Smartphone: వామ్మో అంత నెట్ వాడేస్తున్నారా.? భారతీయులు నెలకు ఎంత డేటా వాడుతున్నారో తెలిస్తే..
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్‌లు తక్కువ ధరకు అందుబాటులోకి రావడం, టెలికం కంపెనీల మధ్య పోటీ పెరగడంతో ఇంటర్ నెట్ ఛార్జీలు భారీగా తగ్గడంతో నెట్ వినియోగం పెరిగిపోయింది. సోషల్ మీడియా విస్తృతి పెరగడం, ప్రతీ పనికి స్మార్ట్ ఫోన్..
ప్రపంచవ్యాప్తంగా ఇంటర్ నెట్ వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. స్మార్ట్ ఫోన్‌లు తక్కువ ధరకు అందుబాటులోకి రావడం, టెలికం కంపెనీల మధ్య పోటీ పెరగడంతో ఇంటర్ నెట్ ఛార్జీలు భారీగా తగ్గడంతో నెట్ వినియోగం పెరిగిపోయింది. సోషల్ మీడియా విస్తృతి పెరగడం, ప్రతీ పనికి స్మార్ట్ ఫోన్ అనివార్యంగా మారడం కూడా ఇంటర్‌నెట్ వినియోగం పెరగడానికి కారణాలు చెప్పవచ్చు. ఇక యూట్యూబ్, వాట్సాప్, ఫేస్‌బుక్ వంటి వాటికి యూజర్లు ఎక్కువ సమయం కేటాయిస్తుండడంతో ఇంటర్‌నెట్ వినియోగం భారీగా పెరిగింది.
ఈ నేపథ్యంలోనే తాజాగా భారతీయులు ఎంత డేటాను వినియోగిస్తున్నారన్న అంశంపై నిర్వహించిన అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. నోకియా మొబైల్ బ్రాడ్ బ్యాండ్ ఇండెక్స్ రిపోర్ట్‌లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. గడిచిన ఏడాదితో పోల్చితే భారత్‌తో డేటా వినియోగం ఏకంగా 13.6 శాతం పెరిగినట్లు తేలింది. ఒక్కో భారతీయుడు నెలకు సగటున 19.5 జీబీ డేటా వాడుతున్నట్లు రిపోర్టులో వెల్లడించారు.
ఇదిలా ఉంటే మొబైల్ ఫోన్లకు సంబంధించిన డేటా వినియోగం గత ఐదేళ్లలో మూడు రెట్లకు పైగా పెరిగింది. 2022కు సంబంధించి మొత్తం డేటా వినియోగంలో 4 జీ నెట్ వర్క్ 99 శాతం షేర్‌తో మొదటి స్థానంలో ఉందని రిపోర్ట్‌లో తేలింది. ఇక రానున్న రోజుల్లో డేటా వినియోగం మరింత పెరిగే అవకాశం ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..