Shivaratri wishes: వాట్సప్ స్టిక్కర్స్‌తో శివరాత్రి విషెస్‌ ఇలా చెప్పేయండి.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.

దేశవ్యాప్తంగా భక్తులు శివరాత్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రజలంతా ఉదయం నుంచే దేవాలయాలకు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆ భోలా శంకరుడిని దర్శించుకుంటున్నారు...

Shivaratri wishes: వాట్సప్ స్టిక్కర్స్‌తో శివరాత్రి విషెస్‌ ఇలా చెప్పేయండి.. ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.
Shivaratri Sticker Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Feb 18, 2023 | 7:27 AM

దేశవ్యాప్తంగా భక్తులు శివరాత్రిని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ప్రజలంతా ఉదయం నుంచే దేవాలయాలకు తరలివచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ ఆ భోలా శంకరుడిని దర్శించుకుంటున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని శివాలయలన్నీ భక్తులతో సందడిగా మారాయి. ఇక పండుగ సందర్భంగా స్నేహితులకు, బంధువులకు పండుగ శుభాకాంక్షలు తెలపడం సర్వసాధారణమైన విషయం. ఈ క్రమంలోనే మెసేజ్‌ల రూపంలో విషెస్‌ చెబుతున్నారు. మరి వాట్సాప్‌ స్టిక్కర్స్‌, జిఫ్‌ ఫైల్స్‌ ద్వారా విషెస్‌ చెబితే భలే ఉంటుంది కదూ. ఇంతకీ వాట్సాప్‌ ద్వారా విషెస్‌ ఎలా పంపాలో తెలుసుకుందాం..

వాట్సాప్‌ స్టిక్కర్స్‌ ద్వారా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే ముందుగా వాట్సప్‌ స్టిక్కర్‌ ప్యాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందుగా స్మార్ట్‌ఫోన్‌లో వాట్సప్ ఓపెన్ చేయాలి. అనంతరం మీరు మెసేజ్‌ పంపాలనుకుంటున్న వారి ఛాట్‌ విడో ఓపెన్‌ చేయాలి. తర్వాత ఛాట్ బాక్స్ పక్కన ఉన్న ఎమొజీ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. కింద కనిపించే ఆప్షన్స్‌లో స్టిక్కర్ ఐకాన్ పైన క్లిక్ చేయాలి. అప్పటికే మీరు డౌన్‌లోడ్‌ చేసుకున్న స్టిక్కర్స్‌ కనిపిస్తాయి. అయితే మీకు కావాల్సిన స్టిక్కర్స్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే + ఐకాన్‌ పైన క్లిక్‌ చేయాలి.

అనంతరం ఆల్‌ స్టిక్కర్స్‌ సెక్షన్‌లోకి వెళ్లి కిందికి స్క్రోల్ చేస్తే డిస్కవర్‌ స్టిక్కర్ యాప్స్‌పైన క్లిక్‌ చేయాలి. వెంటనే గూగుల్‌ ప్లేస్టోర్‌ ఓపెన్‌ అవుతుంది. తర్వాత ప్లే స్టోర్ సెర్చ్‌ బాక్స్‌లో శివరాత్రి 2023 అని టైప్‌ చేయాలి. వెంటనే వాటికి సంబంధించి స్టిక్కర్‌ ప్యాక్స్‌ కనిపిస్తాయి. వీటిలో మీకు నచ్చిన ప్యాక్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. వెంటనే డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్ ప్యాక్స్ మీ స్మార్ట్‌ఫోన్‌లో యాప్స్ లిస్ట్‌లో కనిపిస్తుంది. స్మార్ట్‌ఫోన్‌లో ఆ స్టిక్కర్ ప్యాక్ యాప్ ఓపెన్ చేయాలి. అందులో మీకు కావాల్సిన స్టిక్కర్స్‌ని + ఐకాన్ క్లిక్ చేసి వాట్సప్‌లోకి లోడ్ చేయొచ్చు. స్టిక్కర్స్ యాడ్ చేసిన తర్వాత వాట్సప్ యాప్‌లో స్టిక్కర్స్ సెక్షన్‌లో మీరు డౌన్‌లోడ్ చేసిన స్టిక్కర్ ప్యాక్ చూడొచ్చు. అందులోంచి మీకు నచ్చిన స్టిక్కర్‌ను షేర్ చేయొచ్చు. ఇలా వాట్సాప్‌ ద్వారా ట్రండీగా శివరాత్రి విషెస్‌ చెప్పొచ్చన్నమాట.

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..