ఫీచర్లు ఉంటాయి. ఈ రెండు ల్యాప్‌టాప్‌లు కొత్త ఏఐ హెలిక్స్ లోగోతో వస్తాయి. అలాగే ఈ ల్యాప్‌టాప్స్‌ 50 శాతం రీసైకిల్ చేసిన అల్యూమినియంతో వస్తయని హెచ్‌పీ ప్రతినిధులు చెబుతున్నారు. 

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..