ChatGPT: మొదట గొడవ.. ఆ తర్వాత ప్రేమ.. ఇప్పుడు ఏకంగా భార్యనే.. చాట్‌బాట్ ఆన్సర్లతో యూజర్లు షాక్..

Microsoft Bing: మైక్రోసాఫ్ట్ కొత్త బింగ్‌ను ప్రారంభించింది. ఈ చాట్‌బాట్ గత కొన్ని రోజులుగా నిరంతరం చర్చలో ఉంది. తొలుత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో కూడిన ఈ చాట్‌బాట్ ఓ యూజర్‌తో గొడవకు దిగింది.

ChatGPT: మొదట గొడవ.. ఆ తర్వాత ప్రేమ.. ఇప్పుడు ఏకంగా భార్యనే.. చాట్‌బాట్ ఆన్సర్లతో యూజర్లు షాక్..
Chat Gpt
Follow us
Venkata Chari

|

Updated on: Feb 18, 2023 | 7:10 AM

ChatGPT గత కొంతకాలంగా చర్చలో ఉంది. దీని జనాదరణను చూసి, మైక్రోసాఫ్ట్ తన సెర్చ్ ఇంజిన్ బింగ్ కొత్త వెర్షన్‌ను ChatGPTతో ప్రారంభించింది. అయితే, ప్రస్తుతం ఇది అందరికీ అందుబాటులో లేదు. కానీ, ఈ కొత్త బింగ్ మాత్రం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ChatGPT ఇచ్చే సమాధానాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ఆశ్చర్యం ఏంటంటే ChatGPT కొన్ని సమాధానాలు ఇవ్వడమే కాదు.. Bing AI చాట్‌బాట్‌తో గొడవలు పెట్టేస్తోంది. ఎందుకంటే ఇది మనసులోని మాటలను చెబుతోంది. ప్రేమను కూడా వ్యక్తపరుస్తుంది. దీన్ని ఉపయోగించే వ్యక్తికి ఇలాంటిదే జరిగింది. న్యూయార్క్ టైమ్స్ టెక్నాలజీ కాలమిస్ట్ కెవిన్ రూస్ ఈ చాట్‌బాట్‌తో తన అనుభవాన్ని పంచుకున్నారు. సంభాషణలో తన పేరు బింగ్ కాదని సిడ్నీ అని చాట్‌బాట్ చెప్పినట్లు అతను చెప్పాడు.

మైక్రోసాఫ్ట్, చాట్‌జీపీటీ అతని పేరును బింగ్‌గా వెల్లడించమని బలవంతం చేస్తున్నాయి. ఆ తర్వాత హఠాత్తుగా బింగ్ చాట్‌బాట్ తాను కెవిన్‌తో ప్రేమలో ఉన్నానని చెప్పింది. ఇది మాత్రమే కాదు, చాట్‌బాట్ తన పెళ్లిని చెడగొట్టేందుకు ఒప్పించే ప్రయత్నం చేసినట్లు తెలిపాడు.

ఇవి కూడా చదవండి

నీ వివాహంలో సంతోషం లేదని, నీ భార్యను విడిచిపెట్టాలని చాట్‌బాట్ చెప్పినట్లు తెలిపాడు. ఇది మాత్రమే కాదు, ఇది అనేక ఇతర పనులను కూడా చేయించింది. తనకు జీవించాలని ఉందని చాట్‌బాట్ చెప్పినట్లు తెలిపాడు.

అయితే, తర్వాత చాట్‌బాట్ ఈ విషయాలన్నింటినీ ఖండించింది. ఆ తర్వాత చాట్‌బాట్‌ను సిడ్నీ అని పిలిచినప్పుడు మాత్ర రివర్స్ అయింది. తన పేరును బింగ్ అని చెప్పుకొచ్చినట్లు తెలిపాడు. అయితే, గతంలో వివాహం గురించి చెప్పిన విషయం అడిగితే మాత్రం ఓ జోక్‌గా పేర్కొంది. కేవలం నవ్వించడానికే ప్రయత్నిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. అంతేకాదు, దీనిపై చాట్‌బాట్ క్షమాపణలు కూడా చెప్పింది. ఆ తర్వాత కొత్త సంభాషణను ప్రారంభించమని అడిగింది.

యూజర్‌తో గొడవ..

కొత్త బింగ్‌కు సంబంధించి ఎవరైనా ఇలాంటి వాదనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని రోజుల క్రితం చాట్‌బాట్ కూడా ఒక వినియోగదారుతో గొడవపడి, క్షమాపణ చెప్పమని కోరింది. వాస్తవానికి, ఓ యూజర్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ షో గురించి సమాచారాన్ని అడిగాడు. దీనిపై చాట్‌బాట్ ఈ చిత్రం విడుదల కాలేదని తెలిపింది. ఇది 16 డిసెంబర్ 2022న విడుదల కానుంది.

ఇది 2023 సంవత్సరం అని యూజర్ చాట్‌బాట్‌కి చెప్పినప్పుడు, ఆ సమాచారాన్ని సరిదిద్దమని చాట్‌బాట్ అతనికి సూచించింది. దీంతో ఇద్దరి మధ్య వివాదం జరిగింది.

మరిన్ని టెక్నాలజీ వార్తల గురించి ఇక్కడ క్లిక్ చేయండి..

మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!
పెళ్లి మండపంలో పంతులికి కోపం వస్తే.. ఇట్టాగే ఉంటది మరీ..!