Whatsapp: మెసేజ్‌ చూసినా బ్లూటిక్‌ రాకూడదా.. ఈ సింపుల్‌ ట్రిక్‌ ఫాలో అయితే సరి..

Whatsapp: స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తున్న ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఉపయోగించే యాప్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఆకట్టుకునే ఫీచర్లు, యూజర్‌ ఫ్రెండ్లీ ఆపరేటింగ్‌ ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ దక్కడానికి గల కారణాలుగా చెప్పొచ్చు...

Whatsapp: మెసేజ్‌ చూసినా బ్లూటిక్‌ రాకూడదా.. ఈ సింపుల్‌ ట్రిక్‌ ఫాలో అయితే సరి..
Whatsapp
Follow us
Narender Vaitla

|

Updated on: Aug 25, 2022 | 3:19 PM

Whatsapp: స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగిస్తున్న ప్రతీ ఒక్కరూ కచ్చితంగా ఉపయోగించే యాప్‌లో వాట్సాప్‌ మొదటి స్థానంలో ఉంటుంది. ఆకట్టుకునే ఫీచర్లు, యూజర్‌ ఫ్రెండ్లీ ఆపరేటింగ్‌ ఈ యాప్‌కు ఇంతటి క్రేజ్‌ దక్కడానికి గల కారణాలుగా చెప్పొచ్చు. వాట్సాప్‌ తీసుకొచ్చిన ఫీచర్స్‌లో బ్లూటిక్‌ ఒకటి. యూజర్‌ మెసేజ్‌ను ఓపెన్‌ చూస్తే పంపిన వ్యక్తికి బ్లూ టిక్‌ చూపిస్తుంది. ఒకవేళ బ్లూటిక్‌ లేకపోతే ఆ మెసేజ్‌ను చూడనట్లు అర్థం. అయితే కొందరు తాము మెసేజ్‌లను చదివినా ఆ విషయం తెలియకూడదనుకుంటారు. మరి బ్లూటిక్‌ కనిపించకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా.? ప్రత్యేకంగా ఎలాంటి యాప్‌ అవసరం లేకుండా చిన్న సెట్టింగ్స్‌ ద్వారా ఈ పని చేయొచ్చు. ఇందుకోసం ఏం చేయాలంటే..

ముందుగా వాట్సాప్‌ను ఓపెన్‌ చేసి పైన కుడివైపు కనిపించే మూడు చుక్కల మీద క్లిక్‌ చేయాలి. అనంతరం సెట్టింగ్స్‌లోకి వెళ్లి అకౌంట్‌ ఆప్షన్‌పై ట్యాప్‌ చేయాలి. అందులో కనిపించే ప్రైవసీ ఆప్షన్‌ను క్లిక్‌ చేసి. రీడ్‌ రిసిప్ట్స్‌ అనే ఫీచర్‌ను డిసేబుల్‌ చేస్తే సరిపోతుంది. పాపప్స్‌ విధానం ద్వారా కూడా మీరు మెసేజ్‌ చూసినట్లు అవతలి వ్యక్తికి తెలియదు. ఇందుకోసం ముందు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నోటిఫికేషన్‌పై క్లిక్‌ చేయాలి. అనంతరం పాపప్‌ నోటిఫికేషన్‌ ఫీచర్‌ మీద నొక్కాలి. తర్వాత అందులో కనిపించే మూడు ఆప్షన్స్‌లో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎవరైనా మెసేజ్‌ పంపిస్తే వెంటనే ఆ మెసేజ్‌ స్క్రీన్‌పై పాపప్‌ రూపంలో కనిపిస్తుంది. కానీ అవతలి వారికి మాత్రం బ్లూ టిక్‌ కనిపించదు.

ఇవి కూడా చదవండి

మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం క్లిక్ చేయండి..